బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు. జిన్నీ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కులో దాక్కున్నది. చాలా గడ్డిని మేయడంతో దానికి నిద్ర వచ్చింది.
పెద్దగా హారన్ మోగడంతో దానికి మెలకువ వచ్చింది. అప్పుడు తెల్లవారుజాము అవుతోంది. జిన్నీ ట్రక్కులోంచి బయటికి చూసేసరికి చుట్టూ పచ్చగా కనిపించింది. అక్కడి ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
“ఇది నా ఊరిలా కనిపించడం లేదే. నేను ఎక్కడికి చేరుకున్నాను?” అనుకుంది జిన్నీ తన మనసులోనే.
“వెల్ కమ్ టు కూర్గ్" అని అక్కడ రాసి ఉన్న బోర్డు కనిపించింది. కూర్గ్? ఈ పేరు ఇంతకుముందెప్పుడూ వినలేదు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గాలిలో భిన్నమైన పరిమళం వ్యాపించింది. గ్రామంలోని ప్రజలు అగరుబత్తీలు కాల్చారు. కానీ అది అగరుబత్తుల వాసన కాదు! ట్రక్కు ఆగగానే జిన్నీ మెల్లిగా కిందకు దూకింది.
ఏం చేయాలా? అని ఆలోచిస్తూ ఉండగానే చెట్టు కింద ఉడుతల గుంపు కనిపించింది. అవి సరదాగా ఆడుతున్నాయి.
“హలో! నా పేరు జిన్నీ. ప్రతి చోటా వ్యాపించి ఉన్న ఈ సువాసన ఏమిటో దయచేసి నాకు చెప్పగలరా?”.
“హాయ్ నా పేరు సాలీ" ఒక ఉడుత తోకను ఊపుతూ చెప్పింది.
“నువ్వు ఇక్కడికి కొత్త. అందుకే ఈ వాసనను గుర్తించ లేకపోతున్నావు. నువ్వు కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ లో ఉన్నావు. ఇది కాఫీ వాసన. టీ లాగానే కాఫీ కూడా కొందరు తాగుతారు కదా. కానీ ఇక్కడ అందరూ కాఫీ తాగుతారు. ఇది కొద్దిగా చేదు, కానీ రుచికరమైన పానీయం".
"కాఫీ?" జిన్నీ ఇంతకు ముందు ఈ పేరు వినలేదు. “దయచేసి దాని గురించి మరింత వివరంగా చెప్పండి”.
సాలీ తల ఊపి "ఈ ప్రాంతంలో కాఫీ పండిస్తారు. అందుకే కూర్గాని 'భారతదేశపు కాఫీ రాజధాని' అని కూడా పిలుస్తారు. ఇక్కడ చాలా కాఫీ తోటలు ఉన్నాయి. నేను నీకు డోడో సీతాకోకచిలుకను పరిచయం చేస్తాను.
నువ్వు దానితో కలిసి ఈ తోటలను చూసి రావచ్చు. వాటి గురించి చాలా తెలుసుకోవచ్చు. అది ఎగురుతూనే ఉంటుంది. కాబట్టి దానికి కాఫీ గురించి అన్ని రకాల సమాచారం తెలుసు” అని చెప్పింది.
Esta historia es de la edición October 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో