చంపకవనం శివార్లలో చార్లీ చింపాజీకి ఒక సంగీత పాఠశాల ఉంది. ఎన్నో జంతువులు, పక్షులు అతని స్కూల్లో సంగీత వాయిద్యాలు ప్లే చేయడం నేర్చుకున్నాయి. జంపీ కోతి పియానో నేర్చుకుంటున్నాడు. ఇంట్లో పియానో కొనడానికి తగినంత డబ్బు లేకపోవడంతో అతను ప్రతిరోజు కష్టపడి స్కూల్లోనే సాధన చేసేవాడు.
ఒక రోజు చార్లీ పక్క అడవిలో తన సోదరుడి కుమార్తె పెళ్లి జరగబోతుందని, తాను వెళ్లాలని, మూడు వారాల పాటు స్కూల్ మూసివేస్తున్నామని అందరికీ చెప్పాడు.
'మూడు వారాలు పియానో వాయించకుండా నేను ఎలా ఉండగలను?’ మనసులో అనుకున్నాడు జంపీ.
సాయంత్రం 5.30కి చార్లీ సోదరుడు అతనికి ఫోన్ చేసాడు.
"స్టూడెంట్స్ అంతా వెళ్లిపోయారు. అరగంట తర్వాత నేను బయలుదేరుతాను" చెప్పాడు చార్లీ.
కానీ అతని సోదరుడు పట్టుబట్టడంతో చార్లీ “సరే వెంటనే బయలుదేరుతున్నాను" అని జవాబు ఇచ్చాడు.స్కూల్ మూసి వేయసాగాడు.
ఫోన్ మాట్లాడుతున్న సమయంలో చార్లీ మెయిన్ కరెంట్ స్విచ్ ఆఫ్ చేసాడు. జంపీ లోపల ఉన్నాడని అతనికి తెలియదు.
'స్కూల్ మూసి వేస్తున్నాం. తిరిగి ఒకటవ తేదీన తెరుచుకుంటుంది' అనే బోర్డు అంతకుముందే స్కూల్ బయట పెట్టి ఉంది. తాళం వేసి హడావిడిగా వెళ్లిపోయాడు చార్లీ.
వాష్ రూమ్‌లోంచి బయటకు వచ్చిన జంపీ అది చూసి షాక్ తిన్నాడు. స్కూల్ కిటికీలు, తలుపులు అన్నీ మూసేసారు. తలుపు కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది బయటి నుంచి తాళం వేసి ఉంది.
'సార్ ఎక్కడున్నారు? ఆయన ఆరు గంటలకి బయలుదేరాలి, అంత తొందరగా ఎలా వెళ్లారు?' ‘అరగంట సేపు పియానో వాయించాలనుకున్నాను.
కానీ ఇప్పుడు నేను మూడు వారాలపాటు స్కూల్లో బంధీనైపోవాలి' అనుకుని భయపడ్డాడు.
జంపీ స్కూల్ తలుపులు, కిటికీలన్నీ చెక్ చేసాడు.
కానీ అవన్నీ తాళం వేసి ఉన్నాయి. వెనుక తలుపు వైపు వెళ్లాడు. దాని కిటికీ వీధివైపు తెరిచి ఉంది.
గొళ్లెం లాగగానే అది సులభంగా తెరుచుకుంది. వెళ్లే తొందరలో చార్లీ ఆ కిటికీ తాళం సరిగ్గా వేయడం మరిచిపోయాడు.
జంపీ కిటికీలోంచి దూకాడు. బయటి నుంచి దానికి తాళం వేసాడు. మరుసటి రోజు పియానో వాయించాలనే కోరిక ఆపుకోలేకపోయాడు.
'వెనక కిటికీ ఎలాగూ తెరిచి ఉంది. నేను స్కూల్‌కి వెళ్లి ఒకటి రెండు గంటలు ప్రాక్టీసు చేస్తే వచ్చే నష్టం ఏముంది?” అనుకున్నాడు జంపీ.
Esta historia es de la edición May 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.