ఇసుకలో ఇల్లు బిల్డింగ్ సెట్‌ను ఇతర బ్యాగ్‌ల "మధ్య ఉంచుతూ “మా జాబితాలోని ఇది చివరి వస్తువు" అని నిషా అనడంతో "నేను దాంతో ఇసుకలో ఇళ్లు కట్టే వరకు రేపటి వరకు ఎదురుచూడలేను. నాకెంతో ఎగ్జయిటింగ్ ఉంది" అన్నాడు అఖిల్. వీకెండ్ సెలవులను ఉల్లాసంగా గడపటానికి వారు బీచ్ రిసార్ట్‌కి వెళ్తున్నారు.
నిషా, నిఖిల్ ఇద్దరూ తోబుట్టువులు మంగళూరులో ఉన్నారు. అఖిల్ వారి బంధువు, రాంచీ నుంచి వారిని కలిసి పోదామని వచ్చాడు.
అఖిల్‌తో కలిసి వాళ్లు బీచ్ కి వెళ్లారు. ఇంతకు ముందు కూడా అఖిల్ బీచ్‌కి వెళ్లాడు. కానీ ఎప్పుడూ బీచ్‌లోని రిసార్ట్‌లో ఉండలేదు.
"షానయ్ బీచ్ టెంట్ తెస్తోందా? ఇంకా ఎంతసేపు. దానిని కూడా సెటప్ చేయాలి. ఇంకా ఎంతసేపు ఎదురుచూడాలి?"
షానయ్ వారి పొరుగింటి స్నేహితుడు. అతను కూడా వారి బీచ్‌కి వచ్చాడు.
"పిల్లలూ ఇప్పుడు పడుకోండి. ట్రాఫిక్‌ను దాటి మనం వెళ్లాలంటే మనం రేపు త్వరగా బయలుదేరాలి” అని వాళ్ల తల్లిదండ్రులు చెప్పడంతో వారు సంతోషంగా గుడ్‌నైట్ చెప్పి నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి షానాయన్ను కలుపుకుని టిఫిన్లు చేద్దామని ఒక హోటల్ వద్ద ఆగారు.
అఖిల్ బ్రేక్ ఫాస్ట్ ప్రారంభించాడు. అతను మంగళూరు వచ్చినప్పటి నుంచి స్థానికంగా తయారుచేసే 'కడబు'లను ఇష్టంగా తింటున్నాడు.వీటిని జాక్రాట్ లేదా అరటి ఆకులలో ఉడికించిన ఇడ్లీలలాగా ఆవిరితో ఉడికిస్తారు. వాటితోపాటు మంగళూరు బన్ లుగా పేరు గాంచిన తీపి డీప్ ఫ్రైడ్ బన్స్, స్పెసీ కూర, చట్నీతో కలిపి తిన్నాడు.
బీచ్ రిసార్ట్ ప్రయాణం మూడు గంటలు సాగింది. ప్రయాణమంతా సముద్ర మార్గంలోనే జరిగింది. ప్రకృతిని ఎంతగానో ఇష్టపడే నిషా, ఆ దృశ్యాలను చూస్తూ ఎంతో ఆనందించింది. షానయ్ కూడా దారి పొడుగునా ప్రకృతి అందాన్ని చూస్తూ ఆస్వాదిస్తూనే ఉంది. కానీ నిఖిల్, అఖిల్‌తో కలిసి ఫోన్లో అతనికి ఇష్టమైన గేమ్ ఆడాడు. అతని తల్లి వారిస్తున్నా, ఐదు నిమిషాలే ప్రకృతి అందాలను చూసి తిరిగి అఖిల్‌తో ఆటలో మునిగిపోయాడు. రిసార్ట్‌కు వెళ్లే దారి వాళ్లకి దారిలో గుడిసెలు, చుట్టూ పరుగెత్తే పిల్లలు, గిన్నెలు తోముతూ, బట్టలు ఉతుకుతున్న మహిళలు కనిపించారు. నిషా ఒకే రంగుతో, ఒకే డిజైన్ , వివిధ సైజులలో వరుసగా ఉన్న బట్టలను చూసింది.
“బహుశా అవన్నీ ఒకే కుటుంబానికి చెందినవై ఉండవచ్చు. వారందరికీ ఒకే రకమైన గుడ్డలు కొనుక్కున్నారేమో” అని అనుకుంది.
Esta historia es de la edición August 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్