CATEGORIES
రివర్స్ గేర్!
కేసీఆర్ ఫ్రంట్ రాజకీయానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కొత్త కూటమి ఏర్పాటుపై ఆదివారం ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సీఎం చర్చించారు. బీజేపీ పై పోరాడుతున్న సీఎం కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది నిజమే.!
మల్లన్నకు జలకళ
గోదావరి జలాలతో మల్లన్న సాగర్ తొణికిసలాడుతున్నది. 15 లక్షల ఎకరాలకు సాగునీటి తోపాటు జంటనగరాల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన ఈ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేయనున్నారు.కాళేశ్వరం పరిధిలో అతి పెద్ద జలాశయంగా పేరొందిన మల్లన్న సాగర్ ను సిద్ధిపేట జిల్లా కొండపాక, తొగుట మండలాల పరిధిలో సముద్ర మట్టానికి 557 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ జలాశయం సామర్థ్యం 50 టీఎంసీలు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
పిల్లి లొల్లి!
ఈ పిల్లిమాది.. మీరు ఎత్తుకొచ్చారు. ఇచ్చేయండి.. ఇస్తారా లేదా అంటూ మొదలైనలొల్లి పోలీసు స్టేషన్ దాకా వెళ్లింది..మైసూరు నుంచి తెచ్చుకు న్నామని ఒకరంటే.. లేదు మాదేనని మరొకరు పట్టుబట్టారు. పరస్పరం దాడులకు దిగారు.కాలనీ వాసులు 100కు ఫోన్ చేయగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
చచ్చినా వదల్లే
ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారుకుటుం బీకులు.వచ్చీరాగానే రూ.2లక్షలు కట్టిం చుకున్నారు.టెస్టులు, మందులు అంటూనానాహడావుడి చేశారు.చికిత్స వివరాలు మాత్రం సీక్రెట్ గా ఉంచారు.సీన్ కట్ చేస్తే.. బాధితుడు ఆదే రోజు చనిపోయాడని తేలింది. చివరకు ఠాగూర్ సినిమాను తలదన్నేలా శవానికి వైద్యం చేశారనే విషయంరట్టయింది.
యాదాద్రి పై జీయర్ ఎఫెక్ట్
యాదాద్రి పున: ప్రారంభం సందర్భంగా మహా సుదర్శనయాగాన్ని వాయిదా వేస్తున్నట్టు యాడా ప్రకటించింది. ఆలయ శంకుస్థాపన మొదలు ఇప్పటి వరకు మార్గదర్శనం చేసిన చిన దిశ 5 జీయర్ కు, సీఎం కేసీఆర్ కు మధ్య విభేదాలు తలెత్తడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది.
డబుల్ ట్రబుల్స్!
ఒకటే భూమి.. పాతికేళ్లలో చాలా మార్పులు జరిగాయి.. వేర్వేరు పేర్లతో రెండు సార్లు లే అవుట్లు చేశారు. ఒకే ప్లాట్ ను ఇద్దరికి అమ్మారు. డబుల్ రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి.ఆఖరికి ఎఆర్ఎస్ కూడా డబులే. దీనిపై రెవెన్యూ నోరెత్తదు.. రిజిస్ట్రేషన్ల శాఖ పట్టించుకోదు. బాధితులు ఫిర్యాదు చేసినా అంతే.. వీటిని కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి వారు తీవ్రంగా నష్టపోతున్నారు.న్యాయం చేయాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదు. మేడ్చల్ జిల్లా పోచారంలో సూర్యనగర్ అలియాస్ సింగపూర్ గా పిలుస్తున్న వెంచర్‌లోని భూ మాయాజాలం ఇది. మరో రెండు చోట్ల కూడా ఇలాంటి అక్రమాలే చోటుచేసు కుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
కలెక్షన్ కింగ్స్!
దిశ, తెలంగాణ బ్యూరో నగర రోడ్లపై ట్రాఫికను నియంత్రించాల్సిన పోలీసులు ఆ పనికి మంగళం పాడారు. ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో చేతిలో కెమెరాలు పట్టుకొని ఫొటోగ్రాఫర్ల అవతారమెత్తారు. పోలీసు బాస్టు ఆదేశించడంతో 'ఎస్ బాస్..” అంటూ రోడ్డెక్కుతు న్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడున్నరేళ్లలో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకంగా రూ. 1,440 కోట్లను చలాన్ల రూపంలో వసూలు చేసిపెట్టారు.
ఏరియర్స్ నెలకు కొంత!
ఉద్యోగుల ఏరియర్స్ ను 18 నెలల పాటు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని విడుదల చేయనున్నట్టు తెలిపింది.
ఈ నెల 26 లేదా మార్చి 3!
తెలంగాణ ప్రభుత్వం 202223 బడ్జెట్ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వ హించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఈ నెల 26న లేదా మార్చి 3 నుంచిబడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
విద్యతోనే.. సమసమాజ స్థాపన
మంత్రి బొత్స సత్యనారాయణ
సచివాలయంకు రావాల్సిందే
అధికారులకు సీఎస్ ఆదేశాలు
“యూత్ ఫర్ యాంటీ కరప్షన్'ను విస్తరిస్తాం
ఫౌండర్ పల్నాటి రాజేంద్ర
రోగాల బారిన పడేలా ఉన్నం
పంచాయతీ సెక్ర టరీలపై పని భారం పెరిగిందని, తగ్గించ కుంటే రోగాల బారిన పడే అవకాశం ఉన్నదని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసి యేషన్ (టీ) ప్రెసిడెంట్ చిలగాని సంపత్ కుమార్ అన్నారు.
నేడు కడప, విశాఖలో సీఎం పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం వైఎస్ఆర్ కడప, విశాఖ పట్నం జిల్లాలో పర్యటించ నున్నారు. నేడు ఉదయం 9.30గంటలకు ఇంటి నుంచి బయలు దేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకొని అక్కడ నుంచి విమానంలో కడప విమానాశ్రయానికి చేరు కుంటారు.
నేడు విశాఖకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం విశాఖకు రానున్నారు. ఈ నెల 21న నగరంలో జరిగే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో ఆయన పాల్గొంటారు. ఆయన పర్యటనకు జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున్, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఏర్పాట్లు పూర్తి చేశారు.
మూసీ డేంజర్!
పరిశ్రమ వ్యర్థాలతో పాటు మురుగు కూడా మూసీలో కలుస్తుండ టంతో నీరంతా కలుషితం అవుతోంది. నీరు పారే వ్యవసాయ క్షేత్రాల్లో సారం దెబ్బతిని పంటలు పండే పరిస్థితి లేదు. వ్యర్థాలను అరి కట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండ టంతో నానాటికి నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గి పోతోంది.
చూడకుండానే రిజెక్ట్!
ప్రభుత్వ ఆఫీసుల్లో చిన్న చిన్న అధికారుల వద్ద పని జరగకపోతే కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టు కుంటారు బాధితులు.
ట్రిపుల్ ఆర్ కు 9,164
రీజనల్ రింగ్ రోడ్డు మొదటి దశ నిర్మాణానికి అలైన్మెంట్ ఫైనల్ అయినట్టు తెలుస్తున్నది.
కృష్ణా..ఇదేం మాయ!
దిశ ప్రతినిధి, ఖమ్మం: మొదట విలువైన వస్తువులను తక్కువ ధరకే ఇచ్చాడు.
ఏరియర్స్ ఎప్పుడిస్తారు?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏరియర్స్ చెల్లింపుపై సస్పెన్స్ వీడటం లేదు.
ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ పై మంగళ హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇన్ చార్జి డీజీపీగా అంజనీకుమార్
డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు రెండువారాల పాటు మెడికల్ లీవు తీసుకు న్నారు.
4 యేండ్లల్లో 371కోటకు నామం
గ్రానైట్ అక్రమదందా... మంత్రి గంగుల కుటుంబం మెడకు చుట్టుకుంటున్నది.
'ఇండిగో' కో ఫౌండర్ రిజైన్
వాటానూ తగ్గించుకుంటానన్న రాకేశ్ గంగ్వాల్
సెల్ ఫోన్ డ్రైవింగ్ నేరం కాదు
డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటాన్ని ఇకపై నేరంగా పరిగణించబోమని కేంద్రం వెల్లడించింది.
నేడు హైదరాబాదు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
ముచ్చింతల్ లోని రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు రానున్నారు. ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, , గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో పాటు పలువురు మంత్రులు ఘన స్వాగతం పలకనున్నారు.
బిల్లుల్లో గోల్మాల్!
కొవిడ్ మాటున ఆర్ బీఎస్ కే (రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం)లో గోల్ మాల్ జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది.వాహనాలు తిరగకుండానే బిల్లులు ఇచ్చినట్లు ఆ విభాగంలోని కొందరు సర్కారు కంప్లీట్ చేశారు.
అడ్డగోలుగా అడ్డుగోడలు!
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో రెండు చెరు వులను కలుపుతూ ఓ కాల్వ ప్రవహి స్తున్నది.
317 జీవో రద్దు చేయాలి
317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూధర్నాచౌక్ వద్ద టీచర్లు శనివారం ఆందోళన చేపట్టారు.ఈ క్రమంలో పోలీసులు, టీచర్ల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తపరి స్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు టీచర్లను అరెస్టు చేశారు.
హైదరాబాద్ టు ముం బై
హైదరాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ ట్రైన్లు నడపాలని రైల్వేశాఖ భావిస్తున్నది. ఈ ఏడాది ఏడుమార్గాల్లో ఇలాంటి రైళ్లు ప్రారంభించనుంది. హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ అమృత్ సర్, ఢిల్లీ-అహ్మదాబాద్, ముంబై-నాగపూర్, చెన్నయ్ -బెంగ ళూరు-మైసూర్, వారణాసి-హౌరా మార్గాలు సైతం ఉన్నాయి. ఇందుకు అవ సరమైన సర్వే, డీపీఆర్ పై దృష్టి పెట్టినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.