“నానమ్మా ఏం చదువుతున్నావు?" అంటూ మింకీ వాళ్ల నానమ్మ గదిలోకి వచ్చింది.
మింకీ నానమ్మ నవ్వుతూ ఆమెకు ఒక పుస్తకం చూపించింది.
“ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పర్మెంట్ విత్ ట్రూత్" అని చదివింది మింకీ.
“ఓహ్ ఇది గాంధీజీ ఆత్మ కథ!".
“జీవిత చరిత్రకు, ఆత్మ కథకు తేడా తెలుసా?" అడిగింది నానమ్మ.
“తెలుసు, ఆత్మ కథ అంటే ఒక వ్యక్తి తన జీవితం గురించి రాసిన పుస్తకం. ఒక వ్యక్తి గురించి ఎవరో ఒకరు రాసినది జీవిత చరిత్ర”.
“స్మార్ట్ గర్ల్” మెచ్చుకుంది నానమ్మ.
“నానమ్మా మీకు తెలుసా? వచ్చే వారం గాంధీజీపై మాకు క్విజ్ పోటీ ఉంది." “దీనికి ప్రిపేర్ కావడానికి నేహా మన దగ్గరికి వస్తోంది. మేము కలిసి గాంధీజీకి సంబంధించిన సమాచారం సేకరించాలి”.
“మింకీ, నేహా వచ్చింది” పిలిచింది తల్లి.
“వస్తున్నా” అంటూ మింకీ బయటకు పరుగెత్తింది. వెంటనే నేహాతో తిరిగి వచ్చింది.
“నమస్తే నానమ్మా” నేహా చిరునవ్వుతో ఆమెను పలకరించింది.
“రామ్మా, మీరిద్దరూ గాంధీగారి మీద పరిశోధన చేయబోతున్నారన్నమాట. బాగుంది. నేనూ అదే చేస్తున్నాను”.
“మా నానమ్మ ఒక స్కూలులో కథలు చెప్పడానికి
వెళ్తుంది. రేపు గాంధీజీ గురించి పిల్లలకు చెప్పబోతోంది".
“వావ్” ఆశ్చర్యపోయింది నేహా.
"మీరు మా స్కూల్‌కి కూడా వస్తే బాగుంటుంది నానమ్మా” అని అడిగింది.
“నానమ్మ దగ్గర గాంధీజీ ఆటోబయోగ్రఫీ పుస్తకం ఉంది” నానమ్మ ఒడిలో ఉన్న పుస్తకాన్ని చూపిస్తూ చెప్పింది మింకీ.
"నానమ్మా మమ్మల్ని గాంధీజీ గురించి ప్రశ్నలు అడుగు" అంది నేహా.
“మీరు గాంధీగారి ఫొటోలు చూసారు కదా? అతని గురించి చెప్పగలరా?” అడిగింది నానమ్మ.
నేహా తడబడుతూ “గుండ్రని కళ్లద్దాలు పెట్టుకున్న ఒక ముసలి వ్యక్తి...” అని చెప్పింది.
“నవ్వుతున్న ముఖం కూడా” అంది మింకీ.
“నువ్వు చెప్పింది నిజమే. సాధారణంగా మనకు పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించే ఫొటోలో గాంధీజీ అలా కనిపిస్తారు.అయితే గాంధీగారు చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసా?"
Esta historia es de la edición October 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 2023 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో