'దేవుడు అన్నిచోట్ల ఉండలేడు. కాబట్టే అమ్మను సృష్టించాడు' తల్లిని మించిన శ్రామికులు ఎవరున్నారు? మిగిలిన శ్రామికులంతా వేతన జీవులేకదా! ఇలా చెప్పుకుంటూ పోతే తల్లిగా స్త్రీ గొప్పతనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజంలో స్త్రీ వివిధ సందర్భాల్లో ఆమె నిర్వర్తించే బాధ్యతలే ఆమెను ఉన్నత శిఖరాన నిలబెట్టాయి. కన్నీటిని దాచుకుంటూ చిరునవ్వులు చిందిస్తుంది.పిల్లలను ఆమె (తల్లి) సరిగ్గా తీర్చిదిద్దకపోతే సమాజం దారితప్పిపోతుంది. అంత గొప్ప బాధ్యతల్ని కూడా తన భుజస్కంధాలపై అవలీలగా మోయగలుగుతున్న ఆ అద్భుత శక్తి ఎవరో కాదు అమ్మ. ఆ అమ్మే మనల్ని అవనిపై తీసుకువచ్చిన దేవత.. దాశరథిగారు అన్నట్లు.. 'అమ్మ అన్నది ఒక కమ్మని మాట.అది ఎన్నెన్నో తెలియని మమతల మూట.
దేవుడు లేడనే మనిషున్నాడు. అమ్మేలేదనువాడు అసలేలేదు.అమ్మంటే అంతులేని సొమ్మురా. అది ఎన్నటికీ తరగని భాగ్యమ్మురా'. అమ్మ ఒడే మొదట బడి. పిల్లలు తల్లి నుండే * కమ్మని మాటలు నేర్చుకుంటారు. అమ్మ నేర్పే మాటల్లో మంచి నడత, నడవడిక మాత్రమే ఉంటుంది. కాబట్టి అమ్మ అంటేనే కమ్మని మాట. అమృతం వంటి మనసు అమ్మకు మాత్రమే ఉంటుంది. అమ్మ ఉంటే అన్ని ఉన్నట్లే. అంటే ఈ ప్రపంచం లోనే తల్లి ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేం. అందుకే 'తల్లిని మించిన దైవం లేదు' అంటుంటారు. ఆడపిల్లగా ఉన్నప్పటి నుండే తన భవిష్యత్తుని గురించి కలలు కంటూ తన బాధ్యతల్ని ఎరిగి మసలుకుంటుంది. తన అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, మేనత్త తల్లులుగా ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో గమనిస్తూ పెరుగుతుంది. ఎందుకంటే తను కూడా అలాంటి బాధ్యతల్ని నిర్వర్తించాలి కదా!
ఏ యుగంలోనైనా, ఏకాలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా, ప్రపంచంలో ఎక్కడైనా మాతృమూర్తులుగా తల్లుల అవిశ్రాంత బాధ్యతలు వర్ణింపలేనివి. స్త్రీ తన గర్భంలో బిడ్డను మోస్తున్నప్పుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ కొత్త ప్రాణాన్ని భూమిపైకి తీసుకువచ్చే క్రమంలో అమ్మ పోరాటం అంతా ఇంతా కాదు. తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా మనల్ని భూమిపైకి తీసుకువచ్చిన త్యాగమూర్తి అమ్మ. తన రక్తాన్ని పాలుగా మార్చి, మనల్ని బ్రతికిస్తుంది.'ఆస్తాం తావడియం ప్రసూతి సమమే దుర్వార శూల వ్యధా నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యాచ సాంవత్సరీ ఏకస్యాపి గర్భధార భరణ క్లేశస్య యస్స్యాక్షమో ధాతుం నిష్కృతి మున్నతోపి తనయ: తస్యై జనన్యై నమ:
(ఆదిశంకరాచార్య మాతృపంచక శ్లోకాలు)
Esta historia es de la edición May 12, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 12, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు