• రైతులకు, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది
• అప్పుల రాష్ట్రాన్ని గత పాలకులు మాకు అప్పగించారు..
• తెలంగాణ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ..
• నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లించే దుస్థితిలో మనం ఉన్నాం
• నేటి మాజీలు, అప్పటి అధికారులు ఈ విషయం ప్రస్తావించలేదు
• భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేశాం
• డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్న సీఎం
ఇప్పటివరకు 25.35 లక్షలమంది రైతుల ఖాతాల్లో.. రూ.21వేల కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ రైతులను మోసం చేసింది. రైతు భరోసాను కొనసాగిస్తాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు వేస్తాం. మారీచుల మాయ మాటలు రైతులు నమ్మొద్దు.
- సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ 01 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్ ): రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని.. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ముఖ్య మంత్రి పేర్కొన్నారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదన్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని.. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. డిసెంబర్ రెండవ వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలో రైతు పండుగ జరిగిందని.. రైతులు ప్రభుత్వా నికి గొప్ప శక్తి అని అన్నారు . వారి ఆశీర్వాదంతో ఇంధనం వచ్చిందని భావిస్తామన్నారు. ఏ జిల్లా అయితే నిండు మనస్సుతో ఆశీర్వదించిందో భవిష్యత్లో కూడా అలానే కొనసాగుతోందన్నారు.
అప్పుల రాష్ట్రాన్ని కేసీఆర్ మాకు అప్పగించారు:
జూన్ 2, 2014 నాటికి 16 వేల కోట్ల మిగులు, 69 వేల కోట్ల అప్పులతో కేసీఆర్కు యూపీఏ ప్రభుత్వం అప్పగించిం దన్నారు. ఇప్పుడు రూ. 7 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందన్నా రు. నాడు ప్రజలకు వాస్తవాలు ఎవరూ చెప్పలేదని వివరించారు .. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగితే ప్రతిదాడి చేశారన్నా రు. బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ రాష్ట్రము ఆర్థికంగా క్షీణించిందని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ నుంచి రాజశేఖర్ రెడ్డి వరకు రైతుల కోసం ఎంతో చేశారని అన్నారు.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 02-12-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 02-12-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఏడాదిలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
• కాంగ్రెస్ గ్యారంటీల గారడీ.. 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
• ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్ • ఆపరేషన్లో ఏడుగురు మావోయిస్టులు మృతి..
'మారీచుడు అడ్చొచ్చినా...రైతు భరోసా ఆగదు రైతు భరోసా
• సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు • రైతు భరోసాపై సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన..
టైగర్ల టెన్షన్..
• నాలుగు పులులు తిరుగుతున్నట్టుగా ప్రచారం • మూడ్రోజులు ఎవరూ బయటకు రావద్దంటున్న అధికారులు
దొంగలకు సద్ది కడుతున్న బడంగ్పేట్ మున్సిపల్ అధికారులు..!
ఎస్టీఎఫ్ బాస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి
భావితరాల భవిష్యత్తును చిదిమేస్తున్న దివిస్
• దివిస్ కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు.. • దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్పై ప్రజా ఉద్యమం..
‘ఫోనిక్స్' ఫిక్స్చేస్తే ఏదైనా మాయం..
చెరువులు, ప్రభుత్వ భూములు స్వాహా చెయ్యడమే వీరి స్పెషాలిటీ
ప్రతి ఎకరానికి సాగు నీరు అందాలి
• నీటిపారుదల ప్రాజెక్టులు, పౌరసరఫరాల విభాగంపై సమీక్ష నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు
దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్
• రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా హాజరు.. • వరణుడు ఆగ్రహించిన కూడా సభ సక్సెస్..
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
- రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ డాక్టర్ వెంకటేష్