CATEGORIES
Kategorien
విండీస్ దిగ్గజం వీక్స్ మృతి
వరుసగా ఐదు శతకాల రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే
గుండెపోటుతో కన్నుమూత
సుప్రసిద్ధ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్(71)గుండెపోటుతో శుక్రవారం ఉదయం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.
31 వరకు నిషేధం పొడిగింపు
అంతర్జాతీయ విమాన సర్వీసులపై డీజీసీఏ ప్రకటన
లీజుకు మారుతి కార్లు
నాలుగేండ్ల కాలపరిమితితో లభించనున్న వాహనాలు
సాహో సైనికా
శత్రువుకు మీ ఉగ్రరూపం చూపారు
నేను క్షేమం.. మీరూ జాగ్రత్త!
బుల్లితెర హీరోయిన్
ఆక్సిజన్ కొనేస్తున్నారు!
‘రానురాను కరోనా రోగుల సంఖ్య పెరిగి ఆక్సిజన్ సిలిండర్లు దొరుకుడు కష్టమట కదా? అందుకే ఒకటి రెండు సిలిండర్లు తెచ్చి ఇంట్ల పెట్టుకోవాలనుకుంటున్న’.. సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి మాటలివి.
ఏకాకిగా చైనా!
గల్వాన్ లోయలో దుశ్చర్యకు పాల్పడి 20 మంది జవాన్ల మరణానికి కారణమైన చైనాపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
24గంటల్లో కేసులు 22,771
కరోనా వైరస్ దేశమంతటా శరవేగంతో వ్యాపిస్తున్నది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
పల్లెకు పోదాం..నాగలి కడదాం
పల్లెకు పోదాం..నాగలి కడదాం
చైనా, పాక్ కుతంత్రం
న్యూఢిల్లీ: తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్థాన్.. భారత్‌ను దొంగదెబ్బ కొట్టేందుకు కలిసికట్టుగా కుతంత్రం పన్నుతున్నాయి. లఢక్ తూర్పు భాగంలో వాస్తవాధీన రేఖ వెంట చైనా 20వేల మంది సైనికులను మోహరించగా, అంతేమొత్తంలో లఢక్ పశ్చిమభాగంలోని గిల్గిత్ బాల్టిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యాన్ని దించింది. గత నెల 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత పాక్, చైనా అధికారుల మధ్య నిత్యం సంప్రదింపులు జరుగుతున్నాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో మారణహోమం సృష్టించేందుకు పాక్‌కు చెందిన అల్‌బదర్ ఉగ్రవాద సంస్థతో చైనా అధికారులు చర్చలు జరిపినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కుతంత్రంతో దీటుగా సమాధానం చెప్పేందుకు భారత్ కూడా సిద్ధమైంది.
పట్నం నుంచి సొంతూర్లకు..
కోదాడ రూరల్/మాడ్గులపల్లి: హైదరాబాద్‌లో ఉంటున్న ప్రజలు సొంతూరు బాటపట్టారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంతో తెలుగు రాష్ర్టాల ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. బుధవారం టోల్గేట్లు, తెలంగాణ సరిహద్దుల వద్ద వాహనాల రద్దీ ఏర్పతడింది. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద, అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిలోని మాడ్గులపల్లి టోల్గేట్ వద్ద వాహనాలుబారులు తీరుతున్నాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద అరకిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
పిల్లల నోట..పెద్ద మాట!
అపార జీవితానుభవం కలిగిన పెద్దలే కొన్ని సందర్భాల్లో మాటల కోసం తడుముకుంటారు, ఎలా చెప్పాలో తెలియక తికమకపడతారు. అసలు, మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తారు. కానీ, కొంతమంది పసివాళ్లు వయసుకు మించిన పెద్దరికాన్ని ్ర పదర్శిస్తారు. మాట్లాడకూడని మాటలూ మాట్లాడేస్తుంటారు. ఎందుకిలా?
ఆన్లైన్ తరగతులకు అనుమతి ఉందా?
విద్యాశాఖను ప్రశ్నించిన హైకోర్టు
30 రోజులు..4 లక్షలు
న్యూఢిల్లీ, జూలై 1: జూన్ నెల భారత్‌కు అత్యంత దుర్భరంగా గడిచింది. గత నెలలోనే దేశంలో ఏకంగా నాలుగు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానానికి చేరింది. అయితే మరణాల పరంగా చూస్తే, జూన్‌లో మనకంటే మెక్సికోలో ఎక్కువ మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా ఒక్క జూన్‌లోనే 4లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసులు 5.85 లక్షలు. తఅంటే మొత్తం కేసుల్లో 70 శాతానికిపైగా ఈ నెలలోనే రికార్డయ్యాయి.
దేశీ యాప్‌లకు భారీ డిమాండ్
టిక్‌టాక్, హేలో, వీగోపై నిషేధంతో..రొపోసో, చింగారీ, ట్రెల్వైపు మళ్లిన వినియోగదారులు రాత్రికి రాత్రే లక్షల సంఖ్యలో డౌన్లోడ్
హైదరాబాద్- విజయవాడ మధ్య హైస్పీడ్‌రైలు
దేశంలో హైదరాబాద్ ముఖ్యమైన మెట్రోపాలిటన్ సిటీ. విజయవాడ కీలకమైన ఆర్థిక కేంద్రం. ఈ రెండు నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు రావాలి. ఇందుకోసం నావంతు ప్రయత్నం చేస్తాను.- మంత్రి కేటీఆర్
పేదలకు 360 ఎకరాల భూమి దానం
వరంగల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పీవీ నరసింహారావు ఏది చేసినా సంచలనమే.. ఏది చేయకపోయినా సంచలనమే.. మౌనంగా ఉన్నారంటే త్వరలో ఏదో సునామీ ముంచుకొస్తుందనే అర్థం. అందులో ఒకటి భూ సంస్కరణల చట్టం. ఇంట్లో కూర్చొని ఈ చట్టానికి రూపకల్పన చేశారు. చట్టం తెచ్చేకంటే ముందు తన గ్రామంలోని భూమిలేని నిరుపేదలకు, తమ వద్ద పనిచేసే పాలేర్లకు 360 ఎకరాల భూమిని దానం చేసి భూస్వామ్య పద్ధతికి చరమగీతం పాడారు.
కరోనాతో ఆటలొద్దు
న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలో కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ మొదటి దశ సడలింపుల తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ నిబంధనలు కఠినంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలోని 80కోట్ల మంది పేదలకు వచ్చే నవంబర్ చివరి వరకు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాన్ అన్నయోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తున్నట్టు మంగళవారం దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని తెలిపారు.
‘కనిపించని' ఆకలి!
అసలే కరోనా కాలం.. ఎప్పుడు ఎటువైపు నుంచి, ఎవరి ద్వారా ఆ వైరస్ మనపై దాడి చేస్తుందో తెలియని స్థితి. ఈ పరిస్థితుల్లో పరిసరాల పరిశుభ్రతే కాదు. ఒంట్లో సత్తువ కూడా ముఖ్యమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకు పౌష్టికాహారం కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు.
కరోనా విజేతలు..డాక్టర్లకు జోతలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, హైదరాబాద్: యావత్ప్రపంచంలో కోటిమందిని పట్టుకొన్న కరోనా.. మార్చి 2 న మనరాష్ట్రంలో అడుగుమోపింది మొదలు.. దాన్ని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. దురదృష్టవశాత్తూ వైరస్ సోకి.. ప్రభుత్వ దవాఖానల్లో చేరినవారిలో వేలమంది నయమై ఇండ్లకు క్షేమంగా వెళ్లిపోయారు. వారిలో ఏ ఒక్కరిని కదిలించినా సర్కారు వైద్యులకు.. తమకు సేవలందించిన సిబ్బందికి జోతలుపెడుతున్నారు. వైద్యులు తమను కంటికి రెప్పలా కాపాడారని కొనియాడుతున్నారు. డ్యూటీ డాక్టర్లు, నర్సులు తమను ఆప్యాయంగా పలకరించడమే కాకుండా.. ఆత్మైస్థెర్యం కోల్పోకుండా ధైర్యాన్ని అందించారని తమ అనుభవాలను పంచుకొంటున్నారు. వాస్తవానికి కరోనా వచ్చిన నాటినుంచి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యాప్తి నిరోధ చర్యలు చేపట్టింది. పలు ప్రభుత్వ వైద్యాలయాలను కరోనా దవాఖానలుగా రూపాంతరం చెందించింది.
భారీగా టెస్టులు
‘వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, ప్రభుత్వాధికారులు ఎందరికో కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ చికిత్స అనంతరం వారికి నయమైపోయింది. ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు.. లేదా కొవిడ్ ముదిరిన వారు ఎక్కడైనా ఒక్కరు చనిపోతే.. వేలమంది ప్రాణాలను కాపాడిన విషయం పక్కకు పోతున్నది. చెస్ట్ దవాఖాన హెడ్నర్స్ కొవిడ్‌తో చనిపోయారు. వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి దవాఖానల్లో చికిత్స చేస్తున్నారు. కొందరు పనిగట్టుకొని సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తూ వైద్య సిబ్బంది ఆత్మ ైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నారు’
తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్
తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్
టిక్‌టాక్‌పై నిషేధం
సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాపై భారత్ ఆర్థిక యుద్ధానికి తెరలేపింది. టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. దేశభద్రత, సార్వభౌమత్వానికి ఈ యాప్స్ ప్రమాదకరంగా మారాయని సోమవారం ప్రకటించింది. యూజర్ల సమాచారాన్ని ఈ యాప్స్ దుర్వినియోగం చేస్తున్నాయని నిఘావర్గాలు తేల్చటంతో నిషేధం విధించినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచార శాఖ తెలిపింది. ఈ యాప్స్ నిషేధంతో చైనా టెక్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని టెలికం నిపుణులు చెప్తున్నారు.
ఏటీఎం వినియోగదారులూ జాగ్రత్త
నేటి నుంచి మళ్లీ పాత నిబంధనలు
సచివాలయ పాత భవనాలను కూల్చవచ్చు
‘భవనాల నిర్మాణం లేదా కూల్చివేత అనేది ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయం. ఇందులో జోక్యం చేసుకోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన నిర్ణయంలో చట్టపరమైన లోపాలేవీ మాకు కనిపించలేదు. క్యాబినెట్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం’
యూజర్ల భద్రతే ముఖ్యం!
అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తాం.. నిషేధంపై స్పందించిన టిక్‌టాక్
వివాదాల వీకే సింగ్ బదిలీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పోలీస్ శాఖలో అత్యంత వివాదాస్పదుడుగా పేరు తెచ్చుకొన్న రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ బదిలీ అయ్యారు. ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. వీకే సింగ్ స్థానంలో రాష్ట్ర పోలీసు నియామకాల బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావుకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఆదేశాలు జారీచేశారు.
నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం
అతనొక గొప్ప, నిరంతర సంస్కరణశీలి. ఒక నాయకుడిగా సంస్కరణలు చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. వాటి వల్ల వచ్చే విమర్శలను తట్టుకోగలిగే ధైర్యం ఉండాలి. కేంద్రంలో విద్యాశాఖ ఉండేది. ఈ పేరు సరైందికాదని దాన్ని మానవవనరుల అభివృద్ధి శాఖగా మార్పించారు. జైళ్ల శాఖ అప్పగిస్తే అక్కడా సంస్కరణలు చేపట్టి ఓపెన్ జైల్ కాన్సెప్ట్ తెచ్చారు. ఏ స్థాయిలో ఉన్నా సంస్కరణలు చేయడమే పనిగా పెట్టుకునే వారు. మీకు మళ్లీ హెచ్చార్డీ దక్కే అవకాశం లేదని ఒకరంటే పీవీ చెప్పిన జవాబేమిటో తెలుసా! ‘పర్వాలేదు.. నాకు మత్స్యశాఖ ఇచ్చినా అక్కడా సంస్కరణలు తీసుకొస్తానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్లో రెసిడెన్షియల్ స్కూల్‌ను స్థాపించి గురుకుల విద్యకు నాంది పలికారు. కేంద్రంలో ఉన్నప్పుడు నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఆయన తీసుకొచ్చిన గురుకుల విద్య.. నేడు విద్యావ్యవస్థకే తలమానికం. అందుకే తెలంగాణ ప్రభుత్వం పీవీ ఆశయం కోసమే కొత్తగా 900 గురుకులాలను ఏర్పాటు చేసింది.
రాజధానిలో మళ్లీ లాక్డౌన్?
లోతుగా పరిశీలించి నిర్ణయం