"మీరు మీ హోంవర్క్ పూర్తి చేసారా జెస్సీ, జిమ్మీ?".
“చేసాం బామ్మా!” జిమ్మీ అరిచాడు స్కూల్ బ్యాగ్ తన పుస్తకాలను పెట్టుకుంటూ. “ఇప్పుడు నేను వెళ్లి క్రికెట్ ఆడుకుంటా” అని చెప్పాడు.
జెస్సీ మాత్రం “ఇంగ్లీష్ హెూంవర్క్ మిగిలిపోయింది. స్నేహితుడికి ఉత్తరం రాయాలి" అని నిట్టూర్చింది.
“నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఉత్తరాలు రాసావా బామ్మా?” "అవును నేను రాసాను. కానీ నిజంగా 'నోట్‌బుక్'లలో కాదు” అని ఆమె నవ్వింది.
జెస్సీ ఆసక్తిగా “ఎవరికి రాసావు బామ్మా?" అని అడిగింది.
“నేను రాసిన మొదటి ఉత్తరం
అర్చనకి. ఆమె నా మొదటి స్నేహితురాలు.
మేం ఫస్ట్ స్టాండర్డ్ లో ఉండే వాళ్లం.
అప్పుడు శీతాకాలపు సెలవుల సమయంలో ఆ సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను.
స్కూల్ హాస్టల్లో ఉండి తన ఊరికి వెళ్లింది" అని చెప్పింది బామ్మ.
"నేను నా సోదరి మా బంధువులకు కూడా లెటర్లు రాసే వాళ్లం. పుట్టిన రోజు క్రిస్మస్ కార్డులను పంపే వాళ్లం. మాకు కూడా లెటర్లు వచ్చేవి. మేము వాటి కోసం ఎదురుచూసే వాళ్లం.
నేను కాలేజీలో
చదువుతున్నప్పుడు మా అమ్మానాన్నలకు లెటర్లు రాసేదాన్ని” మళ్లీ చెప్పింది బామ్మ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ.
“మీకు ఉత్తరాలు రాయడం ఇష్టమా?" అని జెస్సీ ప్రశ్నించడంతో తిరిగి బామ్మ చెప్పసాగింది.
“అవును అప్పట్లో క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఉండే ఏకైక మార్గం అదే. చాలా కొద్ది మందికే టెలిఫోన్లు ఉండేవి. ఫోన్ కాల్స్ చాలా ఖరీదుగా ఉండేవి. మేము ల్యాండ్‌లైన్ నంబర్లకు ఎస్డి కోడ్లను జోడించే వాళ్లం. కాల్ చేయాలంటే ముందు అవుట్ స్టేషన్ కాల్ని అపరేటర్ నుంచి బుక్ చేసుకోవాలి. ఆ రోజుల్లో మాకు మొబైల్ ఫోన్లు లేవు. మాకు నచ్చినప్పుడల్లా కాల్ చేయడానికి.
మీకు తెలుసా?” “కాలేజ్ హాస్టల్లో ఉత్తరాలు వచ్చినప్పుడు మేము చాలా సంతోష పడే వాళ్లం" అని బామ్మ గుర్తు చేసుకుంది.
“నా స్నేహితురాలు రాధ చాలామంది స్నేహితులను ఒక దగ్గరకి చేర్చి ప్రతి వారం తన అమ్మమ్మ నుంచి ఉత్తరాలు చదివేది, పల్లెటూరి వార్తలన్నీ సరదాగా రాసేది ఆవిడ. వారి పొరుగింటి వారి కుమార్తె అమ్ము ఒక రోజు మేకతో పాఠశాలకు వచ్చిందని... ఆమె చేష్టలను వివరించిన లెటర్ నాకు ఇప్పటికీ గుర్తుంది".
“పాఠశాలకి మేకతో వచ్చిందా? అప్పుడు ఏమైంది బామ్మా?" జిమ్మీ అడ్డుకున్నాడు.
Esta historia es de la edición September 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2024 de Champak - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో