CATEGORIES
Categorías
రాష్ట్రంలో 20 శాతం మందికి కరోనా టెస్టులు
గడిచిన తొమ్మిది మాసాలుగా కరోనా నిర్ధారణ, నియంత్రణ, చికిత్సల విషయంలో దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మరో మైలు రాయిని అధిగమించింది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 20 శాతం జనాభాకు పైగా కరోనా టెస్టులు పూర్తి చేసింది.
రైతుల ఆదాయం పెంచడానికే!
అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది • సాగు చట్టాలతో చిన్న, సన్నకారు రైతులకు గరిష్ట ప్రయోజనం • పట్టణాల కంటే గ్రామాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి • పెట్టుబడిదారులకు గ్రామీణ ప్రాంతాలు మంచి ఎంపిక అని ప్రధాని సూచన
టైమ్ వారిదే..
'పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా బైడెన్, కమల
జనవరి 15 తర్వాత సెకండ్ వేవ్!
బ్రిటన్, రష్యాలతో పాటు ఢిల్లీ, పలు రాష్ట్రాల పరిస్థితుల దృష్ట్యా అంచనా • ప్రతి 15 రోజులకూ టీచర్లకు, అంగన్వాడీ వర్కర్లకు టెస్టులు • జనవరికి తిరిగి బెడ్లు, వెంటిలేటర్లు, ఐసీయూలు సిద్ధం చేయాలి • హైరిస్క్ ఉన్న వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు
చందమామపైకి రాజాచారి!
నాసా మూన్ మిషన్‌లో ఇండో అమెరికన్‌కి చోటు
రైతుల ఆదాయం రెట్టింపు
కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు మరింత ముందుకు రావాలి. వారికి క్రాప్ కల్టివేటెడ్ రైట్ కార్డ్స్ (సీసీఆర్సీ) కూడా ఇచ్చాం కాబట్టి రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపాలి.
ఏదీ తేలిగ్గా తీసుకోవద్దు
ఏలూరులో పలువురు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలపై ఏ అంశాన్ని కొట్టి పారేయవద్దని, నిపుణులు సూచించిన ప్రతి కోణంలోనూ మరింత లోతుగా పరిశీలన, పరిశోధన జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
చలి మంటలు
రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు డౌన్ బారెడు పొద్దెక్కినా పొగమంచే కొండప్రాంతాల్లోని ప్రజలను వణికిస్తున్న చలి కోస్తాకు భిన్నంగా రాయలసీమ వాతావరణం
ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత చికిత్స
గత సర్కారు నిర్లక్ష్యం వల్ల పరిష్కారం కాని సమస్య వైఎస్ జగన్ సీఎం కాగానే రూ.700 కోట్లతో రక్షిత మంచినీటి పథకం హిరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీటి వినియోగం మెళియాపుట్టి వద్ద నీటి శుద్ధికి ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు
ఇక మహా పోరాటమే
నేడు ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి దిగ్బంధం • రేపు సింఘు సరిహద్దు వద్ద నిరాహార దీక్షలు • కలెక్టరేట్ల ఎదుట రైతుల ధర్నాలు • సమస్యలపై ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమే: రైతాంగం
' సుప్రీం'కు అన్నదాతలు
కొత్త సాగు చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ బీకేయూ పిటిషన్ నెలాఖరుకు విచారణకువచ్చే అవకాశం 700 జిల్లాల్లో ప్రచారం.. 100 ప్రెస్ మీట్లు..
పేలిన స్పేస్ఎక్స్ స్టార్లిప్
టెక్సాస్‌లోని బోకా చికా రాకెట్ కేంద్రం నుంచి విజయవంతంగా లాంచైన అనంతరం 6 నిమిషాల 42 సెకండ్లు పయనించి స్ట్రాటోస్పియరు చేరింది, అనంతరం క్రమంగా దిగువకు వస్తూ లాంచింగ్ ప్యాడను తాకిన వెంటనే పేలి పోయింది.
రైతన్నలూ.. చర్చలకు రండి
ఘాజీపూర్ వద్ద పోలీసులకు టీ అందజేస్తున్న రైతు
పండగ తర్వాత ప్రారంభం
కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు' (1996) ఓ సంచలనం. 24 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ఆరంభిం చారు కమల్ శంకర్. గతేడాది మూడు షెడ్యూల్స్ కూడా ముగించారు. కానీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది.
ఆత్మ నిర్భర్ భారతం ఆవిష్కారం
భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం, దేశ ప్రజల ఆత్మ, భారత్ లో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని మొదట్లో చాలామంది భావించారు, కానీ అది తప్పని ప్రస్తుత తరం గర్వంగా చెప్పుకోవచ్చు.ప్రజాస్వామ్యంలో ఒక జీవన క్షమానుగత వ్యవస్థ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ
అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు
జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు గొంగడి కప్పి తాటి ఆకుల గొడుగు, మేక పిల్లను బహుకరించిన లబ్ధిదారులు
అలర్జీ ఉంటే వ్యాక్సిన్ వద్దు
బ్రిటన్‌లో ఫైజర్ టీకా వాడిన ఇద్దరికి అస్వస్థత
ఆపన్నుల కోసం ఆస్తుల తాకట్టు
మరోమారు పెద్ద మనసు చాటుకున్న సోనూసూద్
కొత్త పార్లమెంట్‌కు పునాదిరాయి
సలాం నేడు భూమి పూజ చేయనున్న మోదీ
వ్యాక్సిన్‌పై బైడెన్ ప్రకటన....
100రోజులు.. 10కోట్లు
సీన్ తొలగించాల్సిందే
భారత వైమానిక దళం డిమాండ్
‘పాలబుగ్గల' పార్థివ్ రిటైర్
ఆరేళ్ల వయసులోనే తలుపు సందులో ఇరుక్కుపోవడంతో ఎడమచేతి చిటికెన వేలు కోల్పోయిన పార్థివ్... తొమ్మిది వేళ్లతోనే వికెట్ కీపర్‌గా రాణించడం చెప్పుకోదగ్గ అంశం
బ్రిటన్‌లో ఫైజర్ టీకా మొదలు
యూకే తన తన చరిత్రలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్, బయోఎస్టాక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సినను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించింది. 90 ఏళ్ల వయసున్న వృద్ధురాలు మార్గరెట్ కీనన్ టీకా తీసుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు.
హోరెత్తిన 'జై కిసాన్'
భారత్ బంద్ విజయవంతం నేడు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు! దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న రైతు మద్దతుదారులు 25 రాష్ట్రాల్లో ప్రభావం చూపిందన్న రైతు సంఘాలు అవసరమైతే రామ్‌లీలా మైదానానికి వెళ్తామని స్పష్టికరణ
పరిశీలనలో 3 వ్యాక్సిన్లు
కరోనా వ్యాక్సిన్లకు అనుమతిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి 3 వ్యాక్సిన్లకు లైసెన్సులిచ్చే అంశాన్ని ఔషధ నియంత్రణ విభాగం పరిశీలిస్తోందని తెలిపింది. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, ఫైజర్ అభివృద్ధి చేస్తున్న టీకాలకు లేదా కొన్నిటికి కొన్ని వారాల్లోనే లైసెన్సు ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
చివరిది చేజారింది
భారత్–ఆ్రస్టేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు సమంగా ముగిశాయి. తొలి రెండు వన్డేలు గెలిచిన తర్వాత చివరి మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను 2–1తో ఆ్రస్టేలియా గెలుచుకోగా... ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో టి20 సిరీస్ సాధించిన అనంతరం ఆఖరి మ్యాచ్‌లో ఓడి భారత్ 2–1తో ముగించింది. ఆరు మ్యాచ్‌ల ‘వైట్ బాల్’ సమరంలో రెండు జట్లూ సమఉజ్జీలుగా నిలిచాయి. వేడ్, మ్యాక్స్‌వెల్ అర్ధసెంచరీలకు తోడు స్పిన్నర్ల పొదుపైన ప్రదర్శన ఆ్రస్టేలియాను మూడో టి20లో గెలిపించగా... కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లు విఫలం కావడం భారత్‌ను విజయానికి దూరం చేసింది.
కోలుకున్న ఏలూరు
రక్తంలో లెడ్, నికెల్ ఆనవాళ్లు నీటి నమూనాల్లో మోతాదుకు మించి పెస్టిసైడ్స్ అవశేషాలు ఢిల్లీ ఎయిమ్స్ మరికొన్ని టెస్టులు నేటి సాయంత్రానికి నివేదికలు ఆ ఫలితాల ఆధారంగానే వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలు
ఎవరెస్టు ఎత్తు పెరిగింది
ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్టు ఎత్తు 8,848.86 మీటర్లని నేపాల్ అధికారికంగా ప్రకటిం చింది. 1954లో ప్రకటించిన ఎత్తు 8,848 మీటర్ల కన్నా ఇది 86 సెంటీమీటర్లు అధికం. 2015లో వచ్చిన భూకంపానంతరం శిఖరం ఎత్తు మారి ఉం టుందన్న అనుమానాలున్నా అవేమీ కాదని తేలింది.
నేడు భారత్ బంద్
వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ రైతుల పిలుపు
రహదార్ల విస్తరణలో ఎన్జీవోల భాగస్వామ్యం
వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా భూసేకరణ, పునరావాస కార్యాచరణ ప్రణాళికకు సాయం