CATEGORIES
Kategorien
సై..సై.. జోడెడ్ల బండి
దేశంలోనే అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ వ్యవసాయంపై సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మొగులు చూసి కాలమెట్లా అవుతుందో ఊహించేవాడు కర్షకుడు. కాలమాన పరిస్థితి చూసి భవితను అంచనా వేసేవాడు నాయకుడు.
భామనే..గొల్లభామనే!
మనిషికి ప్రాణం ఉంటుంది. చెట్టుకు ప్రాణం ఉంటుంది. మరి, చీరకు? మిగతావాటి సంగతేమో కానీ, గొల్లభామ చీరలకు మాత్రం నిలువెల్లా ప్రాణం ఉంటుంది. అవి శ్వాసిస్తాయి. తమను గారించుకున్న గువలకు ప్రేమను పంచుతాయి. కాబట్టే, భామామణులకు తెలంగాణ గొల్లభామ చీరలంటే అంత ఇష్టం!
లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్ష
హైదరాబాద్, నమస్తే తెలంగాణః రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది.
పాప ఏడ్చింది!
‘ఏమిటీ సంగతీ?’.. ‘పాప ఏడ్చింది..’, ‘వుడ్వర్డ్స్ పట్టండి’..అందరినీ ఆకర్షించిన ఈ ప్రకటనలో, పాపాయి ఏడుపుకి కారణం కడుపునొప్పి. ఒక్కోసారి పసిపిల్లలను తీవ్రంగా బాధపెట్టేది ఈ కడుపునొప్పే. పాపం, పెద్దవాళ్లలా కష్టం చెప్పుకోలేరు. మనమే సమస్యను గుర్తించాలి. మనమే పరిష్కారమూ చూపాలి. మరీ ముఖ్యంగా ఐదు నెలల లోపు పిల్లల్లో ఏడుపుకి కారణాలేమిటన్నది తెలుసుకోవడం ఒక్కోసారి డాక్టర్లకి కూడా కష్టం అవుతుంది. పిల్లల ప్రవర్తన ఆధారంగా సమస్యను అంచనా వేయాల్సి వస్తుంది.
గోరువెచ్చటి నీరు తాగాలి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్ సోకిన వారిలో 80శాతానికి పైగా రోగులకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు.
కరోనా కలిపిన బంధాలు!
హైదరాబాద్/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీ తం.. సొంతంగా ఇల్లు, కారు.. మొత్తంగా లగ్జరీ లైఫ్.. ఇవే భారతీయ యువత ఆలోచనలు, లక్ష్యాలు.
ప్లగ్ అండ్ ప్లే తెలంగాణ
అనుకూల వాతావరణం.. పెట్టుబడులకు మౌలిక వసతులు భేష్.. టీఎస్ఐపాస్ సూపర్.. ఇలా పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది తెలంగాణ రాష్ట్రం. అనతి కాలంలోనే అంతర్జాతీయ కంపెనీలను అమ్ములపొదిలో చేర్చుకున్నది. ‘ప్లగ్ అండ్ ప్లే’ అంటూ ఇప్పుడు చైనా నుంచి తరలించే కంపెనీలపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది.
పనిమనిషి.. పస్తులే గతి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మం ది వరకు ఇంటి పనిమనుషులు (డొమెస్టిక్ వర్క ర్స్) ఉంటారని అంచనా.
భారత్‌లోకే ఆక్రమిత కశ్మీర్
న్యూఢిల్లీ: రాబోయే ఐదేండ్లలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతో జమ్ముకశ్మీర్ ముఖచిత్రాన్నే మార్చనున్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య
ముంబై: బాలీవుడ్ యువ కథా నాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (34) ఆదివారం ఆత్మహ త్యకు పాల్పడ్డారు.
కరోనా పరీక్షలు 50,000 మందికి
హైదరాబాద్ -శివారు జిల్లాల్లో నిర్వహణ
చల్లని.. దీవెన!:
..సనాతన ధర్మంలో ఇదో సుప్రసిద్ధ ఆశీర్వచన శ్లోకం, మంగళ శ్లోకం కూడా. ఇందులో సకల శుభాలూ కలగాలన్న ఆకాంక్ష ఉంది. ‘సర్వేజనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకాః సమస్తా సుఖినోభవంతు’.. ఈ ప్రపంచం బాగుంటేనే, నీ దేశం బాగుంటుంది, నీ దేశం బాగుంటేనే నువ్వు బాగుంటావు.. అన్న విశాల భావనను వేల సంవత్సరాల క్రితమే మహర్షులు మన సంస్కృతిలో భాగం చేశారు. ఆశీర్వచనం భారతీయ సంప్రదాయం. శత్రువునైనా ఆశీర్వదించడం భారతీయుల సంస్కారం. ఎవరిని, ఎప్పుడు, ఎలా ఆశీర్వదించాలన్నది ఓ కళ, అంతకు మించిన శాస్త్రం!
ప్రతివారం గ్రీన్‌ఫ్రైడే
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని పట్టణాల్లో ప్రతిశుక్రవారాన్ని గ్రీన్ ఫ్రైడేగా పాటించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తిచేశారు.
రాష్ట్రంలో కొత్తగా253 కేసులు
రాష్ట్రంలో శనివారం రికార్డుస్థాయిలో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దిల్‌కీ బాత్ సునో..
వృత్తిగతమైనా, వ్యక్తిగతమైనా.. డైలమా వచ్చినప్పుడు...కష్టమో, నష్టమో... నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు..ముందుకా, వెనక్కా... సందిగ్ధత ఎదురైనప్పుడు.తాప్సీ పఠించే వేద మంత్రం ఇదే... .. ల్కీ బాత్ సునో!
జైనుల కోట్ల నర్సింహులపల్లె
చరిత్రను మనం మరిచినా కాలం మరువదు. వందలు, వేల ఏండ్లు గడిచినా నిజం బయటపడక మానదు. మరుగునపడ్డ గొప్పదనం ఏనాటికైనా తెలియకపోదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే కరీంనగర్ జిల్లా కోట్ల నర్సింహులపల్లెలో తాజాగా బయటపడ్డ జైనుల ఆనవాళ్లు.
ఇంట్లో జిమ్..
కరోనా ప్రభావంతో అన్ని జిమ్‌లు బంద్ అయిపోయాయి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి వీల్లేకుండాపోయింది.
ఎడారిలో..దొంగల ముఠా
ఒకడు బ్యాంకు అధికారిగా ఫోన్ చేసి.. డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు తీసుకొంటాడు.
సిమెంటు ధరలు తగ్గించాలి
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి కొనసాగాలంటే సిమెంట్ రేట్లు తగ్గాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
నితిన్ సరసన
నన్ను దోచుకుందువటే’, ‘ఇస్మార్ట్‌శంకర్' చిత్రాల్లో చలాకీ యువతిగా అందం, అభినయం కలగలసిన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది నభానటేష్.
టాప్ 20లో హెచ్‌సీయూ
దేశంలోని అత్యుత్తమ 20 విద్యాసంస్థల్లో తెలంగాణకు చెందిన మూడు సంస్థలు చోటు దక్కించుకొన్నాయి.
లక్ష కల్లాలు.. 460 కోట్లతో 32 జిల్లాల్లో
రైతులు పండించిన పంటను ఆరబోసుకొనేందుకు గ్రామాల్లో ప్రత్యేకంగా కల్లాలు నిర్మించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది.
ఆర్థికానికి ఆర్ఆర్ఆర్.. రికవర్.. రీబూట్.. రీస్టార్ట్..
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలి. ఇతర దేశాల్లోని భారతసంతతి ప్రజలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేలా కృషిచేయాలి. గత కొన్నేండ్లుగా దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంద్వారా దాదాపు పది కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందాయి. ఇదే తరహాలో రాబోయే దశాబ్ద కాలంలో వైద్యరంగంలో కూడా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి.
209 మందికి కరోనా
జీహెచ్ఎంసీలోనే 175 మందికి వైరస్. 9 మంది మృతి.. 176 మంది డిశ్చార్జి
ఉపాధిలో దూకుడు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉపాధి హామీ పనుల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. పనిదినాల కల్పనలో పరుగెత్తుతున్నది. ఆర్థిక ఏడాది మొదలైన రెండునెలల్లోనే గ్రామీణ ఉపాధి హామీపనుల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని దాటిపోయింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలు (తొలి త్రైమాసికం) ముగిసేనాటికి 7.73 కోట్ల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం కాగా.. ఇరవై రోజులు మిగిలి ఉండగానే 8.06 కోట్ల పనిదినాలు కల్పించి లక్ష్యాన్ని మించిపోయింది. ఈ ఏడాది తెలంగాణకు మొత్తం 13.66 కోట్ల పనిదినాలను కేటాయించారు. కాగా, మొదటి త్రైమాసికంలోనే వార్షిక లక్ష్యంలో తెలంగాణ సగానికిపైగా పూర్తిచేసింది.
ముసురుకొన్న వాన
రాష్ట్రంపై ముసురు కమ్ముకొన్నది. అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి మొదలైన వాన బుధవారం సాయంత్రం దాకా కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తారంగా కురిసిన వానతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రామాల్లో పొలాలు, చెరువుల్లోకి నీరు చేరింది. గ్రేటర్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావారణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు నిలకడగా విస్తరిస్తున్నాయని వెల్లడించింది.
ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం
కొన్నిరోజులుగా తెలుగురాష్ర్టాల పరిధిలోని అన్ని ప్రాజెక్టుల వివరాలు, కృష్ణాబేసిన్‌లో నీటి లభ్యత, ఇతరత్రా సమగ్ర వివరాలను సేకరించే పనిలో కేంద్ర అధికారులు నిమగ్నమయ్యారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ కోసమే వివరాలు సేకరిస్తున్నారని భావిస్తుండగా.. కేంద్రం ఆలోచన మాత్రం మరోలా ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ర్టాల పరిధిలోని నీటి అంశాన్ని తన పరిధిలోకి తెచ్చుకునేందుకు బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర వివరాలను తెప్పించుకుంటున్నారని తెలిసింది.
మిడతల దండు దండెత్తవచ్చు
తెలంగాణకు 200 కిలోమీటర్ల దూరంలో మిడతల దండు ప్రమాదం పొంచిఉన్నది. మహారాష్ట్రలోని రాంటెక్ సమీపంలో ఇది తిష్టవేసింది. ఈ దండు దక్షిణంవైపు ప్రయాణిస్తే తెలంగాణకు ముప్పుతప్పనట్టే. ఈ నెల 20 నుంచి జూలై 5వ తేదీ లోపు ఎప్పుడైనా రావచ్చని, వానకాలం సీజన్ ప్రారంభంలో ఇది దాడిచేస్తే తీవ్రనష్టం జరుగవచ్చని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. మిడతల దాడినుంచి రాష్ర్టాన్ని రక్షించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. దీనిపై పర్యవేక్షణకు సీఎస్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు.
నిరాడంబరంగా బోనాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా పరిస్థితుల దృష్ట్యా బోనాల ఉత్సవాలను ఈ సంవత్సరం నిరాడంబరంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అనామికా..ఆబ్సెంట్ టీచర్!
ఆన్లైన్ పాఠాలు .. భారతీయ విద్యా వ్యవస్థలో సరికొత్త చేర్పు! ఆ ప్రయోగాన్ని మేధావులు మెచ్చుకుంటున్నారు. పాలకులు పొంగిపోతున్నారు. కథనాలు గుప్పించి మీడియా మురిసిపోతున్నది. ఆకలికి అన్నం దొరకని కుటుంబాలకు, చదువుల కోసం స్మార్ట్‌ఫోన్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? మందులేని మాయరోగం ఎయిడ్సో క్యాన్సరో కాదు.. పేదరికం! సెల్‌ఫోన్ లేకపోవడంతో, ఇ-పాఠాలకు దూరమైన ఓ పేదింటి బాలిక కథ ఇది. అక్షరాలా నిజం ఇది.