ఊడీ వడ్రంగి పిట్ట అతని భార్య లోనీ కొత్తగా గూడు కట్టుకోవడానికి తగిన స్థలం కోసం వెతుకుతున్నారు.
“నాకు నిశ్శబ్దంగా ఉండే ఒక ప్రశాంతమైన ప్రదేశం కావాలి. అక్కడ నేను గుడ్లు పెట్టవచ్చు.బాధ లేకుండా పిల్లలను పెంచవచ్చు" అంది లోనీ.
వారు పచ్చదనంతో నిండి ఉన్న అడవిలో ఒక నిర్జన ప్రదేశానికి వెళ్లారు.
“చూడు, ఈ ప్రదేశంలో చాలా చెట్లు ఉన్నాయి.చెట్లకు పండ్లు కూడా ఉన్నాయి" అన్నాడు ఊడీ.
“అవును, దగ్గరలో ఒక సరస్సు ఉంది. దాని చుట్టూ గడ్డి పుష్కలంగా ఉంది. ఇది చాలా గొప్ప ప్రదేశం. ఇక్కడ ఆహారం, నీరు పుష్కలంగా ఉంది.
ఇది నిశ్శబ్దంగానూ ఉంది. మనం ఇక్కడ గూడు నిర్మిద్దాం” చెప్పింది లోనీ సంతోషంగా.
“ఓహ్, చూడు! ఈ చెట్టుకి తొర్ర కూడా ఉంది" అన్నాడు ఊడీ.
“చాలా బాగుంది. మనకు ఎక్కువ సమయం కూడా లేదు. నేను ఇప్పుడు ఏ క్షణంలోనైనా గుడ్లు పెడతాను. మనం ఈ తొర్ర ఉపయోగించుకుందాం. దీనిని గూడులాగా అలంకరించుకుందాం" తన నిర్ణయాన్ని చెప్పింది లోనీ.
పక్కన చెట్టుపై కూర్చుని పండు తింటున్న ఒక రామ చిలుక “నా పేరు పెప్పీ. మీరిద్దరు ఇందులో నివసించి పొరపాటు చేయవద్దని నా సలహా” అని వారితో చెప్పాడు.
కానీ ఊడీ, లోనీలు ఆ ప్రదేశం చూసి ఎంతగానో ఆకర్షితులయ్యారు. రామచిలుక సలహా వినడానికి వారు ఇష్టపడలేదు.
“మేము నీ అభిప్రాయాన్ని అడిగామా? ఎందుకు
నువ్వు మాతో మాట్లాడుతున్నావు? ఎక్కడ నివసించాలో, ఎక్కడ నివసించకూడదో నిర్ణయించేంత తెలివి మాకు ఉంది" అంది లోనీ చిరాకు పడుతూ.
“కానీ నేను చెప్పేది కనీసం ఒకసారి వినండి.
కొద్ది దూరంలో ఉన్న ఆ ఇనుప పలకలను చూడండి.” కానీ ఊడీ పెప్పీనీ మధ్యలో కట్ చేస్తూ “మాతో మాట్లాడవద్దని నీకు చెప్పాం. మాకు ఏది మంచిదో, మేమే చూసుకుంటాం” అన్నాడు.
పెప్పీ నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు.
ఊడీ, లోనీలు తమ కొత్త గూడును తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. వాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రంగురంగుల ఈకలు, పనికిరాని పుల్లలు, గడ్డి సేకరించడానికి చుట్టూ ఎగిరారు. గూడు ఏర్పాటు చేయడానికి వాళ్లు చాలా గంటలు శ్రమించారు. వారి ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.