భారతదేశ మహానగరాల్లో ఒకటైన బెంగళూరు కర్ణాటక రాష్ట్ర రాజధానిగా భాసిల్లుతోంది. దీన్నే 'ఇండియన్ సిలికాన్ వ్యాలీ', 'హరిత నగరం', 'పబ్లిసిటి', 'స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా', 'గార్డెన్ సిటీ' ఇలా పలు ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. దీన్ని ఒకప్పుడు కల్యాణపుర, కళ్యాణపు (మంచి నగరం), దేవరాయనగర అని పిలిచేవారు. ఇది ప్రపంచంలో 27వ అతి పెద్ద నగరంగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ నెలకొన్న పచ్చని ఉద్యానవనాల కారణంగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పేరొందింది. హోయసల రాజవంశానికి చెందిన 'వీర భల్లాల' అనే రాజు ఓసారి వేటకు వెళ్ళి అడవిలో దారితప్పాడట. ఆకలితో అలసిన ఆ రాజుకు ఒక వృద్ధురాలు ఉడికించిన చిక్కుళ్ళను ఇచ్చి ఆకలి తీర్చిందట. ఆకలి తీరిన ఆ రాజు ఈ ప్రాంతాన్ని 'బెండకాళ్ళ' ఊరు అని పిలిచాడట.కాలక్రమేణా అది బెంగళూరుగా మారింది. దక్షి ణ భారతదేశానికి చెందిన అనేక రాజవంశీకులు క్రీ. శ. 1537 వరకు బెంగళూరును పాలించారు. విజయనగర సామ్రాజ్యం లో సేనాధిపతి అయిన కెంపగౌడ 400 ఏళ్ళ క్రితం బెంగళూరు నగరాన్ని నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.నాటి చక్రవర్తి అచ్యుత రాయలు అనుమతితో క్రీ.శ. 1537లో ఇప్పటి నీటి మార్కెట్ ఎదురుగా ఒక మట్టికోటను నిర్మించి దానికి బెంగళూరు అని నామకరణం చేశాడు. ఆ తరువాత అచ్యుతరాయలు ఇతనికి అనేక జాగీరులు ఇచ్చాడు. ఆ జాగీరుల నుండి వచ్చిన ధనంతో కెంపగౌడ అనేక దేవాలయాలు నిర్మించారు. బసనం గుడిలో నంది దేవాలయం, గనిపురంలో గాని గంగాధరేశ్వర వంటి ఆలయాలతో పాటు నగరానికి నాలుగు దిక్కులా పెద్ద పెద్ద బురుజులు నిర్మించాడు. ప్రస్తుతం బెంగళూరు ఈ హద్దులు దాటి సువిశాల నగరంగా విస్తరించింది. 1966లో కర్నాటక రాష్ట్రం ఏర్పడి బెంగళూరు రాజధానిగా విరాజిల్లుతుంది.
భారీ పరిశ్రమల కేంద్రం : బెంగళూరు నగరానికి మొట్టమొదట 1906లో విద్యుచ్ఛక్తి సరఫరా అందించారు. దీంతో భారీ పరిశ్రమలు ఇక్కడ స్థాపించారు. ది హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ, ది హిందుస్తాన్ మెషీన్ టూల్స్ ఫ్యాక్టరీ, ది భారత్ ఎలక్ట్రానిక్స్, ది ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ ఇత్యా అనేక భారీ పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు బెంగళూరు ఆర్థికాభివృద్ధికి దోహదపడినాయి. కర్నాటకలో ప్రసిద్ధి చెందిన షారావతి హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్, షిమోగా సమీపాన గల ఓక్ పవర్ స్టేషన్ నుండి బెంగళూరుకు విద్యుచ్ఛక్తి సరఫరా అవుతుంది..
అద్భుత భవనం విధానసౌధ
Denne historien er fra December 15, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 15, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.
చెరువు మధ్యలో దీవి
ఏ పంటకైనా నీళ్లు అవసరం. నీరే ప్రతిజీవికి ప్రాణం. మరి పంటలకు నీరు లేకపోతే చేతికొచ్చిన పంట దెబ్బతింటుంది. నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
అక్కా బడికెళ్లదాం
చివరి పరీక్ష
కథ
ఉద్యాన నగరి బెంగళూరు
మనదేశంలో ఉద్యానవనాల నగరంగా ఖ్యాతినార్జించిన సుందర నగరం బెంగళూరు.
ఒక యోధుడి కవితాత్మక గాథ
బొమ్మగాని వెంకటయ్య కమ్యూనిష్టు నాయకుడు. ఎన్నో రజాకార్ల నిర్బంధాలను ఎదుర్కొని, రహస్య జీవితం గడిపిన ధీరుడు. సూర్యాపేట బొడ్రాయి దగ్గర ప్రాణాలకు తెగించి ఎర్రజెం మామ్ముకొని వెంకలయ్యే డాను ఎగరేసిన ధైర్యవంతుడు.
పద్యప్రియులను అలరించే పుస్తకం
'సారస్వత భాస్కర' ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకి ఈ పుస్తకం కవి అంకితం చేసారు.
సామెతలు ఆమెత-బిందు మాధవి
సామెతలు ఆమెత-బిందు మాధవి