40 దాటిందంటే మీరు మేకపన్ను వదులుకోవనవసరం లేదు. మేకప్‌లో సరైన షేడ్స్, టెక్నిక్లను ఉపయోగించి ఈ వయసులోనూ యంగ్ లుక్ పొందవచ్చు. నలభై దాటిన మహిళలు యంగ్ గా, ఫ్రెష్ కనిపించడానికి తమ వానిటీ బాక్స్‌లో ఏం ఉంచాలో మేకప్ ఆర్టిస్టు మనీష్ కెర్కర్ ఇలా వివరించారు.
మేకప్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది
మేకప్ ముఖ సౌందర్యాన్ని పెంచుతుందని అందరూ భావిస్తారు కానీ దీంతో ఆత్మవిశ్వాసం సైతం రెట్టింపు అవుతుందనేది నిజం.అలంకరించుకుని మీరు ఎక్కడికైనా వెళ్తే ఎదుటి వారు మిమ్మల్ని ప్రశంసించినప్పుడు మీ బాడీ
లాంగ్వేజ్ ఆటోమేటిక్ గా మారుతుంది.ఎందుకంటే ఆ సమయంలో మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. కాబట్టి బయటికి వెళ్లినప్పుడు మేకప్ చేసుకోవడం మరిచిపోవద్దు.
ఎందుకు దూరంగా ఉండాలి
చాలామంది ఒంటరి మహిళలు ముఖ్యంగా వితంతువులు మేకపికి దూరంగా ఉంటారు. కానీ అలా చేయకూడదు. డార్క్ కాకపోయినా, లైట్ షేడ్స్ మేకప్ మీ అందాన్ని మెరుగుపరుస్తుంది. అలాంటి ఉత్పత్తులకు మీ మేకప్ బాక్స్‌లో ప్రత్యేక స్థానం ఇవ్వండి. ఫౌండేషన్‌కి బదులుగా బీబీ లేదా సీసీ క్రీమ్ ను అప్లై చేయండి.
ఇది మీకు సహజమైన రూపాన్ని ఇస్తుంది.పెదాలకు లిప్ బామ్ అప్లై చేయండి. ఐ మేకప్ కోసం కాటుక పెట్టండి. పదిమందిలో మీ ఉనికిని చాటడానికి మీరు ప్రజెంటబుల్గా కనిపించాలన్నది మరిచిపోవద్దు.
మాయిశ్చరైజర్
పెరుగుతున్న వయసుతోపాటు చర్మం పొడిబారుతుంటుంది. ఈ స్థితిలో చర్మానికి అదనపు మాయిశ్చరైజర్ అవసరం. ఇది చర్మంలో తేమ లోపాన్ని భర్తీ చేస్తుంది.
కాబట్టి ముఖంలో డ్రైనెస్ తగ్గించడానికి పగలు, రాత్రి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే తేమ నిలచి ఉంటుంది. చర్మం మృదువుగా తయారై, మెరుస్తుంది.
యాంటీ ఏజింగ్ క్రీమ్
ముఖంపై ఏర్పడే ముడతలను దాచడానికి యాంటీ ఏజింగ్ క్రీమ్ వాడండి. చర్మం బిగుతుగా మారుతుంది. కావాలంటే మీరు మార్కెట్లో లభించే పాండ్స్ బివీ లేదా లాక్మేస్ సీసీ క్రీము వాడవచ్చు.
ఇందులో మాయిశ్చరైజర్, యాంటీ ఏజింగ్ క్రీమ్, సన్‌స్క్రీన్ లాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఫౌండేషన్, సస్క్రీన్, యాంటీ ఏజింగ్ క్రీమ్ మొదలైన వాటిని విడిగా అప్లై చేయాల్సిన అవసరం లేదు.
Esta historia es de la edición February 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.