ఒకట్రెండు చిత్రాల సక్సెస్‌తోనే వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం 'గుంటూరు కారం', 'లక్కీ భాస్కర్', 'మట్కా'తో పాటు పలు చిత్రాల్లో బిజీగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఒక్కో వయసులో ఒక్కో రకమైన లక్ష్యా లను ఎంచుకుంటూ నిరంతరం ముందుకు సాగుతూనే ఉన్నానని తెలిపారు. డాక్టర్‌గా, మోడల్‌గా మంచి గుర్తింపు పొందటమేగాక మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలవటం వరకు లైఫ్ లో ప్రతి స్టేజ్‌ని ఎంజాయ్ చేస్తూ గడిపానని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెప్పారు. హీరోయిన్ గా కెరీర్లో ఎదగాలంటే అందం మాత్రమే సరిపోదని, నటనలో ప్రావీణ్యం, ఫిట్నెస్ చాలా అవసర మవుతాయని మీనాక్షి వి రించారు. తన తండ్రి ఆర్మీలో పని చేయటం వల్ల ఇంట్లో మంచి క్రమశిక్షణ నేర్పి, చదువుల్లో, హాబీల్లో ఎంతగానో ప్రోత్సహించా రని వివరించారు. జీవితంలో కిందపడిన ప్రతీసారి గుణపాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్తే కెరీర్ గ్రాఫ్ ఎల్లప్పుడూ ఎదుగుతూనే ఉంటుందని చెబుతున్న మీనాక్షి చౌదరి ఇంటర్వ్యూ విశేషాలు...
టాలీవుడ్లో చాలా స్పీడ్‌గా ఎదుగుతున్నారు కదా?
కెరీర్ మొదట్లోనే ఇంత బిజీగా ఉంటానని ఏనాడూ ఊహించలేదు. ఒక ప్లాన్ అనేది లేకుండా, కేవలం ఆశయంతోనే ఈ రంగంలోకి వచ్చిన నాకు ఇంతటి ఆదరణ లభించటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
కొందరికి సినీ కెరీర్ ప్రారంభంలో కష్టాలు ఎదురవుతుంటాయి. కానీ నేను ఈ కెరీర్లో అడుగు పెట్టక ముందు లైఫ్‌లో కష్టాలు ఎదుర్కొని, పడి లేచిన కెరటంలా ఇంతవరకు వచ్చాను. ఎవరికైనా లైఫ్ జర్నీ ఇలాగే ఉంటుందేమో.
ప్రస్తుతం ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నారు?
తెలుగులో మూడు, తమిళం, మలయాళంలో కూడా షూటింగ్స్ జరుగు తున్నాయి. బహుశా రెండేళ్ల వరకు నా షెడ్యూల్ బిజీ అయిపోతుంది అనుకుంటున్నాను. అలాగని కొత్తగా వచ్చే సినిమాలు చేయనని కాదు. టైమ్ షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తే అన్నింటినీ మేనేజ్ చేయగలము. అందుకే ప్రస్తుతానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాను.
Bu hikaye Grihshobha - Telugu dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.