1. అంకెల రామాయణం.
కం॥ అంచిత చతుర్థ జాతుఁడు
పంచమ మార్గమున నేఁగి ప్రథమ తనూజన్
గాంచి తృతీయం బచ్చట
నుంచి ద్వితీయంబు దాఁటి యొప్పుగ వచ్చెన్.
మన కవులు పద్యరచనలో చిత్రవిచిత్రాల్కెన విన్యాసాలు చేశారు. వాటిలో ఇది ఒకటి. నాలుగవ దానికి జన్మించినవాడు ఐదవమార్గం గుండా వెళ్లి, మొదటిదాని కూతురిని చూసి, మూడవదాని నక్కడ ఉంచి, రెండవ దానిని దాటి తిరిగి వచ్చాడు.
పంచభూతాలలో మొదటిది భూమి, రెండవది నీరు, మూడవది అగ్ని, నాల్గవది గాలి, ఐదవది ఆకాశం. ఈ పద్యం వెనుక ఉన్న రహస్య మిదే! వాయునందనుడైన హనుమంతుడు ఆకాశమార్గంగుండా లంకా నగరానికి వెళ్లి భూదేవి కుమార్తెయైన సీతాదేవిని చూసి అగ్నితో లంకా దహనం చేసి సముద్రాన్ని దాటి తిరిగివచ్చాడని దీని వివరణ.పంచభూతాల పేర్లతో కాకుండా వాటి వరుస సంఖ్యలతో రామాయణంలోని సుందరకాండకు సంబంధించిన వృత్తాంతాన్ని వివరిస్తున్న మంచి చాటుపద్య మిది. చాటుపద్య మంటే ఏ కావ్యం లోనిదీ కాని పద్యం. ఏదో సందర్భంగా కవీశ్వరులు అలవోకగానూ, ఆశువుగానూ చెప్పిన పద్యం. రసవత్తరమైన, ప్రచుర ప్రచారంలో ఉ న్న అనేక చాటుపద్యాలకు రచయిత లెవరోకూడా మనకు తెలియరావటం లేదు. అదీ చాటుపద్య మంటే!
2. స్థిరసంకల్పం
అని నివారించే గిరిపత్ని యనుఁగుఁ గూతుఁ బార్వతియుఁ దల్లిమాటఁ జేపట్టదయ్యె| నీప్సితార్థంబునకుఁ బాఱు హృదయరుచియు నిమ్నమున కోడిగిలు నీరు నిలుపరాదు.
'... ఆ విధంగా చెప్పి' అంటూ ఈ పద్యం మొదలవుతున్నది. ఆ విధ మేమిటో తరువాత చూద్దాం! ఇప్పుడు ఈ పద్యం: పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసి మెప్పించి అతడిని భర్తగా పొందుదా మనుకొన్నది పార్వతి. తల్లియైన మేనక వద్దకు వెళ్లింది. వెళ్లి ఆ విషయాన్ని చెప్పింది. విన్న మేనక గుండె గుభేలుమన్నది. 'అమ్మా! ఆ తపస్సు నీ వల్ల కాదు. వద్దమ్మా! అన్నది. పార్వతి వినలేదు. తల్లి బుజ్జగిం చింది. అనేక విధాలుగా చెప్పింది. ఐనా వినలేదు పార్వతి ఎందుకు విన లేదో చెప్తున్నాడు కవి.
Bu hikaye Suryaa Sunday dergisinin July 07, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin July 07, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
భరతమాత మెచ్చిన రత్నం మన రతన్ నవల్ టాటా
ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, టాటా గ్రూపు/టాటా సన్స్ కంపెనీలకు 21 ఏళ్ల పాటు చైర్మన్గా పని చేసి, దాతృత్వానికి పెట్టింది పేరుగా నిలిచి, భారతీయులందరికీ గర్వకారణం అయిన రతన్ నవల్ టాటా 28 డిసెంబర్ 1937న సూనీ టాటా - నవల్ టాటా పుణ్య దంపతులకు ముంబాయిలో జన్మించారు.
దివికెగిన ఆర్థిక & రాజకీయ దిగ్గజం..
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు.
సూర్య ఫైండ్ ది difference
సూర్య ఫైండ్ ది difference
సూర్య కవిత
సూర్య కవిత
VEGETABLES CROSSWORD
VEGETABLES CROSSWORD
సూరు బుడత
సూరు బుడత
సూర్య find the way
సూర్య find the way
సూర్య బుడత
బాలల కథ మార్పు తెచ్చిన రేఖ
ఫన్ చ్
ఫన్ చ్
కాలచక్రం లో.....
కాలచక్రం లో.....