CATEGORIES
నేడు, రేపుభారీవర్షాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి.
పాజిటివ్ దృక్పథంతోనే..పాజిటివ్‌ను జయించా!
ఆమె.. సీనియర్ పోలీస్ ఆఫీసర్ కావచ్చు. క్రైసిస్ మేనేజ్మెంట్ మీద పట్టు సాధించి ఉండవచ్చు.
అదే నా కోరిక!
కథానాయికలు చాలా మంది కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలతో మెప్పించేందుకు ప్రయత్నిస్తారు.
సీబీఎస్ఈ సిలబస్ కుదింపు
కరోనా నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది.
మన ప్రగతికి వైభవ ప్రతీక
ఇంటి ముంగిట వాకిలి చూస్తే ఇల్లెట్లుందో చెప్పొచ్చు అని సామెత! వలస పాలనలో తెలంగాణ దుస్థితి ఏమిటో చెప్పడానికి.. పాత సచివాలయ భవనాలను చూపిస్తే చాలు! ఈ మరకలను చెరిపేసి, ప్రజలకు, ఉద్యోగులకు మరింత సౌకర్యం కలిగించి, ప్రపంచానికి తెలంగాణ మోతెబరి చూపించేందుకు సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. సరికొత్త సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ట్రంప్ నుంచి మరో పిడుగు
ఇప్పటికే హెచ్1బీ వంటి ఉద్యోగ వీసాలపై నిషేధం విధించిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది.
మన మిట్టపల్లి.. మన పప్పులు!
వాళ్లంతా.. ఏ కూలీ పనికో వెళ్లి వందో.. రెండొందలో పంచుకునేటోళ్లు. కానీ.. ఎంతకాలం అలా?
‘దిల్ బేచారా' ప్రపంచ రికార్డు
దివంగత హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’ ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
భూత్ బంగ్లా
ఏ గదిలో అడుగుపెడితే ఏమైతదో తెలువదు. ఎక్కడి నుంచి ఎలుకలు వస్తాయో.. గబ్బిలాలు మీదపడతాయో అర్థంకాదు. ఏ మూలచూసినా పెచ్చులు ఊడిపోయి.. ఎప్పుడు కూలుతదో అన్నట్టుంటది. ఫైళ్లకు చోటుండదు.. గాలి రాదు.. గబ్బు పోదు.. గోడలెంబడి వేలాడే కరెంటు తీగలు ఎక్కడ షాక్కొడ్తయో అన్న ఆందోళన.. బ్లాకులకొద్దీ బంగ్లాలుంటయి.. ఏ ఒక్క బ్లాకూ సక్కంగుండదు.
ఆరుగజాల పూదోట.. నారాయణపేట చేనేత
రంగుల హంగులన్నీ ఆ చీరలోనే ఉంటాయి. కళాసృజన మొత్తం ఆ నేతలోనే కనిపిస్తుంది. ఏ మగువ అయినా.. పెండ్లిలోనో, పేరంటంలోనో నలుగురూ మెచ్చాలన్న ఆశతో కొత్తచీరలో ముస్తాబు అవుతుంది. నారాయణపేటచీరల్ని మాత్రం.. తనకోసమే తాను కట్టుకుంటుంది. ఆ కట్టుబడిలోని మహత్తు కావచ్చు. ఒంటికి చుట్టుకోగానే, మనసుకు హాయిగా అనిపిస్తుంది. తనువు సేదతీరిన భావన కలుగుతుంది.
కరోనాకు..అంతమెప్పుడు?
లోకమంతా అల్లకల్లోలం చేసిన విశ్వమారికి అంతమెప్పుడు? కరోనా విశృంఖలత్వం ఇంకెంతకాలం?
ఇక అంతా ఈ-ఆఫీస్
కరోనా వైరస్ అన్ని శాఖలకు పాకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రక్షణ చర్యలకు ఉపక్రమించింది. కార్యాలయాల్లో సులభతర పాలనకు శ్రీకారం చుట్టింది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎలాంటి ఫైల్ అయినా డిజిటల్ పద్ధతిలోనే తయారయ్యేలా ప్రణాళిక రూపొందించింది. ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి అన్ని ఫైళ్లను డిజిటల్ రూపంలోనే రూపొందించేలా ఆదేశాలిచ్చింది. వచ్చే సోమవారం నుంచి ఈ- ఆఫీస్ విధానం అమల్లోకి రానున్నది.
ప్రవాసీయులకు కువైట్ కోత!
న్యూఢిల్లీ: కువైట్‌లో ఉన్న విదేశీయుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు తీసుకువచ్చిన ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు ఆ దేశ జాతీయ శాసనసభ కమిటీ ఆమోదం తెలిపింది.
మోకాళ్ల నొప్పి..మాయం!
‘అక్కా.. గుడ్ న్యూస్'‘ఏంట్రా తమ్ముడూ..’ నిర్లిప్తంగా అంది నలభయ్యేండ్ల అనసూయ. మోకాలి నొప్పితో ఏ పని మీదా ధ్యాస పెట్టలేకపోతున్నది. హాస్పిటల్‌కి వెళ్తే కార్టిలేజ్ అరిగిపోయిందని చెప్పారు. మోకాలి మార్పిడి చేయాలన్నారు. ఆపరేషన్‌కి భయపడి ఇంటికి వచ్చేసింది. ‘నీ నొప్పి తగ్గే మార్గం దొరికిందక్కా... అదీ ఆపరేషన్ లేకుండానే. కొత్త ట్రీట్మెంట్ వచ్చిందట. మనమూ ఒకసారి వెళ్దాం’ ధైర్యం చెప్పాడు.అక్కడికి వెళ్లాక తెలిసింది.. కార్టిలేజ్ వల్ల కాకుండా సమస్య మరో దగ్గర ఉందని, బర్సా అనే భాగం బలహీనపడిందని. వెంటనే చికిత్స మొదలుపెట్టారు. త్వరలోనే ఫలితం కనిపించింది.
ఆమెతో కలిసి..‘ఆ నలుగురు'!
శవం అంటేనే భయపడే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు ‘మానవ సేవే మాధవ సేవ’ సమితి సభ్యులు. ‘ఆ నలుగురూ’ లేనివారికి మేమున్నామంటూ సొంత డబ్బుతో అంత్యక్రియలు చేస్తున్నారు. ఆ బృందంలో చౌహాన్ శశికళ అనే మహిళ కూడా ఉన్నారు.
సోషల్‌మీడియాలో స్వదేశీ ఎలిమెంట్స్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వాట్సాప్ మాదిరిగా చాటింగ్, వీడియోలు, డాక్యుమెంట్లు పంపుకోవడం..
సిరులబాటలో గిరిపుత్రులు
అడవిలో స్వచ్ఛమైన తేనె దొరికేది కానీ. అమ్ముకునేందుకు సదుపాయాల్లేవు.. అటవీ ఉత్పత్తులు పుష్కలంగా లభించేవి.. కానీ అవి ఎక్కువ మందికి చేర్చే ప్రయత్నం జరుగలేదు.. ఫలితంగా అడవిబిడ్డల చేతుల్లోకి పైసలు రాలేదు. ఇదంతా గతం.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విధానాలతో గిరిజనుల బతుకులు మారిపోయాయి. అటవీ ఉత్పత్తులు బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. గిరిబిడ్డల చేతుల్లోకి పైసలొచ్చాయి. ఆరేండ్లలోనే జీసీసీ ద్వారా రూ.వెయ్యికోట్ల విలువైన అటవీ ఉత్పత్తులు విక్రయాలు జరిగి గిరిజనులు సిరుల బాటలో పరుగులు పెడుతున్నారు.
నేటి నుంచి..టిమ్స్ సేవలు
కరోనా కేసుల విషయంలో ప్రైవేట్ దవాఖానలు లాభాపేక్ష లేకుండా సేవాభావంతో వ్యవహరించాలి. ప్రైవేట్ ల్యాబొరేటరీలు నిక్కచ్చిగా పరీక్షలు నిర్వహించాలి. కరోనా రోగులకు బెడ్లు కేటాయించని దవాఖానలపై చర్యలు కూడా తీసుకుంటాం.
మూసివేత దిశగా స్టార్టప్స్
స్టార్టప్‌లనూ కరోనా వైరస్ తాకిడి తగిలింది.. కరోనా పరిస్థితుల్లో వందలాది సార్టప్‌లు మూతపడేస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే 12శాతం మూతపడగా.. కేంద్రం పట్టించుకోకపోతే దాదాపు 70 శాతం ఉనికి ప్రశ్నార్థకంగా మారవచ్చనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఆన్లైన్..అమ్మల సంఘం!
ఇరవై సంవత్సరాలకి, ఇప్పటికి పోలికే లేదు. మధ్యాహ్నం పన్నెండుకల్లా పనులు ముగించుకొని అమ్మలక్కలు ఆరుబయట అరుగుల మీద చేరి పనులు పంచుకొనేవారు, ఆలోచనలూ పంచుకొనేవారు. అవి కాలక్షేపం కబుర్లు మాత్రమే కాదు.. కష్టసుఖాల కలబోత, అనుభవాల ఆరబోత, పెద్ద ఇల్లాలి నుంచి కొత్త కోడలికి దొరికే మార్గదర్శనం. ఇప్పుడు అరుగుల్లేవు, అమ్మలక్కల కబుర్లూ లేవు. ఇక, మార్గదర్శనానికి అవకాశం ఎక్కడుంది? ఆ లోటును పూడ్చడానికి పుట్టిందే ఆన్లైన్ అమ్మల సంఘం.
2021 దాకా వ్యాక్సిన్ రాదు
న్యూఢిల్లీ: కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్ సిద్ధమయ్యే అవకాశంలేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
పాఠాలు అర్థమైతలేవు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో పాఠశాలలను తెరిచే పరిస్థితి లేకపోవడంతో కొన్ని స్కూళ్లు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నాయి. ఆన్లైన్ పాఠాలపై టీఎస్‌యూటీఎఫ్ సర్వే నిర్వహించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే ఫలితాలను శుక్రవారం విడుదలచేశారు.
జబ్బులున్నా.. జయించారు
దీర్ఘకాలిక రోగులకు కరోనా యమపాశం.. వారికి వైరస్ సోకితే ప్రాణాలు పోతాయనే భయం చాలామందిలో ఉన్నది. అయితే సరైన జాగ్రత్తలు పాటిస్తూ, వైద్యుల సూచనలు అనుసరిస్తే వైరస్‌ను జయించవచ్చని రాష్ట్రంలో రుజువైంది. షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వంటి దీర్ఘకాలిక రోగాలున్నవారు సైతం రాష్ట్రంలో కరోనా బారినుంచి బయటపడుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి వ్యాధులున్నవారు 2,500 మందికిపైగా వైరస్ బారినపడగా, 90 శాతం మంది కోలుకున్నారు. 203 మంది మరణించారు.
దూదిపూల సాగుబాట
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు నియంత్రిత సాగు విధానాలను అనుసరించాలన్న ప్రభుత్వ పిలుపునకు రాష్ట్ర రైతులు సానుకూలంగా స్పందించారు.
టాలీవుడ్లో..బంధుప్రీతి తక్కువే!
లావణ్య త్రిపాఠి...పేరులోనే కాదు, వ్యక్తిత్వంలోనూ లావణ్యం ఉన్న నాయిక. వెండితెరపై సౌందర్యం, సహృదయం కలబోసిన పాత్రల్లో కనిపించే ఈ సొగసరి నిజజీవితంలో స్నేహశీలిగా, సాటివారికి సాయపడే మంచి మనిషిగా అందరి అభిమానాన్నీ చూరగొంటున్నది. ‘అందాల రాక్షసి’తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన లావణ్య వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. నంబర్‌వన్ హోదా గురించి ఆలోచించననీ, స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే కలలు తనకెప్పుడూ లేవనీ అంటున్నది. తన గురించీ, తన సినిమాల గురించీ లావణ్య త్రిపాఠి ‘జిందగీ’తో మనసు విప్పి మాట్లాడింది...
పార్సిల్.. కొరియర్.. కార్గో సరుకు రవాణా ఏదైనా.. ఆర్టీసీ రెడీ
పార్సిల్.. కొరియర్.. కార్గో సరుకు రవాణా ఏదైనా.. ఆర్టీసీ రెడీ
ఊరే.. ఆశాదీపం
పంటల కొనుగోళ్లు, ప్రభుత్వ పథకాల రూపంలో గత నాలుగైదు నెలల్లో పల్లెల్లోకి దాదాపు 62 వేల కోట్ల రూపాయలు నగదు ప్రవహించింది.
పంద్రాగస్టుకు టీకా!
తయారీకి గడువు నిర్దేశించిన ఐసీఎంఆర్
భారత్ బయటే ఐపీఎల్!
దేశంలో కరోనా వైరస్ విజృంభణ నానాటికీ పెరుగుతుండడంతో ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ నిర్వహణపై సందిగ్ధత అధికమవుతున్నది.
పనికిరాని ఆవేశం..పసి పాపను చంపేసింది
అసలేం జరుగుతున్నదో తెలియదు.. అమ్మతో గొడవ పడుతున్నదెవరో ఎరుగదు.. తెలియని ఆందోళనతో.. చూస్తుండగానే ఐదేండ్ల చిన్నారి గొంతులోకి కత్తి దిగింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోయింది. తల్లి ఫేస్బుక్ పరిచయాలకు అభంశుభం తెలియని పసిపాప బలైపోయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకొన్న ఘోరమిది. ఫేస్బుక్లో తల్లికి ఇద్దరితో ఉన్న పరిచయం చిన్నారికి ప్రాణాంతకంగా మారింది. ఆమె ఒకరితో చనువుగా ఉంటున్నదని తెలుసుకొన్న మరొకరు పనికిరాని ఆవేశంతో ఏకంగా కత్తితో ఇంటికి వచ్చి అమానుషానికి పాల్పడ్డాడు. చిన్నారిని హతమార్చి.. తల్లిని గాయపరిచి, ఆమెతో ఉన్న మరొకరిపైనా దాడిచేసి.. చివరకు తనకు తానుగా మెడను కోసుకున్నాడు.