ప్రపంచంలోనే ఎక్కడా లేని, కనీ వినీ ఎరుగని విధంగా ప్రకృతి పూల బతుకమ్మ పండుగను తెలంగాణలోనే జరుపుకోవడం విశేషం. తరతరాలుగా పెద్దలిచ్చిన ఆనపాస్తుల్ని దాచిపెట్టుకొని, ముందు తరాల (మరోవంశం ) వారికి అందించడమే ఆనవాయితీ అనుకుంటాం కానీ అది తప్పేమో అనిపిస్తుంది. ఎందుకంటే సంపద కంటే సంస్కృతి గొప్పది. సంస్కృతిలోనే జీవన విలువలు దాగున్నాయి. అటువంటి విలువల్ని ప్రకృతితో మమేకమై జరుపుకునే ప్రతీ పండుగలోనూ ఉంటుంది. ఇటువంటి సంస్కృతి, సంప్రదాయాలకు పల్లెలు ఆలవాలమని చెప్పొచ్చు. ప్రతీ పండుగ ఆచారాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ, ప్రకృతి అనే శక్తికి భక్తి అనే ఆచారంతో ప్రజలందరినీ రక్షించమనే వేడుకోలు విన్పిస్తుంది. పిల్లలు, పెద్దలు, కలిసి మెలసి, ఆడుతూ, పాడుకునే ప్రకృతి పూలపండుగ 'బతుకమ్మ'. మహాలయ అమావాస్య మొదలు తొమ్మిది రోజులు భక్తితో గౌరవమ్మకు మహిళలు చేసే పండుగ. ఆశ్వయుజ మాసంలో ప్రకృతంతా పచ్చదనంతో పుడమిపై నిండు ముత్తైదువులా కొలువై ఉంటుంది. రంగు రంగుల పువ్వులతో భూమి ఇంద్రధనస్సు చీరను చుట్టుకొన్నట్లు ఉండడం విశేషం. తెలంగాణలో పల్లెపల్లెనా చిన్నా పెద్దా తేడా లేకుండా బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆది నుండి వస్తున్నది. ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా ఈ పండుగకి తమ పుట్టింటికి వస్తారు. మెట్టినింట్ల ఎన్ని బాధలున్నా, కొంత విడుపుగా తల్లిగారింటికి వచ్చి బంధువులను, స్నేహితులను, ఊరిని చూసుకొని ముచ్చటించుకునే ఆటపాటల పూల పండుగ. బతుకమ్మ తొమ్మిది రోజుల స్త్రీల పండుగ. ఆశ్వయుజ మహాలయ అమావాస్యతో 'ఎంగిలిపూలు' పేరుతో మొదలై దుర్గాష్టమినాటి బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.
Esta historia es de la edición October 22, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 22, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.