భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట. మరోమాటల్లో చెప్పాలంటే మన ఊహలకు సైతం అందని ఆ భగవంతుడు తన అందలం నుండి క్రిందకు దిగివచ్చి అందరివాడిగా జనసందోహంతో కలిసి సందడి చేయడమే అవతరించడం అవుతుంది. భగవంతుడు సాధారణంగా ధర్మ స్థాపనకోసం అవతారం ధరిస్తుంటాడు. నిజానికి సాధువుల కన్నా ఉత్తముల కన్నా పాపాత్ముల గురించే భగవంతుడు ఎక్కువుగా పరితపిస్తుంటాడు. వాళ్ళను ఉద్ధరించడానికే భూమిపై ప్రత్యక్షమౌతుంటాడు. ఐతే ఇంతవరకు భగవంతుడు ఎన్నిసార్లు నేలపై అవతరించాడనేది ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. కాకపోతే కొన్ని భగవదవతారాలు విశ్వవ్యాప్తం చెందాయి. వాటిలో శ్రీమన్నారాయణుడు ధరించిన పది ప్రముఖ అవతారాల గురించి మీ కోసం....
1. మత్స్యావతారం
రక్షింపబడ్డాయి. వాటినుండి మళ్ళీ సృష్టి మొద లైంది.ఆ విధంగా సర్వజీవ రక్షకుడయ్యాడు మత్స్య రూపుడైన శ్రీమహా విష్ణువు. ఈ అవతారంలో నారాయణుడు చేపగా రూపు ధరించాడు. ఇది దశావతారాల్లో మొదటిది. పూర్వం సత్యాశ్రయుడు అనే రాజు ఒకరోజు నదిలో సంధ్యవారుస్తుండగా అతని దోసిలిలోకి ఒక చేపపిల్ల వచ్చి చేరింది. ఆ చేపపిల్లను మళ్ళీ నీళ్ళలోకి వదిలేయబోతుండగా అది మానవస్వరంతో రాజా! ఇక్కడ నాకు ప్రాణహాని జరగొచ్చు. నన్ను తీసుకెళ్ళి రక్షించు అంది. రాజు సరే అంటూ ఆ చేపను తీసుకెళ్ళి ఒక జాడీలో వేశాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ చేపపిల్ల విపరీతంగా పెరగసాగింది. అందువల్ల దాన్ని జాడీనుండి తీసి కొలనులో వేశాడు. కానీ అది కొలనుకున్నా పెద్దదైంది. రాజు ఆశ్చర్యపడుతూ దాన్ని నదిలో వదిలాడు. అది క్రమంగా నదికంటే పెద్దదైంది. దాంతో రాజు దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేశాడు. చివరకు ఆ మత్స్యం మరెవరో కాదు స్వయంగా ఆ నారాయణుడే అని గ్రహించాడు రాజు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.