• రాజీవ్ గాంధీ 79 జయంతి కార్యక్రమం..
• నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ రేవంత్, తదితరులు..
• సోమాజీగూడా రాజీవ్ విగ్రహానికి పూలమాలలు..
• గ్రామ పంచాయితీలను బలోపేతం చేసిన రాజీవ్..
• 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనది..
• మహిళకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ..
• పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు..
• కొనియాడిన కాంగ్రెస్ నాయకులు..
హైదరాబాద్, 20 ఆగస్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీ.హనుమంత రావు, రెడ్డి తదితరులు సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకివే తమ నివాళు లన్నారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ
దేనన్నారు. గ్రామ పంచాయితీలను బలోపేతం చేశారని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని, సాంకేతిక విప్లవం కూడా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీయేనని కొనియాడారు. ఆనాడు రాజీవ్ చేసిన కృషితోనే ఐటీ ఇంత అభివృద్ధి చెందిందన్నారు. టెలికాం రంగంలో మార్పులు తెచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారని, పేదల కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబమని రేవంత్ వ్యాఖ్యానించారు.
దేశంలో విభజించు పాలించు విధానాన్ని బీజేపీ అవలంబిస్తోందని, మణిపూర్ మండిపోతున్నా, ప్రధాని మణిపూర్ కు భరోసా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాణానికి బొమ్మా, బొరుసులాంటివని.. వారిద్దరిది ఫెవికాల్ బంధమని అన్నారు. దేశ సంపదను ప్రధాని మోదీ తన మిత్రులకు దోచి పెడుతుంటే... ఇక్కడ సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు.
Esta historia es de la edición 21-08-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 21-08-2023 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు