అది 1991...
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.'దేహీ' అంటూ రోడ్డున పడే గడ్డు పరిస్థితి వచ్చేసింది. సరిగ్గా ఆ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు పి.వి. నరసింహారావు. ఆయనకు తోడుగా నిలిచారు.డా. మన్మోహన్ సింగ్. అంతకుముందు చంద్రశేఖర్ ప్రభుత్వం లో దేశం ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోన్నదో పి.వి. ప్రత్యక్షం గా చూశారు. ఇప్పుడు తానే ఆ 'కుర్చీలో కూర్చున్నారు. ఏం చేయాలి? అనే ప్రశ్నార్థకంతోనే ఆయన పదవీ కాలం మొదల యింది. ఈ దేశాన్ని గట్టెక్కించడం ఎలా? బొటాబొటి సిట్లతో, తగినంత మెజారిటీ రాకపోయినా మిత్రపక్షాల 'మద్దతు'తో సంకీర్ణాన్ని ఏర్పాటు చేయగలిగారు కానీ దానిని సమర్థంగా ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అర్థంకాని పరిస్థితి. అప్పుడు ఆయనకు కనిపించిన ఒకే ఒక వెలుగురేఖ డా. మన్మోహన్ సింగ్.అసాధారణ రాజనీతిజ్ఞుడిగా పేరెన్నికగన్న పివికి ఎవరిని ఎందు కు ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అలా, రాజ కీయాలకు దూరంగా ఉంటున్న యుజిసి బాధ్యతలతో తలము నకలుగా ఉన్న మన్మోహన్ సింగ్ను దేశ ఆర్థిక మంత్రిగా నియ మించడానికి ఎంతో ప్రయత్నించి సఫలమయ్యారు. పివిఐదేళ్ళు నిరాఘాటంగా సాగుతారనడానికి అప్పట్లో అది తొలి సంకేతం.అధికారంలోకి వచ్చేనాటికి స్థూల దేశీయ ఉత్పత్తి(జిడిపి) 3.3 శాతానికి క్షీణించి ఉంది. అలా ఉన్న ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ చేతుల్లో పెట్టారు పి.వి. బాలకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినట్లు మన్మోహన్ ఆర్థిక వ్యవస్థను తొలుత మరింత పడిపోకుండా పట్టుకున్నారు. అప్పటికే ఆయన చేయి తిరిగిన ఆర్థికవేత్త కావడంతో తలపై మహా భారం ఉన్నా దాని కింద తన భారతీయ కుటుంబమంతా పడి నలిగిపోకుండా ఆదుకున్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు