జెన్నీ జిరాఫీ తెల్లవారుజామున అడవిలో ”తిరగడానికి వెళ్తుంది. ఆమె సిగ్గరి. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. తన పొడవైన మెడతో ఇతరులతో మాట్లాడటం ఆమెకు కష్టంగా ఉంది. మెడను నిరంతరం వంచడంతో అలసిపోయింది.
వేకువజామున ఒంటరిగా షికారు చేస్తే రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి మంచి వ్యాయామం.రెండవది ఆ సమయంలో అడవిలో చాలా జంతువులు గాఢనిద్రలో ఉంటాయి. ఇది ఆమెకు, ఇతరుల తోటల్లో పూలు, పండ్లు దొంగిలించే అవకాశాన్ని కల్పించింది.
బోబో ఎలుగుబంటి తోటలో అరటిపండ్లు పక్వానికి వచ్చాయి. పండిన తీయని అరటిపండ్లు జెన్నీకి ఇష్టం. ఆమె తరచుగా అటువైపు వెళ్లేది.జంతువుల బారి నుంచి రక్షించడానికి బోబో తోట చూట్టూ ముళ్ల తీగలు ఏర్పాటు చేసాడు. కానీ ఇది జెన్నీకి సరిపోలేదు. ఆమె చాలా పొడవుగా ఉంది.తన పొడవైన మెడతో చెట్టు చిటారు కొమ్మన వేలాడుతున్న ఏ పండునైనా తెంపగలదు.
బోబో తన తోటలో జరుగుతున్న అరటిపండ్ల దొంగతనంతో విచారంగా ఉన్నాడు. అతనికి జెన్నీపై అనుమానం ఉంది. కానీ ఏ సాక్ష్యాధారం లేకుండా ఆమెతో పోట్లాడి మరింత ఆందోళన చెందడానికి ఇష్టపడలేదు. ఎంతో ఆలోచించిన తర్వాత, తన స్నేహితుడు మోంటీ కోతితో మాట్లాడాడు.
"బోబో, నువ్వు ఆ దొంగకి గుణపాఠం చెప్పాలి. లేకపోతే నీ తోటలో ఏమీ మిగలవు" చెప్పాడు మోంటీ.
“నువ్వు చెప్పింది నిజమే. ఇది జెన్నీ చేతివాటమని అనుకుంటున్నాను. ఎత్తుగా, పొడవుగా ఉన్న తన మెడ ఉపయోగించి పొద్దున్నే పండ్లన్నంటిని తినేస్తుంది. దయచేసి ఆమె నుంచి నా తోటను రక్షించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి.” కొద్దిసేపు ఆలోచించిన తర్వాత “నా దగ్గర ఒక
పరిష్కారం ఉంది" అని బోబోకి ఏదో వివరించి చెప్పాడు మోంటీ.
"మీ పరిష్కారం పని చేస్తుందనిపిస్తోంది" అన్నాడు.బోబో సంతోషంగా,“ఎందుకు ఆలస్యం? రేపే మార్కెట్కి వెళ్లి మనకు కావలసిన వస్తువులు తెచ్చుకుందాం.”
మర్నాడు వారు మార్కెట్కి వెళ్లారు. అక్కడ మోంటీకి తెలిసిన ఒక మెకానిక్ ఉన్నాడు. మోంటీ అతన్ని కొన్ని టైర్లు అడిగాడు.
“వీటితో ఏం చేస్తావు?”
Esta historia es de la edición December 2022 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 2022 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఆసక్తికర విజానం
వంతెనల నిర్మాణం
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు