చిత్తూరు జిల్లా, సత్యవేడు తాలూకా, పిచ్చాటూరు మండలము, పుత్తూరు, చెన్నై రహదారిలో, అరుణానదీ తీరమున, రామగిరి గ్రామము నందు పర్వతమును ఆనుకొని వున్న క్షేత్రమే శ్రీ మరకతాంబికాసమేత శ్రీ వాలీశ్వర స్వామి దేవాలయము. ఈ పురాతన ప్రసిద్ధి పొందిన దేవాలయం తొమ్మిదవ శతాబ్ధమునకు చెందినది. ఈ దేవాలయము పల్లవకాలపు శిల్పకళా నైపుణ్య ములతో రూపు దిద్దుకున్నది. పర్వతము క్రింద ఉత్పత్తియగు నంది నోటి ద్వారా దేవాలయ కోనేటిలో నీరు నిరంతరం వస్తూ వుండడం వలన దీనిని నందితీర్ధమని అంటారు. నీరు త్రాగుటకు తీయగా, అమృత పానీయముగా ఉండును. ప్రకృతి సౌందర్యాలన్నీ రంగరించుకొని ఉండుట వలన ఈ ప్రదేశము ప్రశాంతంగా వుంటుంది. ఈ దేవాలయమును దర్శించిన భక్తులకు ఆత్మ సంతృప్తి, దైవానుగ్రహము పుష్కలంగా లభించునని భక్తుల ప్రగాఢ విశ్వాసము, నమ్మకము. ప్రస్తుతము ఈ దేవాలయము ఆంధ్రప్రదేశ్ దేవా దాయ, ధర్మాదాయ శాఖ వారిచే నిర్వహించబడుచున్నది. ఈ ఆలయమే వాలీశ్వర స్వామి దేవాలయము, రామగిరి.
పురాణకాలములో దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రులవారు, లంకాధిపతియైన రావణాసురుని సంహరించి, అతని ఆధీనములో బంధింప బడిన తన శ్రీమతి శ్రీ సీతాదేవిని విడిపించుకొని, తన పరివారముతో రామేశ్వరమునకు వచ్చెను శ్రీరామచంద్రులవారు.
రావణాసురుడు బ్రహ్మాంశ సంభూతుడగుటచే అతనిని సంహరించుటచే శ్రీరాముల వారికి బ్రహ్మహత్యాదోషము కలిగినది. ఈ దోషముతో అయోధ్య వెళ్ళి పట్టాభిషేకము చేసుకొనుట అంత మంచిది కాదని, వశిష్టాది మహర్షులు తెలిపారు. కాశీ పట్టణమందు గల ఒక స్వయంభు శివలింగమును తెచ్చి ప్రతిష్టించి, పూజించినచో, ఆ బ్రహ్మహత్యా దోషము తొలగునని తెలిపారు.
అందుకు శ్రీ రాములవారు సమ్మతించి, తన నమ్మినబంటుటైన శ్రీ హనుమంతుని పిలిచి ఆంజనేయా! ఈ రోజునే నీవు కాశీ పట్టణమునకు వెళ్ళి, రేపు తెల్లవారుజామున (సూర్యుడు ఉదయించక ముందే) గంగానదిలో స్నానంచేసి, కాశీ క్షేత్రమందున్న స్వయంభు శివలింగము నొకదానిని, మధ్యా హ్నములోగా తీసుకొని, రామేశ్వరమునకు రావలయునని ఆజ్ఞాపిం చెను.ఆంజనేయస్వామి శ్రీ రాముని ఆజ్ఞను శిరసావహించి ముందురోజే, రామేశ్వ రమును వదలి, ఆకాశమార్గములో తిరుక్కారిక అను గ్రామము మీదుగా కాశీకి వెళ్ళెను.
Denne historien er fra telugu muthyalasaraalu -utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra telugu muthyalasaraalu -utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
రాష్ట్ర ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని కలిసిన ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి. వరదరాజులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని మర్యాదపూర్వంగా ఏపీ ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులతో జి. వరదరాజు కలిసి శాలువతో సత్కరించి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు
తల్లిదండ్రుల బాధ్యత
ఏ దేశానికైనా యువతే వెన్నెముక దేశ సంపద దేశ భవిష్యత్తు. దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే దానికి యువతే రథచక్రాలు.
ఎంహెచ్ఐను సన్మానించిన రాష్ట్ర దళిత సంఘాలు
చిత్తూరు నగరపాలక సంస్థ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంహెచ్ ఓ డాక్టర్ లోకేషన్ను దళితప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మిట్ట ధనుంజయరావు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఎం.హెచ్.ఓను సన్మానించిన కురుక్షేత్రం ఎడిటర్
జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్ల మెంటరీ కమిటీ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మి ధనంజయరావు.
ఎయిడ్పట్ల అప్రమత్తంగా ఉండండి.
చిత్తూర్ అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ - కటారి హేమలత
రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించండి.
రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమాయోజన పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి ఆదేశించారు.
ఉద్యాన పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన
చిత్తూరు జిల్లాకు సంబంధించి టమోటా పంటను రబీ సీజన్ లో భీమా కొరకు గుర్తించారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.