తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించి, సంరక్షించిన ఐదు ప్రముఖ నిర్మాణాలకు 2023 వ సంవత్సరానికి గాను ప్రకటించిన 'గ్రీన్ యాపిల్' అవార్డులు లభించాయి. వివిధ విభాగాల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంతో పాటు మరో నాలుగు నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నాయి.లండన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం ఇదే తొలిసారి.
గ్రీన్ యాపిల్ అవార్డుల పేరుతో 2016 నుంచి ప్రతి ఏటా ప్రముఖ సంస్థలు, కౌన్సిళ్లు, కమ్యూనిటీలను గుర్తిస్తూ వాటికి గ్రీన్ ఆర్గనైజేషన్ అవార్డులను ప్రదానం చేస్తున్నది ఈ సంస్థ. లండన్లో 1994లో ఏర్పాటైన గ్రీన్ ఆర్గనైజేషన్ ఎటువంటి లాభాపేక్షలేని ఒక స్వతంత్ర సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత కార్యక్రమాలను ఇతోధికంగా పోత్సహించడంతోపాటు, ఇటువంటి విధానాలను పాటిస్తున్న వాటికి సరైన గుర్తింపును ఇస్తుంది.
యావత్ భారతదేశంలో, ఐదు విభాగాల్లోనూ ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఈ అవార్డులు రావడం వల్ల తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమయ్యింది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాల ఆధారంగా, ప్రపంచ గుర్తింపు, ప్రాజెక్టులు, విధానాలను అధ్యయనం చేసి ఈ అవార్డులను అందించారని ఆర్వింద్కుమార్ తెలిపారు. గతంలో హైదరాబాద్కు దక్కిన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ (2022), ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్ (2021), లివింగ్ అండ్ ఇన్క్లూజన్ అవార్డ్ - స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ (2021) అవార్డులతో ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 వేర్వేరు విభాగాల్లో 5 అవార్డులను అందుకొన్నామని, అత్యధిక అవార్డులు తెలంగాణకే దక్కాయని వివరించారు.
అవార్డులు ఇచ్చి గుర్తించిన మన రాష్ట్రంలోని నిర్మాణాలు
1. మోజంజాహీ మార్కెట్ (హెరిటేజ్ విభాగంలో అద్భుతమైన పునరుద్ధరణ, పునర్వినియోగం కోసం)
2. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (వంతెనల శ్రేణిలో ప్రత్యేక డిజైన్ కోసం)
Esta historia es de la edición July 2023 de Telangana Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 2023 de Telangana Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
జల సంరక్షణలో పురస్కారాలు
ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.
పేదల మేడలు కొల్లూరు గృహాలు
సంగారెడ్డిజిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు.
సకల జనహితంగా 'విప్రహిత'
బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారిగా గోపనపల్లిలో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది.
తెలంగాణ పచ్చబడ్డది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
సిద్ధిపేటకు ఐటీ టవర్
సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.
రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి
నిమ్స్ దశాబ్ది భవనం
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.
మన గడ్డపై కోచ్ల తయారీ
రాష్ట్రంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తెలంగాణ బిడ్డలు తయారుచేయడం గర్వకారణమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు
- హరితనిధి ఒక నవీన ఆలోచన:
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
కంటి వెలుగు శతదినోత్సవం'
వంద రోజుల 'కంటి వెలుగు' సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.