సంకల్పమే సగం బలం
Champak - Telugu|September 2024
ఊపి జింక ప్రతి రోజూ నిద్ర లేచిన తర్వాత ఉదయాన్నే పరుగెత్తేవాడు. అతను అలా పరుగెత్తడం చూసి ఒక రోజు బ్లాకీ ఎలుగుబంటి "ఊఫీ నువ్వు పరుగు ప్రాక్టీస్ చేయడానికి రోజూ ఇలా ఇంత తొందరగా లేచి ఆ తర్వాత స్కూల్కి వస్తావు కదా. నీకు అంత అవసరమా?” అని అడిగాడు.
కథ • అల్కాజైన్
సంకల్పమే సగం బలం

ఊపి జింక ప్రతి రోజూ నిద్ర లేచిన తర్వాత ఉదయాన్నే పరుగెత్తేవాడు. అతను అలా పరుగెత్తడం చూసి ఒక రోజు బ్లాకీ ఎలుగుబంటి "ఊఫీ నువ్వు పరుగు ప్రాక్టీస్ చేయడానికి రోజూ ఇలా ఇంత తొందరగా లేచి ఆ తర్వాత స్కూల్కి వస్తావు కదా. నీకు అంత అవసరమా?” అని అడిగాడు.

ఊఫీ దానికి బదులిస్తూ “ఉపాధ్యాయ దినోత్సవం రోజున పాఠశాలలో జరిగే ఇంటర్ స్కూల్ రేసులో నేను గెలవాలని అనుకుంటున్నాను. అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి తయారై వస్తాను. స్కూల్లో కలుద్దాం" అంటూ ఊఫీ తన ఇంటివైపు తిరిగి పరుగెత్తాడు. తల్లి అతని కోసం పాలు, క్యారెట్లతో అల్పాహారం సిద్ధం చేసి పెట్టింది. ఊఫీ బ్రేక్ఫాస్ట్ చేసి త్వరగా రెడీ అయ్యి స్కూల్కి పరుగెత్తాడు. తన లాగే బడిలో చాలామంది పిల్లలు రేసు ప్రాక్టీస్ చేస్తూ పొద్దున్నే అడవిలో పరుగెత్తడం కనిపించారు.

ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరిగిన రేసులో గెలిచి ముఖ్య అతిథి అథ్లెట్ చాపల్ చిరుత నుంచి బహుమతిని అందుకోవాలని ఊఫీ లక్ష్యంగా పెట్టుకున్నాడు. పాఠశాల కారిడార్లో ఊఫీకి పాఠశాల ప్రిన్సిపాల్ హట్టూ ఏనుగు ఎదురయ్యాడు. "చెప్పు ఊఫీ, రేసు కోసం నీ ప్రాక్టీసు ఎలా జరుగుతున్నది? ఇతర పాఠశాలల పిల్లలు కూడా పాల్గొంటారట. రేపు రేసులో మన పాఠశాల నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించాలన్నది నిర్ణయించడానికి తుది ఎంపిక జరుగుతుంది" అన్నాడు.

“నేను చాలా బాగానే ప్రాక్టీసు చేస్తున్నాను సార్. నేను పాఠశాల తరపున పాల్గొనాలని అనుకుంటున్నాను” అని జవాబిచ్చాడు ఊఫీ.

“ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో! రేపు ఏం జరుగుతుందో చూద్దాం” అన్నాడు ప్రిన్సిపాల్.

ఊఫీ పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కొంచెం అలసిపోయాడు. అయితే దాన్ని పట్టించుకోకుండా తన హెూంవర్క్ పూర్తి చేసి రన్నింగ్ ప్రాక్టీస్ కోసం బయలుదేరాడు. కానీ అలసట వల్ల రోజులాగా మామూలుగా పరుగెత్తలేనని అతనికి అర్థమైంది. బ్లాకీ కూడా అలసిపోయి ఇంటికి చేరాడు. బ్లాకీ తేనె రాసిన రొట్టెని తింటున్నప్పుడు ఊఫీని చూసి “ఏం అలా ఉన్నావు?" అని అడిగాడు.

This story is from the September 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the September 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView All
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 mins  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 mins  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 mins  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024