CATEGORIES
Kategorier
స్వాతి లక్రా
“తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో తిరుగు లేని అధికారిగా ప్రసిద్ధి చెందారు 'షీ' టీమ్స్ ఇన్ ఛార్జి స్వాతి లక్రా"
“నాకు ఫ్లయింగ్ చాలా ఇష్టం.ఇండియాలో క్యాబిన్ క్రూ లైసెన్స్ ఉన్న ఏకైక మేనేజర్ నేనే”
ఎయిర్ ఏషియాలోని క్యాబిన్ క్రూ డిపార్ట్మెంట్. హెడ్ మేఘా సింఘా నియా వ్యక్తిత్వం విశిష్టమైనది. 10 ఏళ్ల కంటే ఎక్కువకాలం నుంచి ఏవియేషన్ రంగంలో పని చేస్తున్న మేఘకు ఎల్లప్పుడు సవాళ్లు ఎదుర్కోవటమే ఇష్టం.
“చిన్నారుల జీవితాలు కాపాడటమే నా సంగీత యాత్ర లక్ష్యం”
'ఏ క్ థా టైగర్', 'ఆషికీ 2', 'కిక్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'కాబిల్', 'బానీ', 'ఎమ్ఎస్ ధోనీ', 'లవ్ యాత్రీ' లాంటి వందలాది చిత్రాల్లో ప్రసిద్ధ గీతాలు పాడిన బాలీ వుడ్ మధురగాయని పలక్ ముచ్ఛల్ హృద్రోగులు, చిన్నారులకు దేవదూతలాంటి వ్యక్తి. ఆమె మ్యూజి కల్ కన్సర్ట్ తో వచ్చే ఆదాయంతో హృద్రోగ బాల లకు ఆపరేషన్ చేయించి కొత్త జీవితాన్ని ప్రసా దిస్తుంటారు.
శిఖా మల్హోత్రా
శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సులు సైతం కోవిడ్ ఆసుపత్రికి దూరంగా ఉండాలని కోరుకున్న సమయంలో 'రన్నింగ్ శాదీ', ఫ్యాన్' లాంటి చిత్రాలలో చిన్న పాత్రలు పోషించి, కాంచలి' చిత్రంలో హీరో యిన్ గా నటించిన శిఖా మల్తోత్రా మాత్రం ముందుకు వచ్చి నర్సుగా ఉచితంగా పనిచేసి కరోనా రోగులకు చికిత్స అందించి ఒక కొత్త ఉదాహరణగా నిలిచారు.
మహిళ్లు అలంకార బొమ్మలు కాదు
కలసి తీరగటం, తినటం, కొన్ని రోజులు పగలు, రాత్రులు గడపటం వేరు, కానీ పెళ్లి కమిట్ మెంట్ ని నెరవేర్చటం వేరు.
“నేను నటించేటప్పుడు నా క్రీడా నేపథ్యం చాలావరకు సహాయపడుతూ ఉంటుంది”
ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంతో నిండుగా కనిపించే 5 అడుగులు 9 అంగుళాలు పొడవున్న అందమైన ప్రాచీ తెహ్లాస్ భారత్ నెట్ బాల్ మాజీ కెప్టెన్ మాత్రమేగాక ప్రసిద్ధ నటి కూడా.
పిల్లలకు సంస్కారం ఇలా నేర్పండి
చిన్నారులు చదువుతోపాటు వారు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగేందుకు వారికి తగిన సంస్కారాలను ఎలా నేర్పించాలో తప్పక తెలుసుకోండి.
ఫిట్‌గా ఉండడానికి చిట్కాలు
మీరు బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం పొందకపోతే విచార పడకండి. మీ ప్రయత్నాలలో కొద్దిగా మార్పు చేసి చూడండి. మీకు నచ్చిన పరిణామం చూస్తారు. స్లిమ్ అండ్ ఫిగా ఉండాలనుకుంటే మీరు ఈ విషయాలపై తప్పకుండా దృష్టి పెట్టండి.
గృహిణుల పని సులభం చేసే పేమెంట్ యాప్
మీ రోజువారీ జీవితంలో నిత్యావసర వస్తువుల పేమెంట్స్ సౌకర్యవంతంగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే...
నైనా జైస్వాల్
పువ్వు పుట్టగానే సువాసన వెదజల్లినట్లు బాల్యం నుంచే అపూర్వమైన ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును సాధించింది నైనా జైస్వాల్.
కాస్మెటిక్ చిట్కాలు
తమ మేకప్ ఉత్పత్తులను రీసైకిల్ చేసే కంపెనీలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కస్టమర్ కాస్మెటిక్ ఉత్పత్తులను తిరిగి ఇస్తే కొన్ని కంపెనీలు వాటికి బదులుగా కొత్త మేకప్ ఉత్పత్తుల కొను గోలు చేయడానికి కొన్ని రూపాయల తగ్గింపు ఇస్తాయి.
ఓరల్ హైజీన్‌లో ఆరోగ్య లాభాలు
నోటి శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంత మూల్యం చెల్లించవలసి వస్తుందో స్వయంగా తెలుసుకోండి.
ఇలా చేస్తే జీర్ణక్రియ బాగుంటుంది
జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే అజీర్తి సమస్య తలెత్తుతుంది. అజీర్తి సాధారణంగా అనేక రోగాలు, జీవన శైలి సంబంధిత కారణాల వల్ల ఏర్పడొచ్చు. జీర్ణ సమస్యలు మామూలుగా ఇలా ఉంటాయి : కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, డయేరియా, వాంతులు, ఛాతీలో మంట.
ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచే 7 'సులువైన చిట్కాలు
ఫిట్నెస్ కోసం జిమ్ కి వెళ్లటం విసుగ్గా అనిపిస్తే, ఇక్కడ సొంతంగా పాటించగలిగే ఫిట్నెస్ చిట్కాలు తెలుసుకోండి.
అందాన్ని ప్రదర్శించటం ఒక కళ-ఈషా రెబ్బా
తాను నమ్ముకున్న ప్రొఫెషన్లో రాణించటానికి ప్రతి రోజూ కొత్త దనాన్ని చూపించాలని నమ్మే చురుకైన నటి ఈషా రెబా. తెలుగు చిత్రపరిశ్రమలో లోకల్ బ్యూటీలకు ప్రాధాన్యత ఉండదన్న అభిప్రాయాన్ని పక్కకు నెట్టి తనదైన శైలిలో టాలీవుడ్ లో దూసు కెళ్తున్నారు. గ్లామరస్ పాత్రలతో యూత్ కి ఎంతో దగ్గరైనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చే చిత్రాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
30 దాటాక వర్కింగ్ ఉమెన్ డైట్ ప్లాన్
ఆరోగ్యంగా ఉంటూ ఇల్లు, ఆఫీసు రెండింటిలో బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలంటే వర్కింగ్ ఉమెన్ ఆహారంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
'పద్మశ్రీ' ద్రోణవల్లి హారిక
చదరంగం బోర్డునే హృదయంగా, చెన్లో పావులు కదిలించటమే శ్వాసగా బాల్యం నుంచే అద్భుత ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ గుర్తింపును సాధించింది గ్రాండ్ మాస్టర్ 'పద్మశ్రీ' ద్రోణవల్లి హారిక
వెడ్డింగ్ గిఫ్ట్ ఏదైతే బాగుంటుంది?
వివాహ బహుమతుల ఎంపిక మీకు, పెళ్లి చేసుకుంటున్న వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆ బంధుత్వం మేరకు ఎలాంటి కానుకలు ఇవ్వాలను కుంటున్నారో స్పష్టమవుతుంది. గిఫ్ట్ బాగుండాలి అనేది తప్పక దృష్టిలో పెట్టుకుంటూనే మీ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా జాగ్రత్త పడాలి. మీకు వధువు లేదా వరుడి ఇష్టాలు తెలిసినట్లయితే ఆ ప్రకారమే గిఫ్ట్ కొనండి, ఇలా కాదంటే భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుంది అనిపించేవి ఇవ్వాలి.సంసారంలో వారికి పనికొచ్చే వస్తువులే ఇవ్వండి.లేకపోతే గిఫ్ట్ వాళ్ల ఇంట్లో మూలన పడి ఉంటుంది.
సక్సెస్ పొందాలంటే పర్సనాలిటీలో చేయాల్సిన మార్పులు
కఠిన శ్రమ తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది. కానీ మీకంటూ ప్రత్యేక ఐడెంటిటీ కూడా ఉండాలి. అందుకే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోండి ఇలా...
రొమ్ములో కణుపులన్నీ క్యాన్సర్ కాకపోవచ్చు
మన దేశంలో రొమ్ముల్లో ఏర్పడే కణుపు మ లపై రెండు రకాల అభిప్రాయాలు సాధారణంగా ఉన్నాయి. మొదటిది జనం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేయటం, రెండోది తీవ్ర భయానికి లోనవటం. ఈ రెండు రకాల పరిస్థితులకు అవగాహన లోపమే కారణం. భారతదేశంలో మహిళల మరణాలకు అతి పెద్ద కారణాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. ఇటీవలే ఒక అధ్యయనంలో తెలిసింది ఏమిటంటే లక్ష మరణాల్లో 25.8% మంది ఈ రోగం బారిన పడుతున్నారు. ఇందులో ప్రతి లక్షమంది రోగుల్లో 12.7% మంది మరణిస్తున్నారు. ఇంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పటికీ మహిళల్లో ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన చాలా తక్కువగా ఉంది.
కరోనా కాలంలో ఆహార శుభ్రత చిట్కాలు
నిజానికి మనం పాటించే అపసవ్యమైన అలవాట్లే అనారోగ్యాన్ని కలిగి స్తుంటాయి. ఆహార శుభ్రత పై దృష్టి పెట్టకపోవటం, కలుషిత పదార్థాలు స్వీకరించటం వంటి కారణాలతో బ్యాక్టీరియా శరీరంలో ప్రవే శించి రోగాలు పుట్టిస్తుంది.
చిన్న ఇంటికి సొగసులు అద్దండిలా
మహిళలకు ఇంటి అలంకరణ చాలా ఇష్టం. ప్రతి వస్తువు పర్ఫెక్ట్ గా ఉండా లనుకుంటారు. కానీ రించేందుకు అందరికీ పూర్తి అవగాహన ఉండదు.ఏదో చూసి మీరు ఇంటిని అలంకరించు కుంటే, మీది చూసి మరొకరు ఇల్లు తీర్చిదిద్దు కుంటారు. ఫలితంగా చివరికి మీ ఇంటి అలకం రణలో ఎలాంటి కొత్తదనం కనపడదు. అందుకే ఇల్లు ఇతరుల ఇంటికంటే మరింత ప్రత్యేకంగా ఉండాలంటే ఈ పద్ధతులను పాటించండి.
ఇమ్యూనిటీ పెంచే 5 మసాలాలు
కరోనా కాలంలో ఇమ్యూనిటీ పెంచే పదార్థాలు మరెక్కడో కాదు, ఇంటి వంటగదిలోనే దొరుకుతాయి. నేడు అందరిపైనా కరోనా వైరస్ భయం తీరుగాడుతోంది. ఇలాంటప్పుడు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవాలి.మనం ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.ఇమ్యూవిట్ బూస్ట్ చేసే పదార్థాలు మరెక్కడో కాదు, కిచెన్లోనే దొరుకుతాయి.
ఒత్తిడి తొలగించే 5 సులభమైన ఉపాయాలు
మీరు నిజానికి ఆరోగ్యంగా ఉండాలను కుంటున్నట్లయితే శరీరంతో పాటు మానసిక స్వస్థతపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చాలావరకు రోగాలు, శారీరక సమస్యలకు మానసిక భావోద్వేగ విషయాలతో సంబంధం ఉంటుంది. సాధారణంగా మనం వీటి మీద దృష్టి పెట్టం. ఉదాహరణకు 'ఫైబ్రోసైటిస్' తీసుకుందాం. దీనివల్ల కండరాల నొప్పి, నిద్ర మూడ్ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఇది పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం దీర్ఘకాలికంగానూ ఉండొచ్చు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఆర్థరైటిస్, ఇన్ ఫెక్షన్ లేదా వ్యాయామం లేకపోవటం వంటివి.ఇలాంటప్పుడు శరీరంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి.
చర్మం పొడిబారకుండా కాపాడుకోవటం ఎలా? .
శీతాకాలంలో చర్మం, కేశాల సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఇలాంటి సీజన్లో మనపై మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. చలి వాతావరణంలో శరీరంలోని భాగాల్లో ముఖ్యంగా జాయింట్స్ ఉన్న మోకాళ్లు, మోచేతి కీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో ఈ ప్రదేశాల్లో చర్మం పొడిబారి నలుపెక్కు తుంది. ఈ శరీర భాగాల్లో మృతకణాలు ఒక పొరగా ఏర్పడతాయి. దీన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటం ఒక ఛాలెంజ్ లాంటిదే. ఈ భాగాల సరైన సంరక్షణతోనే చలికాలాన్ని సంతోషంగా గడిపేయగలరు.
ఎర్రగా బుర్రగా మార్చే ఎర్రని పండ్లు
ఎరుపు రంగు కూరగాయలు, పండ్లతో కలిగే ఈ ప్రయోజనాలు తప్పకుండా తెలుసుకోండి....
చిన్న పొదుపు పెద్ద లాభం
ఇటీవల మధ్య ప్రదేశ్ లోని ఛిద్ వాడా జిల్లాలో ఒక సంఘటన జరిగింది. స్కూలు పిల్లలు ఆడుతూ పాడుతూ దాదాపు కోటి రూపాయల డబ్బు పోగు చేసి అంద రినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పిల్లల్లో పొదుపు అలవాటు మొదలుపెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2007లో 'అరుణోదయ్ గుల్లక్' పథకం కింత ఇంత భారీ మొత్తాన్ని పోగు చేసారు.
గృహిణులకు 5 సులువైన పొదుపు చిట్కాలు
మహిళలు ఎందులోనైనా స్మార్ట్ గా వ్యవహరిస్తారు. వంట చేయటం, భర్తను సంతోషపెట్టడం, పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదా వారికి మంచి ఎడ్యుకేషన్ అందించటం మొదలైనవి జాగ్రత్తగా చూస్తారు.
కుకింగ్' పంచండి హృదయంలో ప్రేమ
వాలెంటైన్స్ డేకి ఈసారి కొంచెం భిన్నంగా ట్రై చేయండి. మీ భాగస్వామితో ఈ ప్రత్యేకమైన రోజుని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు హృదయాన్ని సంతోషం, ప్రేమతో నింపేయండి.రొమాన్స్ గాలిలో వ్యాపించనివ్వండి. ఇందుకోసం ఈ వాలెంటైన్స్ డేకి భార్య లేదా ప్రియురాలికి బ్రేక్ ఫాస్ట్ తయారు చేసి పెట్టండి. దీంతో మును పెన్నడూ లేని విధంగా ఆమె కళ్లలో మెరుపుని చూస్తారు. తన కలల రాకుమారుడు ఆమెకు నచ్చిన డిషెస్ గల ట్రే తీసుకొచ్చి ముందు నిలబడితే అందులో ఒక గులాబీ పువ్వు కూడా ఉన్నట్లయితే ఇంతకంటే సంతోషకరమైన రెసిపీ ఇంకేదీ ఉండదు. కొన్ని సులువైన వంటల ద్వారా మీ భాగస్వామి రోజంతటినీ ఆశ్చర్యాలతో ముంచెత్తే ప్లాన్ చేసి ప్రేమ జల్లులు కురవనివ్వండి.
కాలుష్యం నుంచి రక్షణ అందరి బాధ్యత
పెరుగుతున్న కాలుష్యం, చెత్త కుప్పలు, దుర్వాసన, కాల్వలు పారకుండటం, రోడ్ల మీద అడ్డగోలు రద్దీపై జనం ఎప్పుడూ ఆగ్రహిస్తూనే ఉంటారు. కానీ ఇందులో తమ బాధ్యత కూడా తక్కువేనని మరిచిపోతారు. మహిళలు ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇళ్లలో చెత్త వాళ్లే అటూ ఇటూ విసురుతుంటారు.