ఈ ప్రపంచంలో మానవ జాతి సృష్టి ఎప్పుడు, ఎన్నివేల, లక్షల సంవత్స రాల క్రింద ఎక్కడ ఈ భూమిపై ఏ ప్రదేశంలో జరిగిందనే దానిపై భిన్నాభిప్రాయాలుండ వచ్చు.అయితే మానవ జాతి సృష్టించబడిన తర్వాత దాని మనుగడ మాత్రం భిన్నప్రాం తాలలో విభిన్న రకాలుగా కొనసాగుతున్న వైనం బహిరంగ రహస్యమే.
ఈ నేపధ్యంలో భారతీయ వారసత్వం, సంస్కృతి మూలాలలోకి వెళ్లి చూసినప్పుడు వేదకాలపు సంస్కృతిలో భాగంగా తొలివేదమైన బుగ్వేదంలో స్పష్టంగా విశదీకరించ బడిన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథిదేవోభవ అనే సూక్తిలో నిర్వచనానికి అతీతమైన దైవమనే పదాన్ని ముందుగా తల్లికీ, తర్వాత తండ్రికీ తదనంతరమే గురువులకూ, సమాజానికి అన్వయించిన వైనాన్ని పరిశీలించినప్పుడు ఆదర్శ సమాజ నిర్మాణం, ఓ ఆదర్శ కుటుంబ నిర్మాణంతోనే ప్రారంభమౌతుందనీ, ఆ ఆదర్శకుటుంబ నిర్మాణానికి ఊపిరులూదాల్సిన బాధ్యత నిస్సందేహంగా తల్లిదండ్రులదేననే సత్యాన్ని జీర్ణించుకోక తప్పదు. నిజానికి ఈ బాధ్యతను నిర్వర్తించేక్రమంలో గర్భధారణ నిర్ధారణ జరిగిన మరుక్షణం నుండీ సుఖప్రసవం జరిగేవరకు కొనసాగే తొమ్మిది నెలలకాలంలో తల్లిగర్భంలోని ఆ గర్భస్థశిశువుల రక్షణ ప్రతి కుటుంబం తమ ఆరోప్రాణంగా భావిస్తోంది.
ప్రతి ఇంట్లో ఓ మహాయజ్ఞంగా సాగే సదరు ప్రక్రియగా సురక్షితంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన సకల చర్యలను వారివారి ఆర్థిక శక్తిననుసరించి కుటుంబ సభ్యులు త్రికరణశుద్ధితో నిర్వర్తిస్తున్న వైనం తెలిసినదే గదా. నైతిక విలువల శిక్షణాకేంద్రాలుగా ఉమ్మడి కుటుంబాలు ఆధునిక నాగరికత వెళ్లివిరిసే వరకు సమాజంలో కుటుంబాలన్ని ఉమ్మడి కుటుంబాలుగా కొనసాగేవి. ఆయా కుటుంబాల్లో చిన్నారులకు ఉగ్గుపాలతోనే అత్యున్నత మానవీయ విలువలను, వెలకట్టలేని మానవీయ సంబంధాలను, నేటి ఆధారిత సమాజంలో మానవ జాతి మనుగడ కోసం వాటిని పెంచి పోషించాల్సిన అవసరాన్ని, మనుషులు మంచి మనుషులుగా ఎదగడానికి అవసరమైన నైతిక విలువలతో కూడిన జీవన నైపుణ్యాలను పెంచి పోషించే శిక్షణాకేంద్రాలుగా వ్యవహరించేవి. నిష్కల్మషమైన తల్లిదండ్రుల ప్రేమకు తోడుగా నానమ్మలు, అమ్మమ్మలు ఉగ్గుపాలతోనే చందమామ రావే జాబిల్లి రావే.. లాంటి జోల పాటల లాలనతో పాటు, తాతలు, పెద్దనాన్నలు, చిన్నాన్నల పోషణలో అల్లారు ముద్దుగా పెరిగేవారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి. నరసింహరావు ప్రాథమిక విద్యాభ్యాసం నర్సంపేట తాలూకాలోని లకినేపల్లిలో వున్న వారి అమ్మమ్మ ఇంట్లోనే కొనసాగడం.
This story is from the August 04, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 04, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.