ధా... ధా... ధీన్... ధా..." లయ బద్ధంగా నాట్యం చేస్తున్న స్వస్తి పాదాలు వేగంగా వేదికను తాకుతుంటే, మంత్రముగ్ధులై ప్రేక్షకులు ఆమె నృత్యాన్ని చూస్తున్నారు. ఆమె ఎంతో చక్కగా నృత్యం చేసింది. అకస్మాత్తుగా ఆమె చెవి పోగు ఒకటి వదులై జారి కింద పడిపోయింది. నాట్యం చేస్తున్న ఆమె కాలు దానిపై పడటంతో ఆమె జారి వేదిక మీద పడిపోయింది. దాంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అయ్యో అంటూ ఆమెకైమనా దెబ్బలు తగిలాయేమో అని ఆదుర్దాగా చూస్తూ ఉండిపోయారు. అయినా కింద పడిపోయిన స్వస్తి తిరిగి, లేచి సంగీతానికి అనుగుణంగా నాట్యం ప్రారంభించింది. సంగీతం ఆగకపోవడంతో స్వస్తి అదే ఉత్సాహంతో ఎలాంటి బెదురు కనిపించనీయకుండా మిగిలిన ప్రదర్శనను పూర్తి చేసి నృత్యానికి సంబంధించిన ఫైనల్ పోజ్ ముగింపు పలికింది. ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఆమెను మెచ్చుకున్నారు.
“ఇది చాలా అన్యాయం. నాకే ఎందుకు జరిగింది?" కాలికి వేసిన ప్లాస్టర్ చూసి స్వస్తి రుసరుస లాడింది వాళ్లు డాక్టర్ వద్ద నుంచి వస్తున్నప్పుడు. ఆమె పడిపోవడం, ఆ తర్వాత లేచి తిరిగి నృత్యం చేయడం వల్ల ఆమె పాదానికి చిన్న దెబ్బ తగిలింది. నొప్పి తగ్గటానికి, త్వరగా కోలుకోవడానికి డాక్టర్ బెడ్ రెస్ట్ సూచించాడు.
"బేటా, నువ్వు మధ్యలో పడిపోయినా, భయపడకుండా లేచి మళ్లీ నాట్యం చేసావు. చూడు, అది చాలా ముఖ్యమైంది. ఒకవైపు నొప్పి పెడుతున్నా నువ్వు ప్రదర్శనను ఆపకుండా కొనసాగించిన తీరు అభినందించదగినది. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది స్వస్తీ” అంది స్వస్తి వాళ్ల అమ్మ ఆమె వీపును నిమురుతూ. “అమ్మా... నాకు వచ్చే వారం మ్యాథ్స్ పరీక్ష ఉంది. టీచర్ ఇంకా పోర్షన్ పూర్తి చేయలేదు.నేను స్కూల్కి వెళ్లకపోతే ఫెయిల్ అవుతాను" అన్నది స్వస్తి దిగులుగా వాళ్ల అమ్మవైపు చూస్తూ.
"స్వస్తి, నువ్వేమీ దిగులు పడకు. నువ్వు క్లాసుకు వెళ్లకపోయినా మిగతా పిల్లలను తొందరగానే చేరుకుంటావు. నువ్వు ఇంట్లో ఉండి నువ్వు చదువుకునేందుకు ఇది మంచి అవకాశంలా భావించు" తల్లి ఆమెకు భరోసా ఇచ్చింది.
“అయ్యో అమ్మా... నువ్వు ఎప్పుడూ అంతే...ఏదో రకంగా ప్రతిదాన్నీ ఎలాగో అలాగా... అవకాశంగా మార్చుకుంటావు" అంది స్వస్తి.
"డాక్టరు ఈ బ్యాండేజీ తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది?” అడిగింది స్వస్తి వాళ్ల అమ్మను.
Esta historia es de la edición March 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్
విదేశంలో దీపావళి
విదేశంలో దీపావళి
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.