టోనీ, బంటీ, మయాంక్‌ల పరీక్షలు ల ముగిసాయి. వేసవి సెలవుల్లో ఏదైనా కొత్తది చేయాలన్న ఉత్సాహంతో వారు ఉన్నారు. పార్క్ ఒక బెంచీపై కూర్చుని తమ ప్రణాళికల గురించి చర్చించుకున్నారు.
“మనం ఇక్కడ ప్రతిరోజూ ఆడుకుంటాం.పార్కులో చాలా చెత్త పేరుకుపోయి ఉంది చూడండి. దాన్ని మనమంతా కలిసి ఎందుకు శుభ్రం చేయకూడదు” మయాంక్ ఒక ప్రతిపాదన చేసాడు.
“మంచి ఆలోచన. అందరం కలిసి శుభ్రం చేస్తే ఎక్కువ సమయం పట్టదు.పార్క్ శుభ్రంగా ఉంటుంది.”
బంటీ, టోనీలు సరే అన్నారు. కానీ “ఒక కండీషన్" అని చెప్పారు.
“కండీషనా? ఏమిటది?" అడిగాడు మయాంక్.
“నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇవ్వాలి" అన్నాడు బంటీ.
“ఇది చాలా బాగుంది. పిజ్జా కొనడానికి సరిపడా డబ్బు నా పిగ్గీ బ్యాంకులో ఉంది. మీ అందరికీ పిజ్జా పార్టీ ఇస్తాను” సంతోషంగా ఒప్పుకున్నాడు మయాంక్.
వారి ఉత్సాహంతో పార్క్ చక్కగా, శుభ్రంగా మారింది. చిన్నారుల కృషిని బాటసారులు మెచ్చుకున్నారు.
శుభ్రం చేసిన తర్వాత పిల్లలు చేతులు, ముఖాలు కడుక్కున్నారు. మయాంక్ పిగ్గీ బ్యాంక్ తెరిచి డబ్బు తీసాడు. ఒక పెద్ద పిజ్జాను ఆర్డర్ చేయాలనుకున్నాడు. కానీ ఎక్కడ తినాలి? ఇలా ఆలోచిస్తుండగా మయాంక్ తండ్రి ఫోన్ చేసాడు.
“మయాంక్, మీ అమ్మ, నేను ఒక పని మీద బయటకు వెళ్తున్నాం. సాయంత్రం ఇంటికి వస్తాం.అప్పటిదాకా నువ్వు ఇంట్లోనే ఉండు" అని చెప్పి తండ్రి వెళ్లిపోయాడు.
పిల్లలకు ఇప్పుడు మయాంక్ ఇంట్లో పిజ్జా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టమైంది. మయాంక్ తన ఇంటి అడ్రసుతో పిజ్జా ఆర్డర్ చేసాడు. తర్వాత వారు మయాంక్ ఇంటికి వెళ్లారు. ఒక చోట కూర్చున్నారు.వెంటనే పిజ్జా వచ్చింది. మయాంక్ పిజ్జాను తీసుకుని వెళ్లి వెనుక గదిలో టేబుల్‌పై పెట్టాడు.ముందు వైపు తలుపుకి బయటి నుంచి తాళం వేసాడు.
పెద్ద వాళ్లు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పిల్లలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. క్యారమ్ బోర్డ్ కనిపించింది. దాన్ని శుభ్రం చేసి ఆడుకోసాగారు. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి తమకు నచ్చిన పాటలను పెద్ద శబ్దంతో పెట్టుకుని వినసాగారు.
Denne historien er fra June 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
స్మార్ట్
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
మ్యాప్ క్వెస్ట్
జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.
అరుదైన దెయ్యం
అరుదైన దెయ్యం
బొమ్మను పూర్తి చేయండి
క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు
చుక్కలు కలపండి
ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.
చీకూ
చీకూ
న్యూటన్ డిస్క్
ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!