జంపీ కోతి, షెల్లీ ఉడుతల స్నేహం గురించి చంపకవనంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు.
ఇద్దరు ఒకే చెట్టుపై నివసించేవారు. షెల్లీ జంపీ భుజం మీద కూర్చుని అడవంతా తిరిగేది.
కానీ ఒక రోజు షెల్లీకి ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. షెల్లీ తన స్నేహితురాలు వల్లీతో ఒక గేమ్ ఆడుతుండగా ఆమె తోకను గట్టిగా పట్టుకుని లాగింది. దాంతో అది సగం తెగిపోయింది.
“అయ్యో” అంటూ బాధతో షెల్లీ గట్టిగా అరిచింది.
కొద్దిసేపటికి నొప్పి తగ్గింది కానీ తను ఎంతగానో ఇష్టపడే అందమైన తోక తెగిపోయిందని విచారంలో మునిగింది.
తోక తెగిపోయినందుకు సిగ్గుతో చెట్టు తొర్రలో నుంచి బయటకు రాలేకపోయింది. తన పొట్టి తోకను చూసి అందరూ ఎగతాళి చేస్తారనుకుంది.
అయితే జంపీ మాత్రం ఆమెను ఉత్సాహపరుస్తుండే వాడు.
"ఏయ్ షెల్లీ, తొర్రలోంచి బయటకు రా.ఇలా ఎంతకాలం లోపల ఉంటావు. ఆకలితో చచ్చిపోతావు" చెప్పాడు ఒక రోజు.
“జంపీ, నేను చావనైనా చస్తాను కానీ, ఈ మొండి తోకతో బయటికి రాలేను. నాకు చాలా సిగ్గుగా ఉంది".
“షెల్లీ, అడవిలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరికి తోక తెగిపోతుంది.ఇంకొకరికి కాలు విరుగుతుంది. అంతమాత్రాన దీని కారణంగా ఎవరూ చనిపోరు. మనం ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాలి".
షెల్లీని ఒప్పించడానికి జంపీ ఎంతగా ప్రయత్నించినా ఆమె తొర్రలోంచి బయటకు రావడానికి సిద్ధపడలేదు. దీంతో జంపీ ఆమెకు ఆహారాన్ని ఏర్పాటు చేసాడు. ఆమెకు ఇష్టమైన వాటిని తెచ్చిపెట్టాడు. అయినా తెగిన తోక ఆమెను అసంతృప్తికి గురి చేసేది. అందుకే అతడు తెచ్చిన వాటిలో సగం తినేసి మిగిలినది బయట పారేసేది.
ఆమె విచారం ఇంకా తొలగిపోలేదు. ఈ కష్టం నుంచి ఆమెను బయట పడేయడానికి తను ఏం చేయగలనని నిరంతరం ఆలోచించేవాడు.
చివరికి జంపీకి ఒక ఆలోచన వచ్చింది. షెల్లీని నవ్విస్తే ఆమెలోని బాధ తగ్గుతుందని భావించాడు.వెంటనే ఆలోచన అమలు చేసాడు.
సంతోషంతో ఎగిరి గంతులు వేస్తూ “హీహీ’ అని నవ్వసాగాడు.
అతని నవ్వు విని షెల్లీ తొర్ర లోపలి నుంచే “హే జంపీ, ఎందుకంత గట్టిగా నవ్వుతున్నావు?” అని అడిగింది.
“ఇప్పుడే నాకొకటి గుర్తుకు వచ్చింది. అందుకే నవ్వుతున్నాను”.
"ఏమిటది జంపీ. ప్లీజ్ నాకూ చెప్పవా?”
ఆమెను నవ్వించి, సంతోషపరచడానికి ఇదే మంచి అవకాశంగా భావించాడు జంపీ.
Esta historia es de la edición February 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో