CATEGORIES
فئات
యూరప్‌లో థర్డ్ వేవ్!
కరోనా మహమ్మారి యూరప్ దేశాలను వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి.
అమెరికా విదేశాంగమంత్రిగా బ్లింకెన్!
మంగళవారం బైడెన్ ప్రకటించే అవకాశం. భారత్ కు మద్దతుదారుగా పేరు
2014– 29 మనకు అత్యంత కీలకం
భారత్‌లాంటి యవ్వన ప్రజాస్వామ్య దేశానికి 2014 నుంచి 2029 వరకు.. 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభ వరకు.. 15 ఏళ్ల కాలం అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
వీధి బాలల చదువు, పునరావాసంపై ప్రత్యేక శ్రద్ధ
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా గుర్తించిన వీధి బాలల భవితపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏపీ పోలీస్ శాఖ నిర్ణ యించింది.
జార్జియా రీకౌంటింగ్‌లో బైడెన్ గెలుపు
రిపబ్లికన్లకు గట్టి పట్టున్న జార్జియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల రీకౌంటింగ్‌లో డెమొక్రాటిక్ జోబైడెనే గెలుపు సాధించారు. దీంతో 1992 తర్వాత ఈ రాష్ట్రంలో గెలిచిన డెమొక్రాట్ అభ్యర్థిగా బైడెన్ నిలిచారు.
జల సిరులు.. కొత్త రికార్డులు
చిన్న, మధ్య, భారీ ప్రాజెక్టుల్లో 378.738 టీఎంసీల నిల్వ
పుష్కరుడికి స్వాగతం
తుంగభద్రమ్మకు పసుపు, కుంకుమలతో పూజ చేసి పట్టువస్త్రాలను సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
90 లక్షలు దాటిన కరోనా కేసులు
ఢిల్లీలో కోవిడ్ మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబసభ్యులు
అధికార మార్పిడికి అడ్డంకులు
మొండివాడు రాజుకంటే బలవంతుడు ఈ సామెత డొనాల్డ్ ట్రంప్‌కి అతికినట్టుగా సరిపోతుంది ట్రంప్ పట్టిన పట్టు వీడడం లేదు. అధికార మార్పిడికి అంగీకరించడం లేదు తానే గెలిచానని పూటకో ప్రకటన చేస్తున్నారు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టు తలుపులు తట్టారు అధికారాల అప్పగింత సజావుగా సాగకపోతే అమెరికాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.
తుంగభద్రకు పుష్కర శోభ
సీఎం వైఎస్ జగన్ పుష్కరాలు ప్రారంభించే కర్నూలులోని సంకల్ భాగ్ ఘాట్ వద్ద పూర్తయిన ఏర్పాట్లు
తొలుత ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు
• ప్రాధాన్యతల వారీగా కరోనా టీకా పంపిణీ. • కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
పాడి పండుగ
వైఎస్సార్ ఆసరా, చేయూత మహిళలకు 26న పాడి పశువుల పంపిణీ
అనంతపురంలో భారీ డ్రోన్ సిటీ
360 ఎకరాల్లో డ్రోన్ తయారీ, పరిశోధన కేంద్రాలు
కశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
ఘటనా స్థలి వద్ద అప్రమత్తంగా జవాను
కోవిడ్ కష్టాలు విని బైడెన్ భావోద్వేగం
నర్సుల సేవలను కొనియాడిన బైడెన్
పాడి పశువుల ద్వారా 'చేయూత'
పాడి పశువుల ద్వారా 'చేయూత'
వీవీని ఆస్పత్రిలో చేరండి
ముంబై: 'ఎల్గార్ పరిషత్' కేసుకు సంబంధించి జైళ్లో ఉన్న ప్రముఖ తెలుగు విప్లవ కవి వరవర రావును తక్షణమే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత్
ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న టీమిండియా. ప్రేక్షకులు కూడా హాజరయ్యే అవకాశం
మోదీతో కలిసి పనిచేస్తాం : బైడెన్
యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ బైడెన్
విశాఖకు అంతర్జాతీయ ఘనత
అంతర్జాతీయ అవార్డు రేసులో విశాఖ మహానగరం మూడో స్థానాన్ని దక్కించుకుంది.
డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ
ప్రతిపక్ష కుటిల రాజకీయాల వల్ల పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పేదలకు సెంటు, సెంటున్నర స్ధలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారు. ఈ యుద్ధంలో గెలుస్తాం. దేవుడు మనకు అండగా ఉంటాడు. ఇది చాలా గొప్ప కార్యక్రమం.
భారత్ విజయగాథ అపూర్వం
ప్రభుత్వాలు తరచూ మారిపోయినా.. రాజకీయ పార్టీల్లో కుట్రలు ఎన్ని ఉన్నా.. సాయుధ వేర్పాటు ఉద్యమాలు ఎన్ని నడిచినా, అన్ని రకాల స్కామ్‌లు, అవినీతి ఉన్నప్పటికీ ఆధునిక భారత దేశం సాధించిన ఘనతలు పలు విధాలుగా ఓ విజయగాథ అని అగ్రరాజ్యం అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో రాసుకున్నారు.
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి
పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రి అనిలకుమార్ యాదవ్
రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం ఇది..
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. సీఎం స్థానంలో మీ బిడ్డ కూర్చున్నారు. విత్తనం నుంచి పంట అమ్మకాల వరకు సహాయపడే విధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతుల పట్ల మమకారం, బాధ్యతతో గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,180 కోట్లు చెల్లించాం.
స్త్రీలు ఎగరేసిన విమానం
నలుగురు స్త్రీలు ఇప్పుడు ప్రశంసలు పొందుతున్నారు. పేదవాడిని రూపాయి టికెట్‌తో విమానంలో కూచోబెట్టిన ‘ఎయిర్ డెక్కన్’ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకు దర్శకత్వం వహించిన స్త్రీ– సుధ కొంగర... భర్త విమానం ఎగరేయడానికి ముందే ‘బన్ వరల్డ్’ అనే బేకరీ పెట్టి అతని కల నెరవేర్చుకోవడానికి గొప్ప బలం ఇచ్చిన భార్య భార్గవి గోపీనాథ్.. ఆ పాత్రను తెర మీద అద్భుతంగా పోషించి హీరోకు హీరోయినూ సమానమే అని నిరూపించిన మలయాళ నటి అపర్ణ బాల మురళి.. కొడుకు పక్కన కొండలా నిలిచిన తల్లి పాత్ర పోషించిన ఊర్వశీ... వీరంతా ఇప్పుడు ప్రేక్షకులలో స్ఫూర్తినింపే ఒక విమానాన్ని ఎగురవేశారు. గొప్ప కలలు కనడం సామాన్యుడి హక్కు అని సందేశం ఇస్తున్నారు. గోపీనాథ్ అతని భార్య గురించిన సినిమా – జీవిత విశేషాల కథనం ఇది.
ఉగ్రవాదమే పెను ముప్పు
ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు టెర్రరిజం
డిసెంబర్ 1న 'హైదరాబాద్' వార్
గ్రేటర్ హైదరా బాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు 4న జరుగుతుంది.
బ్రిటన్ ప్రధానికి మళ్లీ కరోనా
బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కరోనా బారిన పడ్డారు.
‘అచ్చోసిన' ఆరు అబద్ధాలు
బదిలీలు చేశారు... నియామకాలేవి?’ ‘మళ్ళీ కేంద్ర సర్వీసుకు ప్రవీణ్ ప్రకాశ్’ ‘సచివాలయ భవనం... అసంపూర్ణం‘ ‘రాత్రికి రాత్రే హోటల్ స్వాధీనం’, ‘కిడ్నాప్ చేసి చావ బాదారు’ ‘టిడ్కో ఇళ్ళ వద్ద 144 సెక్షన్’... ఇలా రకరకాల శీర్షికలతో పూర్తి అబద్ధాలను వండి వార్చిందంటూ ‘ఈనాడు’ పత్రికపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవమని... పైపెచ్చు రామోజీరావు పుట్టినరోజు కూడా అని ఈ సందర్భంగా అబద్ధాల్ని మాత్రమే ప్రచురించాలన్న నియమం పెట్టుకున్న తీరులో ఇలాంటి కథనాలు వండి వార్చటమేంటని నిలదీశారు. ఈ కథనాల్లోని నిజానిజాల్ని వివరిస్తూ ఆయన రామోజీరావుకు ఓ బహిరంగ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. నిత్యం ఉషోదయంతో పాటే అబద్ధాల్ని అచ్చువేస్తూ జనం మనసుల్లో విషం నాటుతోందంటూ ‘ఈనాడు’ను ఎండగట్టారు.
అమ్మో అడిలైడ్!
భారత్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు కొత్త సమస్య వచ్చి పడింది.