Try GOLD - Free
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
Grihshobha - Telugu
|June 2024
చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.
చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం. అంటే చర్మ రంధ్రాల నుంచి అదనపు నూనె బయటకు రావడంతో చర్మం జిడ్డుగా మారుతుంది. ఇలాంటి చర్మంపై పెద్ద రంధ్రాలు 'ఓపెన్ పోర్స్', మొటిమలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. దాంతో చర్మం నిర్జీవంగా, మృదువుగా, మచ్చలతో కనిపిస్తుంది.
ఆయిలీ స్కినికి ప్రధాన కారణం వాతావరణ మార్పు. అధిక తేమ కారణంగా చర్మంలో ఎక్కువ చెమట పడుతుంది. అది ఆయిలీగా మారుస్తుంది.ఈ సమస్య నుంచి బయటపడడానికి చర్మ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
జిడ్డు చర్మం ఏర్పడడానికి కారణాలు
వారసత్వం : ఆయిలీ స్కిన్ వారసత్వం వల్ల కూడా వస్తుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా ఆయిలీ స్కిన్ లేదా కుటుంబంలో ఎవరికైనా జిడ్డు చర్మం ఉంటే మీ చర్మం ఆయిలీగా మారే అవకాశాలు ఉంటాయి.
ఎక్కువగా మేకప్ చేయడం : కొందరు మహిళలు ఓపెన్ పోర్స్, మచ్చలు, మరకలు దాచి పెట్టడానికి ఎక్కువ మేకప్ చేస్తుంటారు. కానీ మేకప్ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తే చర్మానికి నష్టం వాటిల్లుతుంది. అందమైన చర్మం కావాలనే కోరికతో కాస్మెటిక్స్ ్న ఎక్కువగా వాడటం వల్ల చర్మానికి హాని కలుగుతుంది.
హార్మోన్ల మార్పులు : : శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు జిడ్డు చర్మానికి కారణమవు తాయి. మహిళల్లో ఎండ్రోజన్ హార్మోన్ హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది. ఇది సెబాసియస్ గ్రంథులను యాక్టివేట్ చేస్తుంది. హార్మోన్ల అసమ తుల్యత పురుషుల్లోనూ టెస్టోస్టెరాన్ హార్మోను యాక్టివ్ గా మారుస్తుంది. దీని కారణంగా వారి చర్మం సైతం జిడ్డుగా తయారవుతుంది.
ఆయిలీ చర్మం నుంచి బయట పడండి
ముఖాన్ని సరిగ్గా కడుక్కోండి : కనీసం రెండుసార్లు రాత్రి నిద్ర పోయే ముందు, ఉదయం లేవగానే ముఖం కడుక్కోవాలి. కానీ ఇంతకంటే ఎక్కువ చేయకూడదు. ఎక్కువసార్లు కడిగితే చర్మం పొడిబారుతుంది. వేడి లేదా గోరువెచ్చని నీళ్లు వాడితే కూడా చర్మం పొడి బారుతుంది.చర్మాన్ని శుభ్రం చేయడానికి సల్ఫర్, సాల్సిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్తో ఉన్న క్లీన్సర్ను ఉపయోగించండి.
This story is from the June 2024 edition of Grihshobha - Telugu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Grihshobha - Telugu
Grihshobha - Telugu
కొత్త పని కొత్త పాత్ర
కంగనా సుప్రసిద్ధ నటిగా పేరొందిన తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికే ఆమె సమయం సరిపోతోంది.
1 min
October 2025
Grihshobha - Telugu
100 వ సినిమా
ఎప్పుడూ హుషారుగా ఆనందంగా ఉండే అక్కినేని నాగార్జున 'కుబేర', 'కూలీ' సినిమాలు చేసి శెహభాష్ అనిపించుకున్నారు.
1 min
October 2025
Grihshobha - Telugu
కనిపించడం అవసరం
జాక్వెలినికి ప్రధాన పాత్రలు లభించడం దాదాపు ఆగిపోయింది.
1 min
October 2025
Grihshobha - Telugu
హాట్ అండ్ బోల్డ్
రాగిణి ఎం ఎం ఎస్ 2 సినిమాలో సన్నీ లియోన్ చేసిన పాత్రలో ఎలా రెచ్చిపోయారో తెలుసు కదా!
1 min
October 2025
Grihshobha - Telugu
కొత్త అనుభవంతో నటిస్తాను- అనుష్క శెట్టి
అనుష్క నటించిన తాజా సినిమా 'ఘాటి' ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
2 mins
October 2025
Grihshobha - Telugu
హుందాతనంతో 'స్టయిలిష్' లుక్!
హుందాతనంతో 'స్టయిలిష్' లుక్!
1 min
October 2025
Grihshobha - Telugu
మన సమయం వస్తుంది.
సునీల్ శెట్టి కుమారుడు అహాన్ తన మొదటి చిత్రం 'తడప్' తోనే 'ఉత్తమ పురుష నటుడు' అవార్డును గెలుచుకున్నాడు.
1 min
October 2025
Grihshobha - Telugu
బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ అంటే ఏమిటి?
క్రీమ్ల మధ్య తేడా, వాటిని ఎలా ఉపయోగించాలో బ్యూటీ నిపుణుల నుండి తెలుసుకోండి.
2 mins
October 2025
Grihshobha - Telugu
ఆన్లైన్ షాపింగ్ మోజు ?
ఇటీవల కాలంలో పెరుగు తున్న ఆన్లైన్ షాపింగ్లో మీరు మోస పోకుండా ఉండాలంటే ఎలా? మీరు తెలివిగా షాపింగ్ చేయాలంటే? ఇది మీ కోసమే.....
2 mins
October 2025
Grihshobha - Telugu
దీపావళి స్వీట్లు
దీపావళి స్వీట్లు
1 min
October 2025
Listen
Translate
Change font size
