కొన్నాళ్ల క్రితం మేక్ ఇన్ ఇండియా కింద తయారైన తారిణీ నౌకలో ప్రయాణించి ఆరుగురు మహిళా అధికారులు ఒక సాహస కార్యంతో చరిత్ర సృష్టించారు. 2017 సెప్టెంబర్ 19న ఐశ్వర్య, ఎస్.విజయ, వార్తికా జోషీ, ప్రతిభా జామ్వాల్, సి.స్వాతి, పాయల్ గుప్తా ఐఎన్ఎస్ తారిణీలో ప్రయాణం మొదలుపెట్టారు.
2018 మే 19న 21,600 నాటికల్ మైల్స్ అనగా 216 వేల సముద్రపు మైళ్లు ప్రయాణించి తిరిగొచ్చారు. ఈ యాత్రకు దాదాపు 254 రోజులు పట్టింది. ఈ ఆరుగురు నేవీ మహిళా అధికారులు దీని ద్వారా చరిత్ర పుటలకెక్కారు.
2018 మే 21న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పోలాండ్, దక్షిణ ఆఫ్రికా గుండా గోవా చేరు కున్నారు. వారి ముందుకి కూడా పురుషులకు ఎదురైనట్లే అనే సవాళ్లు వచ్చాయి. కానీ వాళ్లు తీవ్రంగా ఎదురొడ్డి గెలిచారు. ఇది నేటి మహిళల మారుతున్న ఇమేజ్. ఆటంకాలను తిప్పి కొట్టి విజేతలవుతున్నారు.
భారత్ స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు అయ్యింది. స్వాతంత్ర్యానికి ఏడు దశకాలు గడిచాక మహిళల జీవితంలో అనేక మార్పు లొచ్చాయి. వారి పరిస్థితి మెరుగైంది. వారికి హక్కులు లభించాయి. బంధనాల నుంచి విముక్తి పొందగలిగారు. అనేక రకాల హక్కుల కోసం పోరాడి అనేక విజయాలు దక్కించుకున్నారు.
అనేక రంగాల్లో పురుషులకు పోటీగా నిలిచారు. కానీ మరో కోణంలో తరతరాల వేధిం పుల యాతన మాత్రం ఇంకా భరించాల్సి వస్తోంది. ఇప్పటికీ ద్వితీయ శ్రేణిగా, ఇంకా శారీరక వేధింపు లకు గురవ్వాల్సి వస్తోంది. ఈనాటికీ వారి పిడికిలి ఖాళీగానే ఉంది. రండి ఈ 75 ఏళ్లలో మహిళల జీవితాల్లో ఏ పాటి మార్పులొచ్చాయో చూద్దాం.
సానుకూల మార్పులు : సమాజం, కుటుంబంలో మహిళల స్థితిలో నిదానంగానైనా అనేక సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి.
విద్యావంతురాలైన నారీ
తన అస్తిత్వాన్ని గుర్తించి, సమర్థతను నిరూ పించుకోడానికి ఒక మహిళకు విద్య ముఖ్యమైనది. హక్కులు, కర్తవ్యాలను తెలుసుకోవాలి. ఎదగటానికి భయపడకూడదు. మహిళల ప్రగతిలో విద్య పాత్ర పెద్దదే. చదువుతోనే జాగృతి లభించింది. వారు పాతకాలపు పౌరాణిక ఆలోచనల నుంచి బయటికొస్తున్నారు. తమ హక్కులపై అవగాహన పొందుతున్నారు. చదువుకున్నాక ఉద్యోగానికై బయటికి వెళ్తున్నారు. పురుషాధిక్య సమాజంలో తమ స్థానాన్ని నిలుపుకొని ఆర్థికంగానూ స్వతంత్రులవుతున్నారు.
Esta historia es de la edición August 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.