ఆదివాసీల ఆత్మగౌరవ సూచిక 'పచ్చబొట్టు'
Vaartha-Sunday Magazine|September 10, 2023
నుదుటి మీద బొట్టు పెట్టుకోవడం భారతీయతే కాదు..చక్కని ఆరోగ్య హేతువు కూడా బొట్టు కొద్దికాలం వుండిపోతుంది.కానీ కలకాలం చెరిగిపోకుండా కడదాకా వుండేది కేవలం 'పచ్చబొట్టు' మాత్రమే.
- గుమ్మడి లక్ష్మీనారాయణ
ఆదివాసీల ఆత్మగౌరవ సూచిక 'పచ్చబొట్టు'

నుదుటి మీద బొట్టు పెట్టుకోవడం భారతీయతే కాదు..చక్కని ఆరోగ్య హేతువు కూడా బొట్టు కొద్దికాలం వుండిపోతుంది.కానీ కలకాలం చెరిగిపోకుండా కడదాకా వుండేది కేవలం 'పచ్చబొట్టు' మాత్రమే. ఈ తరంవారికి పచ్చబొట్టు అంటే ఒంటిపై వేయించుకొనే ఫ్యాషన్ చిహ్నమని, టాటూ పేరుతో చిత్రించుకొనే మాడ్రన్ డిజైన్ అని భావిస్తారు. కానీ నిన్నటి తరంవారికి అది జీవితాంతం గుర్తుండిపోయే ఓ పదిల జ్ఞాపకం. ఆదివాసీలకైతే అదో సంప్రదాయం.

పచ్చబొట్టు అనేది ఆదివాసీ ఆడబిడ్డల పాలిట గౌరవ చిహ్న కాదు, ఒకప్పుడు వారి పాలిట ఆత్మరక్షణ కవచమై ఆదిమ జాతిని కాపాడింది కూడా అందుకే ఆదివాసీలు నేటికీ పచ్చబొట్టు ధరిస్తూ ఆ సంప్రదాయాన్ని కాపాడుకుంటున్నారు.తమ వారసత్వ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు. ఈ పచ్చబొట్లు అనేవి ఆదివాసీ అమ్మాయిలకు అందంకోసమే కాక, తమ జాతి గుర్తింపు కోసం ఉపయోగపడే సాంస్కృతిక చిహ్నాలు. తమ జాతి రక్షణ కవచాలు కూడా అవే! ఆనాడు తమ జాతిని, శత్రురాజుల నుండి రక్షించిన పచ్చరంగునే 'పచ్చబొట్టు' పేర ముఖంతో పాటు శరీరంలోని వివిధ అవయవాల మీద రకరకాల ఆకృతులతో అలంకరించుకుంటున్నారు. గిరిజనుల్లో పచ్చబొట్టు అనేది తోటి, కోలాం అనే తెగలోని స్త్రీలకు మాత్రమే ఒకప్పుడు పరిమితమైన కళ. నేడిది విశ్వవ్యాప్తం అయింది.

అనేక గిరిజన తెగలు నాటి సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే ఇప్పటికీ ఆరోగ్యపరంగా మంచిదని పచ్చబొట్లు పొడిపించుకోవడం విశేషం.పచ్చబొట్లు ఎంత ఎక్కువగా పొడిపించుకుంటే వారు అంతటి ధైర్యవంతులుగా సమాజంలో గౌరవించబడతారని వారి ప్రగాఢ నమ్మకం. ఈ పచ్చబొట్టు పొడిపించుకోవడానికి ధైర్యంతో పాటు ఓపిక కూడా అవసరం. సన్నని సూదులతో చర్మంపై గుచ్చుతూ పొడిచే సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతాయి. ఎలాంటి మత్తుమందు అవసరం లేకుండానే ఆ బాధను భరించి తమ సంస్కృతిలో భాగమైన పచ్చబొట్లు పెట్టుకోవడం నిజంగా సాహసం అనిపిస్తుంది. మధ్యప్రదేశ్లోని ఆదివాసులు వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తారు.

Denne historien er fra September 10, 2023-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 10, 2023-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA VAARTHA-SUNDAY MAGAZINESe alt
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.

time-read
1 min  |
November 03, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
November 03, 2024
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
Vaartha-Sunday Magazine

కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'

ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.

time-read
3 mins  |
November 03, 2024
ముగురు దొంగలు
Vaartha-Sunday Magazine

ముగురు దొంగలు

అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.

time-read
2 mins  |
November 03, 2024
సాహితీశరథి దాశరథి
Vaartha-Sunday Magazine

సాహితీశరథి దాశరథి

సాహిత్యం

time-read
2 mins  |
November 03, 2024
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
Vaartha-Sunday Magazine

చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్

చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.

time-read
1 min  |
November 03, 2024
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
Vaartha-Sunday Magazine

వెట్టిచాకిరీ నుంచి విముక్తి

ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.

time-read
2 mins  |
November 03, 2024
నవభారత నిర్మాతలం
Vaartha-Sunday Magazine

నవభారత నిర్మాతలం

నవభారత నిర్మాతలం

time-read
1 min  |
November 03, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 03, 2024
అపరిమితమైన కోరికలు
Vaartha-Sunday Magazine

అపరిమితమైన కోరికలు

గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.

time-read
1 min  |
November 03, 2024