CATEGORIES
Kategoriler
అన్ని ఆస్పత్రుల్లో ఉన్నత ప్రమాణాలు
ఆస్పత్రుల గ్రేడింగ్ పెరగాలి..రిఫరల్ విధానం మెరుగవ్వాలి
అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
అవినీతి భరతం పట్టడానికి సహకరించాల్సింది పోయి, కుంభకోణాలకు పాల్పడిన వారిని వెనకేసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
50,33,676 ఆంధ్రప్రదేశ్ లో అరకోటి మార్క్ దాటిన కరోనా టెస్టులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరో రికార్డు నమోదైంది.
మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు
చైనాతో సరిహద్దు వివాదంపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్. ఎల్ఏసీ వెంట యథాతథ పరిస్థితిని పునరుద్ధరించాలన్న ప్రతిపక్షం
రైల్వేలో యూజర్ చార్జీల బాదుడు
రద్దీ స్టేషన్లలో అమలు నామమాత్రంగానే: రైల్వే
రామాయపట్నానికి గ్లోబల్ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. రూ.2,169.62 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కొత్త ఓడరేవు పనులు చేపట్టేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి టెండర్లను పిలిచేందుకు న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్టు (ఈపీసీ) విధానంలో నిర్మించే ఈ ఓడరేవు కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు(ఆర్ఎఫ్క్యూ) పిలవాలని మారిటైమ్ బోర్డు నిర్ణయించింది.
భావప్రకటనకు సంకెళ్లా..?
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థ అంగుళం కూడా కదలనివ్వడం లేదని, ప్రజలకు మేలు చేసే ఏ నిర్ణయంపైనైనా స్టే వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కుంభకోణాలను వెలికితీయాలని ఆదేశించాల్సిందిపోయి.. ఆపండని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీలందరితో కలిసి మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఇటీవలి హైకోర్టు నిషేధిత ఉత్తర్వులపై తాను రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లినట్టు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
నా పరువు తీస్తున్నారు!
రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా
కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులకు వ్యతిరేకంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగాను. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లు, బిల్లులకు వ్యతిరేకంగా నా పదవికి రాజీనామా చేశాను. ఒక సోదరిగా, బిడ్డగా రైతుల పక్షం నిలబడినందుకు గర్వంగా ఉంది’ అని సంబంధిత బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందేందుకు కొన్ని గంటల ముందు ఆమె ట్వీట్ చేశారు.
మళ్లీ చైనా కాల్పులు
భారత సైనికులను బెదిరించే ఉద్దేశంతో ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గతవారం మరోసారి గాలిలో కాల్పులు జరిపారు. భారత్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యిల మధ్య రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరగడానికి ముందు ఫింగర్ 4 రిడ్జ్‌లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
హక్కుల కాలరాతే!
అమరావతిలో భూ కుంభకోణంపై రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించకూడదన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై జాతీయ స్థాయిలో విస్మయం వ్యక్తమవుతోంది.
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూత
సీఎం వైఎస్ జగన్‌తో బల్లి దుర్గాప్రసాదరావు (ఫైల్)
6 అడుగుల దూరం.. మాస్కులు తప్పనిసరి
కోవిడ్–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ 4 ఆదేశాలను అనుసరించి స్కూళ్లను తెరవడంపై పాఠశాల విద్యా శాఖ తాజాగా మార్గదర్శకాలను ఇచ్చింది. దీంతో ప్రభుత్వ యాజమాన్యాల్లోని ఆయా విభాగాలు తమ పరిధిలోని స్కూళ్లను తెరిపించడంపై దృష్టి సారిస్తున్నాయి. వీటిపై ఎలాంటి చర్యలు చేపట్టాలో విద్యా శాఖ తన మార్గదర్శకాల్లో స్పష్టతనిచ్చింది.
30న బాబ్రీ కూల్చివేత తీర్పు
అడ్వాణీ సహా నిందితులందరూ హాజరుకావాలని కోర్టు ఆదేశం
సైన్యం శీతాకాలం కోసం..
లద్దాఖ్‌లోని సైనిక స్థావరానికి నిత్యావసరాలు తీసుకొచ్చిన సీ17 రవాణా విమానం
రేపటి నుంచి ఏపీ ఎంసెట్
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీ.ఫార్మసీ తదితర సాంకేతిక వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్–2020 ఈ నెల 17 (గురువారం) నుంచి ప్రారంభం కానుంది.
విద్యలో విప్లవం
1వ తరగతికి ముందే పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాస్
సరిహద్దులో సంసిద్ధం..
హద్దులు మార్చేందుకు చైనా ప్రయత్నం
ఆమె దేశానికి ఇంగ్లిష్ నేర్పుతోంది
రెండో కాన్పు అయ్యాక పుట్టింటికి వచ్చిన అనురాధకు ఇరుగు పొరుగు ఆడవాళ్లు ‘కొంచెం ఇంగ్లిష్ నేర్పించమ్మా’ అని అడిగారు. ఆమె నేర్పడం మొదలెట్టింది. ఒకరా ఇద్దరా... ఇలాంటి వారు దేశంలో దాదాపు 46 కోట్ల మంది ఉన్నారని గ్రహించింది. సొంత భాషలతో ఇంగ్లిష్ నేర్పే యాప్‌ను మొదలెట్టింది. ఇప్పుడామె ‘మల్టీభాషి’ యాప్ ద్వారా 15 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఇంగ్లిష్ వస్తే ఏమవుతుంది అని కొందరు అడుగుతుంటారు. ఇంగ్లిష్ వస్తే ఇలాంటి విజయం వస్తుందని అనురాధ నిరూపిస్తోంది.
స్కూల్‌కి పోదాం.. ఛలో!
2020–21కు సిద్ధమవుతున్న పాఠశాల విద్యాశాఖ
ప్రశ్నోత్తరాలు రద్దు, జీరో అవర్ అరగంటే
విపక్షాల నిరసన; ప్రజాస్వామ్యం గొంతు నులమడమేనని విమర్శ. కోవిడ్ నేపథ్యంలో సరికొత్త విధి, విధానాలతో సమావేశాలు
పది మంది చనిపోతే దర్యాప్తు చేయొద్దా?
రమేష్ ఆస్పత్రి ఘటనలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు విస్మయం
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం కావాలి
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పార్టీ ఎంపీలు కృషి చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం నిరంతరం ప్రయత్నించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు.
ఆడి చూపిస్తాడు
శ్రీశాంత్‌పై నిషేధం ముగిసింది. రీ ఎంట్రీకి నేను సిద్ధం అన్నాడు. ఇంకేం ఆడతావ్‌లే అన్నారెవరో! ఆడి చూపిస్తాడు అన్నారు శ్రీశాంత్ భార్య. భార్యగా ఆ మాట అనలేదు. శ్రీశాంత్ అభిమానిగా అన్నారు. ఆటను చూసి ప్రేమించి.. ఆట నుంచి నిషేధించారని తెలిసీ.. శ్రీశాంత్‌ని చేసుకున్నారు భువనేశ్వరి. స్టోరీలే లేని లవ్.. వీళ్ల లవ్ స్టోరీ!!
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో ఉన్న 7 అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నానది
‘ఆరోగ్య' భరోసా
దివంగత వైఎస్సార్ ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీకి మెరుగులద్దుతూ ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
నమో నయోమి
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత నయోమి ఒసాకా
ధాన్యాగారంలో జలసిరులు
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గోరుకల్లు, కొండజూటూరు గ్రామాల చుట్టుపక్కల ఎస్ఆర్బీసీ నీటితో కళకళలాడుతున్న వరి పంట
గవర్నర్‌తో కంగన భేటీ
తనకు జరిగిన అన్యాయాన్ని వివరించానన్న బాలీవుడ్ నటి
కలెక్టర్ నాన్న
‘అమ్మలేదంటూ బెంగపడవద్దు.. అయినవారెవ్వరూ లేరనే చింత అసలే వద్దు.. నాన్నగా ధైర్యమై మీ వెంటే ఉంటాను’ అంటూ జిల్లా కలెక్టర్ అనాథలైన ఇద్దరు కవల ఆడపిల్లలకు ఆండగా నిలుస్తున్నారు. కలెక్టర్ నాన్నగా అందరి మదిని గెలుచుకుంటున్నారు.