ఎజ్రా, రూహీలు ఈద్ పండుగకి తమ దగ్గరికివస్తున్నారని తల్లి చెప్పడంతో దానియా సంతోషం పట్టలేకపోయింది. ఎజ్రా, రూహీలు యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో నివసిస్తున్నారు.మొదటిసారిగా వారు మధ్యప్రాచ్యం యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ దేశంలోని షార్జా నగరానికి వస్తున్నారు.
డానియా వారి కోసం ఒక అందమైన వెల్కమ్ కార్డ్ తయారుచేసింది. తమవైపు నుంచి వారికి సూపర్ స్పెషల్ ఈద్ గిఫ్ట్ ఇంకా ఏమేం ఇవ్వవచ్చని ఆలోచించసాగింది.
“కొన్ని అందమైన చెమ్కీలు, పూసలతో బ్రాస్లెట్ తయారుచేసి వారికి ఇవ్వవచ్చు" తల్లి సలహా ఇచ్చింది క్రాఫ్ట్ కిట్ బాక్స్ ఆమెకు ఇస్తూ.
“మమ్మీ, నువ్వే బెస్ట్” అని డానియా క్రాఫ్ట్ కిట్ బాక్స్ తెరిచింది. అందులో మెరిసే పూసలు, రంగుల దారాలు, చెమ్కీలు లాంటివి ఉన్నాయి.డానియా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందమైన బ్రాస్లెట్స్ తయారుచేస్తూ గడిపింది.
వివిధ రంగుల్లో పూసలు, చెమ్కీలను ఎంచుకుని మూడు బ్రాస్ లెట్స్ తయారుచేసింది. ఒకటి ఎజ్రా కోసం, మరొకటి రూహీ కోసం, ఇంకొకటి తన కోసం.
లంచ్ చేసిన వెంటనే తల్లి ఆమెను షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లింది అతిధులను ఆహ్వానించడానికి.
ఎజ్రా, రూహీలకు డానియాను కలవడం సంతోషంగా ఉంది. వారిద్దరు కవలలు. వారిని వేరు చేసి చూడటం చాలా కష్టం. అందరినీ గందరగోళానికి గురి చేయడానికి వారు ఒకే రకం డ్రెస్సు ధరించారు.
ఆంటీ సోహా వారిని పరిచయం చేసింది. ఇద్దరిని ఎలా వేరుగా చూడాలో ఒక క్లూ ఇచ్చింది. కవల పిల్లలు షార్జాలో ఎండలో నీలి ఆకాశాన్ని చూస్తూ బిజీగా ఉన్న సమయంలో "ఎజ్రా గట్టిగా నవ్వితే, రూహీ ముసిముసిగా నవ్వుతుంది" అని రహస్యం చెప్పింది.
“నీకు తెలుసా, లండన్ లో పగలు చాలాసేపు మబ్బుగా, బూడిద రంగులో కనిపిస్తుంది. వర్షం కురుస్తూ ఉంటుంది" కిటికీలోంచి చూస్తూ చెప్పింది రూహీ.
"కానీ ఇక్కడ వెచ్చగా, పొడిగా, ఎండగా ఉంది" నవ్వుతూ చెప్పింది ఎజ్రా.
డానియా, వాళ్ల అమ్మ ఆ ఇద్దరిలో ఎవరు ఎవరనేది తెలుసుకున్నారు. వారిని చూసి సోహా ఆంటీ సంతోషపడింది. డానియా వాళ్లమ్మ ఆహ్వానించినందుకే వాళ్లు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు.
“ప్రయాణంలో మేము ఏమాత్రం అలసిపోలేదు.అందమైన సిటీని మేం చూడాలనుకున్నాం. వచ్చాం" అని చెప్పారు.
Esta historia es de la edición April 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో