ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తారీకు నుంచి దసరా మొదలుకదా. అక్టోబరు 3 నుంచే ఎందుకు మొదలు అంటారా ఎందుకంటే ఆ రోజు ఆశ్వయుజ శుద్ధపాడ్యమి కనుక. అంటే ఈ రోజు అమ్మవారు ఆవిర్భవించిన రోజు గనుక. ఆ రోజునుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు ఆవిడ మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అతనిని సంహరించింది.ఈ తొమ్మిది రోజులూ దేవీ నవరాత్రులని అమ్మవారిని పూజిస్తారు. పదవరోజు అమ్మవారు రాక్షసుడిని సంహరించిన విజయోత్సవ వేడుకలు విజయదశమిగా చేసుకుంటారు.
అంటే ఇది శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండుగ.అమ్మవారు ఆవిర్భవించింది అంటారు, వెంటనే రాక్షసుడిని చంపిందంటారు.. ఇదేమీ మాకర్థం కావటం లేదు, విపులంగా చెప్పండి అంటున్నారా. మర్చిపోయానర్రా, మీరంతా ఇంగ్లీషు మీడియాలు కదా, తెలుగు కథలు తెలియవులే. సరే, చెప్తా వినండి. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు వుండేవాడు. అతనికి మరణం లేని జీవనం కావాలనీ, ఎల్లకాలం తనే అన్నిలోకాలనూ పరిపాలించాలనీ గొప్ప కోరిక వుండేది. ఈ కాలంలో మనమంతా మంచి ఉద్యోగాలు సంపాదించటానికి బాగా చదివి, పరీక్షలెలా రాస్తున్నామో, ఆ కాలంలో ఏమన్నా సాధించాలంటే ఏళ్ల తరబడి దేవుళ్ల కోసం తపస్సు చేసి వరాలు పొందేవారు. మహిషాసురుడు కూడా తన కోరిక నెరవేర్చుకోవటానికి మేరుపర్వతం మీదకి వెళ్లి అనేక వేల సంవత్స రాలు బ్రహ్మదేవుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. కొన్నివేల సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మహిషాసురుడు కోరుకున్నాడు. ఏమని? నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని. అప్పుడు బ్రహ్మదేవుడు, 'మహిషాసురా.. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.. గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చటం అసంభవం. కనుక, నిన్ను సంహరించ టానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో' అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, 'విధాతా.. అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల.. ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక, పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా అనుగ్రహించు' అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.
Esta historia es de la edición October 06, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 06, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.