రండి, మళ్లీ మళ్లీ వెళ్లి చూడాలనిపించే ఒక నగరానికి మిమ్మల్ని తీసుకువెళతాం.
యూ రప్ వినూత్న నగరం వియన్నా ఎన్నో మార్పులతో ఇప్పుడిది అత్యంత ఆకర్షణీయమైన, నివాసయోగ్యమైన నగరంగా మారింది. ప్రశాంత వాతావరణం, ట్రాఫిక్ జామ్ లేని రోడ్లు, ట్రామ్లు, రైళ్లు, బస్సులతో నిండిన ఈ నగరం ఎప్పుడు ఎక్కడ, ఎలా పని చేస్తుందన్నది తెలియదు. ఇది ఢిల్లీ, ముంబైలాగా జనంతో నిండి లేదు. 415 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఈ నగరంలో 17 లక్షల మంది నివసిస్తున్నారు. ఇది యూరప్ స్టాండర్డ్స్ కంటే ఎక్కువ. అయినప్పటికీ ఇది ప్రణాళికాబద్ధంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
వేసవి కాలంలో ఈ నగరంలో కాటన్ దుస్తులతో హాయిగా తిరుగుతూ పాత కొత్త ప్రదేశాలు చూస్తూ తనివితీరా ఆస్వాదించవచ్చు.
డానుబే నది ఒడ్డున ఉన్న ఈ నగరం ఆల్ప్స్ పర్వత దిగువ భాగంలో ఉంది. ఎప్పటి నుండో ఇది యూరప్ దృష్టిని ఆకర్షించింది. ఎన్నో దశాబ్దాలుగా రోమన్ కేథలిక్ పోప్ ప్రధాన నగరంగా ఉంది. 1918 తర్వాత వచ్చిన సోషలిస్టు ఆలోచన నగరం రూపురేఖల్ని మార్చివేసింది.
ఒక సాధారణ పర్యాటకుడికి వియన్నా సోషల్ హౌసింగ్ గురించి తెలియకపోవచ్చు. కానీ క్యాపిటలిజమ్, సోషలిజమ్ కలగలిసిన అద్భుత మిశ్రమం ఇది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాలో కేవలం 10 శాతం మాత్రమే సౌకర్యవంతమైన ఇంటిని నిర్మించుకోగలరు.
1918లో వియన్నా పగ్గాలు సోషల్ డెమోక్రాట్ల చేతుల్లోకి వచ్చినప్పుడు వారు నగరమంతా వీధుల్లో చక్కని ఇళ్లు నిర్మించారు. 62% మంది ప్రజలు ఇప్పుడు ఈ ఇళ్లలో నివసిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఢిల్లీలోని 'డీడీఏ ఫ్లాట్'లాగా లేదా ముంబైలోని 'చాల్స్' లేదా డొనాల్డ్ ట్రంప్కి కనిపించకుండా నరేంద్ర మోడీ గోడలు కట్టి దాచి పెట్టిన అహ్మదాబాద్ లోని బస్తీల్లాగా కనిపించదు.
ఆధునిక నగరం
అమెరికాలో దేశ వ్యాప్తంగా అతికష్టంగా 1 శాతం మంది ప్రజలు సామాజిక గృహాలలో నివసిస్తున్నారు. భారతదేశంలో అయితే ఈ సంప్రదాయం ఎప్పుడూ పుట్టనే లేదు.యూరప్ లో కొన్ని నగరాలు ఉన్నాయి.అలాంటి చవకైనవి, మంచివి మరెక్కడా లేవు. పర్యాటకులు ఇష్టపడక పోవచ్చుగానీ, వియన్నా అందం, ప్రశాంతత అసలు రహస్యం ఈ సోషల్ హౌసింగ్ మాత్రమే.
Esta historia es de la edición April 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.