ఆహా! బలే గాజు వంతెనలు
Vaartha-Sunday Magazine|July 21, 2024
పలు నగరాలు, దేశాల మధ్య దూరాన్ని తగ్గించి రవాణా వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఎన్నో వంతెనలు నిర్మించారు.
షేక్ అబ్దుల్ హకీం జాని
ఆహా! బలే గాజు వంతెనలు

పలు నగరాలు, దేశాల మధ్య దూరాన్ని తగ్గించి రవాణా వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఎన్నో వంతెనలు నిర్మించారు. ఇదే రీతిలో ప్రకృతి అందాలు తిలకించడానికి ఆధునిక పోకడలతో గాజు వంతెనలు నిర్మించిన దేశాలు అనేకం ఉన్నాయి. వీటిపై నడుస్తుంటే గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. అందుకే వీటిని స్కైవాక్ బ్రిడ్జీలు అని పిలుస్తారు. గాజు వంతెనపై నడక అనేది సాహసమే అని చెప్పాలి. గాజు వంతెనలపై గుండె కొందరు పర్యాటకులు నడుస్తూ ఆహా ! బ అలౌకిక ఆనందాన్ని పొందుతుంటారు.

గాజు వంతెన అంటే చిటికెలో పగిలిపోయే గాజు కాదు సుమా! రెండు కొండల మధ్య నిర్మించిన ఈ గాజు వంతెనపై పర్యాటకులు ధైర్యంగా నడుస్తూ, గాల్లో తేలుతున్న అనుభూతిని పొందుతూ ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. ఇవి చాలా దృఢంగా ఉంటాయనే నమ్మకం కలిగించేందుకు కొన్ని గాజు వంతెనపై కార్లు నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.

వియత్నాం గాజు వంతెన

గాజు వంతెన పేరు చెప్పగానే అందరికీ వియత్నాం గుర్తుకు వస్తుంది. వియత్నాంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనను సోన్ల ప్రావిన్స్ లోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌ ఐలాండ్ అనే ప్రాంతంలో నిర్మించారు. వైట్ డ్రాగెన్ బ్రిడ్జిగా పిలిచే ఈ గాజు వంతెన పొడవు 632 మీటర్లు. వెడల్పు 2.5 మీటర్లు. 150 మీటర్ల లోతైన లోయపై ఈ గాజు వంతెనను నిర్మించారు.వియత్నాంలో ఇది మూడో గాజు వంతెన. అయితే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పారదర్శక గాజు వంతెనగా ప్రసిద్ధి చెందింది. ఈ వంతెనకు 'బాచ్ లాంగ్' అని నామకరణం చేశారు. వియత్నాంలోని సోన్ల ప్రావిన్స్ లోని బాచ్ లాంగ్ బ్రిడ్జ్ ప్రపంచంలోని అతి పొడవైన గాజు వంతెనగా నిర్ధారించారు. ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న ప్రత్యేకమైన గాజుతో దీన్ని నిర్మించారు. సెయింట్ గోన్ అనే ఫ్రాన్స్ కంపెనీ ఉత్పత్తి చేసి ఇచ్చిన సూపర్ టెంపర్డ్ గ్లాస్గో బ్రిడ్జిని తయారు చేశారు. ఒకేసారి 450 మంది దీనిపై నడిచినప్పటికీ ఆ బరువును తట్టుకునే సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. 290 మీటర్ల ఎత్తైన రెండు శిఖరాల మధ్య దీన్ని నిర్మించారు. వంతెన చాలా ఎత్తులో ఉండటం వల్ల లిఫ్ట్ ద్వారా వంతెనను చేరుకుని అక్కడి నుండి పర్యాటకులు దీనిపై నడుస్తారు. 28 ఏప్రిల్ 2022లో పర్యాటకుల కోసం దీన్ని తెరిచారు. ఇది వియత్నాం రాజధాని హనోయికి వాయువ్యంగా 200 కి.మీ. దూరంలో లావోస్ సరిహద్దులో ఉంది.

Esta historia es de la edición July 21, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 21, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 minutos  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 minutos  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 minutos  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 minutos  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

రేపటి పౌరులం

time-read
1 min  |
November 17, 2024
బుజ్జి మేక అదృష్టం
Vaartha-Sunday Magazine

బుజ్జి మేక అదృష్టం

ఒక బుజ్జి మేక మంద నుండి విడివడి అడవికి వెళ్ళింది. దానికి నక్క ఎదుర యింది.

time-read
1 min  |
November 17, 2024
గుండె పదిలమేనా!
Vaartha-Sunday Magazine

గుండె పదిలమేనా!

హార్ట్ ఎటాక్.. ఈ పేరు చెబితేనే జనం వణికిపోతారు. ఎందుకంటే.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మింగేస్తుందో తెలియదు.

time-read
1 min  |
November 17, 2024