CATEGORIES
Kategorien
ఆధునిక.. వస్త్రశిల్పి
ఫ్యాషన్ ప్రపంచంలో బ్రాండ్‌కి, లేబుల్‌కి తేడా ప్రత్యేకమైంది. బ్రాండ్ అంటే సొంత వ్యక్తిత్వం. మీదైన పంథా. మీకే చెల్లిన ప్రత్యేకమైన పోకడ. అదే లేబుల్.. వివిధ రకాల ప్రత్యేక బ్రాండ్ల గురించి తెలియజెప్పేది. ఆయా బ్రాండ్లకి తనదైన అధికార ముద్ర వేసి మొత్తంగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలాలనుకునే ధోరణిని చాటేది. అట్లా చూస్తే, లేబుల్ పేరిట అర్చనరావు తనదైన ఫ్యాషన్ ప్రపంచానికి పెట్టుకున్నపేరే ఆమె స్వతంత్ర వైఖరిని, విజయ కాంక్షను చాటుతున్నది. చిత్రమేమిటంటే, ఇదంతా ఆమె దేశీయ వస్త్రశైలితోనే సాధించడం. అయినా, ప్రపంచ ఆమోదం పొందడం. ఇరుకైన ఫ్యాషన్ ప్రపంచంలో చురుగ్గా రాణిస్తున్న అర్చనరావు వికాసం నేటి ‘జిందగీ’ ప్రత్యేకం.
పోటీ గురించి పట్టించుకోను
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్నారు యువ హీరో ననీన్‌చంద్ర. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ప్రతిభావంతుడని పేరు తెచ్చుకున్నారు. ‘అందాల రాక్షసి’ ‘దళం’ ‘దేవదాస్' ‘అరవింద సమేత వీరరాఘవ’ ‘ఎవరు’ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భానుమతి రామకృష్ణ’. శ్రీకాంత్ దర్శకుడు. జూలై 3న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ఆ విశేషాలివి...
పరమగురువు..పరమాత్మ స్వరూపం!
తల్లి జన్మనిస్తుంది. గురువు పునర్జన్మనిస్తాడు. తండ్రి జీవితాన్నిస్తాడు. గురువు జీవన్ముక్తికి తోవచూపుతాడు.
దేశదేశాల్లోనరసింహ నాదం
జ్ఞానభూమిలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తెలుగు ప్రజల ఖ్యాతి ఖండాంతరాలకు తెలిసేలా చేసిన మహనీయుడు పీవీ నరసింహారావుకు రావాల్సిన పేరు రాలేదు. ఆయనకు భారతరత్న దక్కాల్సిన అవసరం ఉన్నది. ఈ నెల 28 నుంచి పీవీ జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎన్నారైలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి.
కోటికి చేరువలో కరోనా కేసులు.. ప్రపంచ దేశాల్లో ఆక్సిజన్ కొరత
కరోనా విజృంభణతో యావత్ ప్రపంచ దేశాలు విలవిల్లా డుతున్నాయి.
కవ్విస్తే.. కదనమే
న్యూఢిల్లీ, జూన్ 27: కడుపులో కత్తులు దాచుకొని కౌగిలించుకొనే విధానాన్ని అనుసరిస్తున్న చైనాకు గట్టి గుణపాఠం చెప్పేదిశగా భారత త్రివిధ దళాలు కదులుతున్నాయి. గల్వాన్‌లో ఘర్షణ తర్వాత తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకున్న భారత బలగాలు, మరోసారి చైనా దుస్సాహసానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పేందుకు యుద్ధ సన్నద్ధతను సమకూర్చుకుంటున్నాయి. ఉత్తరాది రాష్ర్టాల్లోని అన్ని మిలిటరీ, ఎయిర్‌ఫోర్స్ బేస్‌ల నుంచి భారీ ఆయుధ వ్యవస్థలు లఢక్ చేరుకుంటున్నాయి.
మనం నిలవాలి అడవి గెలవాలి
1985 ప్రాంతంలో నర్సాపూర్ అడవిలో ప్రతిరోజూ సినిమా షూటింగ్‌లు జరిగేవి. ఆ అడవి ఎక్కడికి పోయినట్టు? ఎక్కడ లేకున్నా నర్సాపూర్‌లో వర్షాలు కురిసేవి. కౌడిపల్లిలో బెల్లం గానుగలు నడిచేవి. ఇప్పుడు కౌడిపల్లిలో కరువొచ్చింది. మనం చేతులారా అడవిని పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న అడవినంతా మనమే తెచ్చుకోవాలి. సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఏకంకావాలి. రోజూ ఎవరింటిని వారే ఊడ్చుకోవాలి. మనకు తలనొప్పి వచ్చిందని పక్కవాళ్లు వచ్చి ఊడ్వరు. మనం మేల్కొంటేనే అడవులు బాగైతయి. ఫారెస్టు వాళ్ల బాధ్యత అనుకోకుండా అందరూ కలిసి అడవులను రక్షించుకోవాలి.
స్టార్టప్స్‌కు అడ్డా తెలంగాణ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ ఐటీరంగం దూసుకుపోతున్నది. స్టార్టప్‌ల కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరం తాజాగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. స్టార్టప్‌లను నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే ఎకోసిస్టమ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 30 ప్రదేశాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. వర్ధమాన ఎకోసిస్టమ్స్‌లో ఈ ఏడాది ఎంపికచేసిన టాప్ 100 ప్రదేశాలలో హైదరాబాద్ కూడా వాటిలో ఒకటిగా ఉన్నది. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్ జీనోమ్ సంస్థలు సంయుక్తంగా గురువారం ‘గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్-2020 (జీఎస్‌ఈఆర్)’ నివేదికను విడుదలచేశాయి.
వందేండ్ల బాపు.. వందనాలు నీకు!
అపర చాణక్యుడు.. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు.. మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యూహకర్త.. విలక్షణ రచయిత..తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు సాక్షిసంతకం.. మౌనిబాబా... దివంగత ప్రధాని పీవీ నరసింహారావు గురించి ప్రపంచానికి తెలిసిన పైపై కోణమిది. పీవీ సాబ్‌లోని ‘ఇన్సైడర్' మాత్రం, ఆయన ముద్దుల కూతురు వాణీదేవికి మాత్రమే పరిచయం. ‘తెలంగాణ ఠీవి..పీవీ’ శతజయంతి వేడుకల ప్రారంభ వేళ... తండ్రిగా, మార్గదర్శిగా జీవితాన్నీ, వ్యక్తిత్వాన్నీ అపారంగాప్రభావితం చేసిన ప్రియమైన బాపుతో తన అనుబంధాన్ని పంచుకుంటున్నారు ఆమె..
శత వసంతాల సౌమ్యవాది
కాళోజీ అన్నట్టు పీవీ ఒక అందమైన కల! అలా వచ్చి అలలా ఎగిసి కలలా మాయమైపోయిన పీవీ.. సుదీర్ఘ కాలానికి ప్రత్యక్ష సాక్షి. కింది స్థాయి నుంచి శిఖరాగ్రందాకా.. స్వాతంత్య్ర సమరం నుంచి.. స్వతంత్ర భారత ప్రధాని దాకా.. సామ్యవాదం నుంచి సంస్కరణ వాదం దాకా.. నెహ్రూ, ఆ కుటుంబంలోని నాలుగోతరం దాకా.. రాజకీయంగా పీవీ ఎరుగని ఎత్తు లేదు.. చూడని పల్లమూ లేదు.. నిమ్నఉన్నతాల నడుమ ఉంటూనే వాటితో ఏ బంధమూ లేకుండా బతికిన కర్మయోగి పీవీ..
సీఎంగారూ.. మీరు గ్రేట్!
ప్రాణానికి ఎంతని పరిహారమివ్వగలం!త్యాగానికి ఏమని వెలకట్టి చూపగలం!ప్రాణత్యాగాన్ని ఏ కొలబద్దతో కొలవగలం!
పదేండ్ల సూర్యుడు... ఒక్క వీడియోలోనే!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) దశాబ్ద కాలంగా తాను సూర్యుడిని పరిశీలించి తీసిన ఫొటోలన్నింటినీ కలిపి ఒక వీడియో రూపొందించింది.
ప్లాస్టిక్ వ్యర్థానికి కొత్త అర్థం
సూర్యాపేట, నమస్తే తెలంగాణ: పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వ్యర్థాల్లో ప్లాస్టిక్ ప్రధానమైనది.
మళ్లీ మిడుతల దండుయాత్ర
గురుగ్రామ్‌తోపాటు ఢిల్లీ సరిహద్దుల్లోకి ప్రవేశం
రాముడికే శఠగోపం
భద్రాద్రి రాముని పేరుతో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ ప్రబుద్ధుడు.
ఆరోగ్య యోగం కోసం..
విరామ సమయాల్ని ఏ మాత్రం వృథా చేయడానికి ఇష్టపడదు అగ్ర కథానాయిక సమంత.
మాహిష్మతిలో కూడా మాస్క్ ఉండాల్సిందే!
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది.
దశదిశలకూ పీవీ ఖ్యాతి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని దేశవిదేశాల్లో తెలియజేసేలా ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు తెలిపారు. ఆయన దేశానికి అందించిన సేవలకు గుర్తుగా హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జ్ఞానభూమిలో పీవీ స్మృతిచిహ్నాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. తమిళనాడు రామేశ్వరంలోని అబ్దుల్‌కలాం మెమోరియల్ మాదిరిగా దీనిని నిర్మించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే ఒక ప్రత్యేక కమిటీ త్వరలోనే అబ్దుల్ కలాం మెమోరియల్ పరిశీలనకు వెళ్తుందన్నారు.
ఒక్కరోజే 920 కేసులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దడపుట్టిస్తున్నాయి.
ఆరు రోజుల్లోనే లక్ష
దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ తీవ్రమవుతున్నది.
బాల్యస్మృతులు గుర్తొస్తున్నాయి
భయమే తన దృష్టిలో అన్నింటికంటే పెద్ద వ్యాధి అని తెలిపింది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్.
కండ్లముందే నీలి విప్లవం
రాజన్నసిరిసిల్ల, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మన కండ్లముందే నీలి విప్లవం రాబోతున్నదని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృషితో సాగునీటి రంగంలో అద్భుతాలు, విప్లవాలు మన కండ్లముందే ఆవిష్కృతమయ్యాయని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాల్లో మన న్యాయమైన వాటాను వాడుకోవడం వల్ల హరిత తెలంగాణ కల సాకారమవుతున్నదని చెప్పారు.
మన భూమి పుత్రుడి స్మరణలో..
పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశగతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా. యావత్ దేశ ప్రజలకు పీవీ గొప్పతనం చెప్పేలా జాతీయస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీని శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించాలి.
హెచ్1బీపై ట్రంప్ కత్తి
వాషింగ్టన్, జూన్ 23: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలస విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీతోపాటు ఇతర పని ఆధారిత వీసాలపై ఈ ఏడాది చివరి వరకు నిషేధం విధించారు. అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి ఇది అమల్లోకి రానున్నది. ఈ నిర్ణయంతో వేల మంది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (అమెరికాలో అక్టోబర్ 1 నుంచి మొదలు) హెచ్1బీ వీసాలను జారీచేసిన పలు అమెరికా, భారతీయ కంపెనీలపైనా ట్రంప్ నిర్ణయంతో ప్రతికూల ప్రభావం పడనుంది. వీసాలు ఆమోదం పొందేందుకు ఈ ఏడాది ఆఖరి వరకు వారు వేచిచూడాల్సి ఉంటుంది.
చెరువంత సంబురం
కొండకెక్కిన గోదావరి జలాలు.. కొండంత సంతోషాన్ని నింపనున్నాయి. పోచమ్మతల్లి సాక్షిగా కరువునేలను తడుపనున్నాయి.వర్షాభావ ప్రాంతాలైన గజ్వేల్, ఆలేరు ప్రాంతాల్లోని 42 చెరువులను నేటి నుంచి నింపబోతున్నారు.
ఆ ఊరు..కలెక్టరమ్మ పేరు!
దేవుడు ప్రతిచోటా ఉండలేక... అమ్మను తన ప్రతినిధిగా పంపాడని అంటారు. ప్రభుత్వం కూడా అంతే! ప్రతి పౌరుడికీ చేరువగా ఉండేందుకు కలెక్టర్లను నియమిస్తుంది. వాళ్లలో చాలామంది రూల్‌బుక్ ప్రకారం కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. కొందరు, ఇంకా ముందుకు వెళ్లి... ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. దశాబ్దాలు గడిచినా ‘ఫలానా కలెక్టరు ఉండేవారు...’ అనే పేరు మిగుల్చుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తి దివ్య దేవరాజన్! ఆదిలాబాద్ ప్రజలు రాబోయే తరాలు కూడా ఆ కలెక్టరమ్మను తలుచుకునేలా... ఓ గ్రామానికి ఆమె పేరు పెట్టుకున్నారు.
గగన వీధిలో అద్భుతం
భగభగ మండే సూరీడు.. నెలవంకలా మారిపోయాడు.. చూస్తుండగానే సన్నని ఉంగరంగానూ రూపుదాల్చాడు.. చూసిన కనులదే అదృష్టం అనేలా జ్వాలావలయ రూపంలో ఆహ్లాదపర్చాడు. సూర్యగ్రహణం సందర్భంగా దేశంలో ఆదివారం పలుచోట్ల కనిపించిన దృశ్యాలివి. కొన్నిచోట్ల మేఘాల కారణంగా ప్రజలు చూడలేకపోయినా.. చాలా ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా చేరి సూర్యగ్రహణాన్ని తిలకించారు. గ్రహణం కారణంగా మూత పడిన ఆలయాలు ఆదివారం సాయంత్రం తిరిగి తెరుచుకున్నాయి.
ఉండమ్మా..బొట్టు పెడతా!
నేడు అంతర్జాతీయ వితంతువుల దినం
శ్యాం సింగరాయ్ జోడీగా..
చిత్రసీమలో కొన్ని కలయికలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి.
కొవిడ్‌పై వార్‌కు కొవిఫర్ హెటిరో ఫార్మా సూదిమందు
కరోనా వైరస్‌కు హైదరాబాదీ విరుగుడు మందు అందుబాటులోకి వచ్చింది.