వైద్య సేవలు భేష్ : సీఎం కేసీఆర్
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందనీ, కరోనావంటి కష్టకాలంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రదర్శించిన పనితీరు గొప్పదని సీఎం కొనియాడారు. ఎంతచేసినా వైద్యశాఖకు పలు దిక్కులనుండి విమర్శలు వస్తుంటాయని, ఈ విషయాన్ని గమనించి ప్రజావైద్యం దిశగా ఈ శాఖ చేస్తున్న కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని, ఆ దిశగా ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగు పరుచుకుని ప్లానింగ్ చేసుకోవాలని సీఎం సూచించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన వైద్య, ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్ విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా నిర్మించనున్న 'దశాబ్ది' వైద్య భవనాల్లో నూతనంగా 2,000 ఆక్సీజన్ అందుబాటులోకి పడకలు రానున్నాయి. అత్యంత అధునాతన ఆపరేషన్ థియేటర్లు సహా వర్తమాన వైద్య రంగంలో ప్రజల వైద్యసేవలకు అవసరమయ్యే పలు రకాల వైద్య సేవలు అందనున్నాయి.
న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభించిన సీఎం:
గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. కొందరు మహిళలకు న్యూట్రిషన్ కిట్లను సీఎం అందచేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలనే మనిషి తపన ఒకచోట ఆగేదీకాదు, ఒడిసేదీ కాదు. నిరంతరం కొనసాగుతూనే వుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రంగాలతో పాటు రాష్ట్ర వైద్యారోగ్య రంగంలో కూడా అద్భుతమైన అభివృద్ధిని నమోదుచేసుకున్న నేపథ్యంలో, అత్యద్భుత రీతిలో నిర్మించబోయే నిమ్స్ దవాఖానా విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం భారతదేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భమని సీఎం స్పష్టం చేశారు.
Bu hikaye Telangana Magazine dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Telangana Magazine dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
జల సంరక్షణలో పురస్కారాలు
ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.
పేదల మేడలు కొల్లూరు గృహాలు
సంగారెడ్డిజిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు.
సకల జనహితంగా 'విప్రహిత'
బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారిగా గోపనపల్లిలో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది.
తెలంగాణ పచ్చబడ్డది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
సిద్ధిపేటకు ఐటీ టవర్
సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.
రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి
నిమ్స్ దశాబ్ది భవనం
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.
మన గడ్డపై కోచ్ల తయారీ
రాష్ట్రంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తెలంగాణ బిడ్డలు తయారుచేయడం గర్వకారణమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు
- హరితనిధి ఒక నవీన ఆలోచన:
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
కంటి వెలుగు శతదినోత్సవం'
వంద రోజుల 'కంటి వెలుగు' సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.