కల్యాణం"గా విరాజిల్లుతున్న శేషాచలం కొండల్లోని సప్తగిరులపై సాలగ్రామశిల ద్వారా స్వయంభువుగా ... అర్చనామూర్తిగా ఆవిర్భవించిన శ్రీ వేంకటేశ్వరస్వామికి కలియుగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే తొమ్మిది రోజులు ఉత్సవాలు జరిపించడంతో "బ్రహ్మోత్సవాలు"గా పేరు వచ్చింది.
కలియుగ ప్రత్యక్షదైవమ్ శ్రీ వేంకటేశ్వరస్వామికి ఏటేటా బ్రహ్మోత్సవాలు జరగడం సంప్రదాయం. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ తిరుమల గిరులు గోవింద నామ స్మరణలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భజన బృందాలు, కోలాటాలు, దైవిక, పౌరాణిక పాత్రధారణలతో, ఆధ్యాత్మిక ప్రవచనాలతో నిర్విరామంగా ఒక పవిత్ర శోభ సంతరించుకుంటాయి పుణ్యక్షేత్రంలో.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని కోట్లాది మంది భక్తులు తమకు ఇష్టమొచ్చిన రీతిలో వేంకటేశ్వరుడిని కొలుస్తారు. వైఖానస ఆగమం ప్రకారం ఏడుకొండల దేవునికి ప్రతిరోజూ ఎన్నో రకాల సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తారు. వీటిల్లో సంవత్సరానికోసారి తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత వుంది. తొమ్మిది రోజులు రోజుకు రెండు వాహనాలపై వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి విశేషాభరణాల అలంకరణల్లో వాహనాలపై వేంచేపు చేసి భక్తకోటిని కరుణిస్తాడు. ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం, రథోత్సవం, చక్రస్నానం అశేష జనసందోహంతో, ఆనందోత్సాహాలతో, భక్తితో స్వామిని అలరింపజేస్తాయి. స్వామి సేవకు ఎండైనా, వాన అయినా... రాత్రి అయినా పగలు అయినా లక్షలాది మంది భక్తులు ఈ తొమ్మిది రోజులు తిరుమలలోనే వుండి వాహన సేవల్లో పాల్గొంటూ ముక్తికోసం తపిస్తుంటారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిరుమలేశునికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.చాంద్రమానం ప్రకారం ప్రతి మూడవ సంవత్సరం అధిక మాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భంలో కన్యామాసం(భాద్రపదంలో) సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజంలో దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ వర్గాలు నిర్వహిస్తారు. ఇప్పటికే సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వేడుకగా జరిపించారు. ఇప్పుడు (నేటి నుండి అక్టోబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహామండలి, అర్చకులు నిర్ణయించారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా జరిగాయి.
Esta historia es de la edición October 15, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 15, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.