ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న దేశం థాయ్లాండ్. దీనిని అధికారికంగా కింగ్డమ్ ఆఫ్ థాయ్లాండ్ అని పిలుస్తారు. ఈ దేశాన్ని స్థానిక ప్రజలు సాధారణంగా మెయాంగ్ థాయ్ అని పిలుస్తూ ఉంటారు. 1851-1868 మధ్య కాలంలో సియాం రాజ్యాన్ని మాంకట్ రాజు పరిపాలించాడు. 1939 జూన్ 23న ఈ దేశం పేరు థాయ్లాండ్గా మార్చారు. 1945 నుండి 1949 మే 11 వరకు థాయ్లాండ్ను తిరిగి సియాంగా పిలవడం ప్రారంభించారు. ఆ తరువాతి కాలంలో మళ్లీ థాయ్లాండ్గా మార్చారు. థాయ్ అనే మాటకు స్వేచ్ఛ అనే అర్థం కూడా ఉంది.దక్షిణాసియాలో యూరోపియన్ ఆక్రమణకు గురికాని ఒకే ఒక్క దేశం థాయ్లాండ్.థాయ్లాండ్ అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు కలిగిన దేశం. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అతిథులను ఇక్కడ గౌరవంగా ఆహ్వానిస్తారు.ప్రపంచంలో 51వ అతి పెద్ద దేశం ఇది.ఈ దేశంలో జనాభా సుమారు 7 కోట్ల వరకు ఉన్నారు. థాయ్లాండ్ దేశం బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందింది.థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్. ఈ దేశానికి రాజు ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ రాజుకు వ్యతిరేకంగా ఏమీ జరగదు. ఈ దేశం ప్రపంచ యువ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. భక్తి, రక్తి, శృంగారం కలగలసిన దేశం థాయ్లాండ్.
బ్యాంకాక్
ఇది థాయ్లాండ్ రాజధాని నగరం ఎనిమిది మిలియన్ల జనాభాతో థాయ్లాండ్లో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది. ఇంద్ర స్కేర్, ప్లాటినమ్ మాల్ వంటి అతి పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. థాయ్లాం డు సందర్శించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కంటే బ్యాంకాక్కు వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపు ఉంటుంది. నవరత్నాలకు కేంద్ర స్థానం బ్యాంకాక్ అని చెబుతుంటారు. బ్యాంకాక్ నగరం మధ్యలో ఛోప్రాయా నది ప్రవహిస్తుంది. ఈ నదిపై క్రూయిజ్ షికారు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఎత్తైన ఆకాశహర్మ్య
బ్యాంకాక్లో ఉన్న ఈ ఆకాశహర్మ్యం థాయ్లాండ్లోనే ఎత్తయిన భవనం. దీని ఎత్తు యాంటెన్నాతో కలుపుకుని 328.4 మీటర్లు. 1997లో ఈ భవన నిర్మాణం పూర్తి చేసారు. 83వ అంతస్తులో నిర్మించిన హోటల్లో 673 గదులున్నాయి. 77వ అంతస్తులో పర్యాటకులు విహంగ వీక్షణం చేసేందుకు అనువైన ఏర్పాట్లు చేసారు.
టెంపుల్ ఆఫ్ డాన్
ఇది చోప్రాయా నదికి పశ్చిమ తోనబ్బురి ఒడ్డున ఉన్న ప్రాచీన దేవాలయం. వాట్ అరుణ్ అని పిలుస్తున్నప్పటికీ స్థానిక ప్రజలు వాట్ చెయాంగ్ అని పిలుస్తుంటారు.
Esta historia es de la edición September 03, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 03, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.