ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu|November 2024
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
- పూనమ్ పాండే •
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మంచిగా నిద్ర పోవాలంటే సరైన మార్గాలు ఏమిటో? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

రోజంతా పని చేసి అలసిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కొంచెం నిద్ర అవసరం. ముఖ్యంగా మహిళలకు చాలా ముఖ్యం. ఎందుకంటే వారు ఇంటి పనితోపాటు ఉద్యోగాలు కూడా చేస్తారు. నిద్ర పోయే ముందు భర్తకు విధేయతగా ఉండటం కూడా ఆమెకు ముఖ్యం. లేకపోతే అతను కూడా చిరాకు పడతాడు.

మనలో చాలామంది వివిధ రకాలుగా నిద్ర పోతుంటారు. కొంతమంది ఒక పక్కకు ఒత్తిగిలి పడుకుంటే మరికొందరు వెల్లకిలా పడుకోవటానికి ఇష్టపడతారు. కానీ చాలామందికి సరైన నిద్ర విధానం గురించి తెలియదు. నిద్రకు ఉపక్రమించి నప్పుడు ఏ భంగిమలో పడుకుంటామా, నిద్ర లేచేటప్పుడు ఏ భంగిమలో పడుకుని ఉంటామా తెలుసుకోవడానికి పరిశోధకులు అనేక కొత్త పద్ధతులను ఉపయో గిస్తున్నారు. ఎందుకంటే నేటి బిజీ ప్రపంచంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు.

మొదట పిల్లలతో ప్రారంభిద్దాం : నవజాత శిశువులు దాదాపు 20 నుంచి 22 గంటలు నిద్ర పోతారు. వారు తరచుగా నిద్ర లేచి, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తారు. శిశువు పెరుగుతున్న కొద్దీ అతని నిద్ర పోయే సమయం తగ్గుతుంది. 2-3 సంవత్సరాల వయసు వరకు తమ పిల్లలను నిద్ర పుచ్చడం మహిళలకు చాలా కష్టమైన పని. తన పగటిపూట కంటే రాత్రి నిద్ర లేచి ఎక్కువగా ఏడుస్తుందని దాని వల్ల రాత్రంతా తనకు నిద్ర ఉండటం లేదని, పగలు ఇంటి పని నుంచి కాస్త తీరిక దొరికినా, తన బిడ్డ అదే సమయానికి నిద్రలేస్తుందని నీలం చెప్పింది. ఆమెకు విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు.

శిశువు నిద్ర పోయే గంటలు

పిల్లలు వేర్వేరు సమయాల్లో నిద్ర పోతుంటారు. ఇది వారి వయసు, ఆకలి మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు లేదా పెద్దలు కావచ్చు. ప్రతి ఒక్కరికి సొంత నిద్ర విధానం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ వారికి అనువైన భంగిమలో మాత్రమే సుఖంగా నిద్రపోగలరు.

అందువల్ల బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు సంబంధించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా గమనించాలి. కాబట్టి మొదట శిశువు నిద్ర పోయే సమయాల గురించి చూద్దాం.

• పుట్టిన మొదటి 2 వారాలలో అంటే పసి పిల్లలు 20 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రిస్తుంటారు.

• శిశువుకు 6 నెలల వయసు ఉంటే 18 నుంచి 20 గంటల వరకు నిద్ర పోవచ్చు. మధ్యలో 3 నుంచి 4 సార్లు మేల్కొంటారు.

Esta historia es de la edición November 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición November 2024 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 minutos  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 minutos  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 minutos  |
November 2024