1901 వ సంవత్సరం, స్వామి వివేకానంద బేలూరు మఠంలో బసచేసి ఉన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా ఉదయం, సాయంత్రం వాహ్యాళికి వెళుతూ ఉన్నారు.
శిష్యుడు వచ్చి ప్రణమిల్లి, 'స్వామీజీ! మీ ఆరోగ్యం ఎలావుంది?' అని అడిగాడు.
స్వామీజీ : ఈ శరీరం దయనీయ స్థితిలో ఉంది. కానీ మీరెవ్వరూ నా పనిలో సహాయపడటానికి ముందుకు రావట్లేదు.ఒక్కడినే ఏం చేయగలుగుతాను. ఈసారి బెంగాల్ భూమిలో పుట్టిన ఈ శరీరం మహా కార్యభారాన్ని మోయగలదా? ఇక్కడకు వచ్చే మీరందరూ పవిత్రాత్ములే! మీరందరూ పనిలో సహాయపడకపోతే నేను ఒక్కడిని ఏం చేయగలను?
శిష్యుడు : స్వామీజీ, త్యాగమూర్తులైన బ్రహ్మచారులు, సాధువులు మీ వెనుక ఉండి, వారి జీవితాల్ని మీ కార్యానికై అంకితమిస్తుండగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు.
స్వామీజీ : సరే, ఈ దేశంకోసం పనిచెయ్యగల కొంతమంది యువకులు కావాలి. భవిష్యత్ కార్యానికై ఉన్నత వ్యక్తిత్వం, మేధస్సు, వినయవిధేయతలు కలిగి, ఇతరుల సేవకై సర్వం త్యాగం చేయగలిగి, నా ఆశయాలకు అనుగుణంగా తమ క్షేమంకోసం, దేశక్షేమంకోసం పనిచేయగలిగేది యువతే అని నా దృఢవిశ్వాసం. సాధారణ యువకులు ఎందరో వస్తున్నారు, ఇంకా వస్తారు కూడా! కానీ, వారి ముఖాలలో నీరసం, శక్తిలేని హృదయాలు, పనిచెయ్యలేని బలహీన శరీరాలు, ధైర్యం లేని మనస్సులు. వారివలన ఏం పని జరుగుతుంది.నచికేతుడిలాంటి దృఢవిశ్వాసం, సంకల్పం గల యువకులు పది పన్నెండు మంది లభిస్తే ఈ దేశపు ఆలోచనలను, ఆశయాలను నూతన పంథాలోకి మార్చివేయగలను.
శిష్యుడు : ఎంతోమంది యువకులు మీ దగ్గరకు వస్తున్నారు కదా! వారిలో మీరు చెప్పిన నచికేతుని వంటి వారు లేరా?
This story is from the April 2023 edition of Sri Ramakrishna Prabha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 2023 edition of Sri Ramakrishna Prabha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద