CATEGORIES
Kategoriler
5 జీతో ప్రగతి
భారతదేశానికి త్రీ ఐ (ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్) మంత్ర ఎంతో అవసరం.
సోలిపేట లింగన్న కన్నుమూత
విద్యార్థి దశలోనే అభ్యుదయాన్ని కాంక్షించిన విప్లవకారుడు ఇక లేడు. సమాజ మార్పుకోసం అక్షరాలను ఆయుధాలు చేసిన పాత్రికేయుడు.. సెలవన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి.. తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టి.. అవిశ్రాంతంగా నినదించిన నిఖార్సయిన ఉద్యమకారుడు.. విశ్రమించాడు.
‘వారియర్స్' వెన్ను తడుతూ..
కొవిడ్ బారిన పడిన వారికి మనోబలమే సగం మందు. కాబట్టే, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏ పోలీసు ఉద్యోగికి కరోనా వచ్చినా, ‘కాన్ఫిడెంట్‌గా ఉండండి. మీకేం కాదు. అందుకు మేమేఉదాహరణ..’ అంటూ ధైర్యం చెబుతున్నారు సీపీ మహేష్ భగవత్. సిబ్బందికి ఆయన.. క్వారంటైన్లో ఉన్నప్పుడు ధైర్యవచనాలు అందిస్తారు, తిరిగి విధి నిర్వహణకు వచ్చిన రోజు పుష్పగుచ్ఛం ఇస్తారు. ఆ కార్యక్రమాల గురించి ఆయన మాటల్లోనే..
పల్లెలో డీజిల్ జిల్
గత ఏడాది ఏప్రిల్-జూన్‌తో పోల్చితే ఈసారి 10 జిల్లాల్లో డీజిల్ విక్రయాలు పెరిగాయి. నారాయణపేట్ జిల్లాలో అత్యధికంగా 55.19% పెరుగుదల నమోదైంది.జనగామలో 21.50, నాగర్‌కర్నూల్‌లో 20.04, ములుగులో 15.36, జోగుళాంబ గద్వాల, కామారెడ్డిలో 15, వనపర్తిలో 11.21, సిరిసిల్లలో 9.90, మహబూబాబాద్‌లో 2.67, మెదక్‌లో 0.27% చొప్పున విక్రయాలు పెరిగాయి. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ఏకంగా 61% తగ్గాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో విక్రయాలు 51% పడిపోయాయి.
ఆ మేకప్ చూసి..భయమేసేది!
అభినయంలో.. ‘సౌందర్య’ను తలపించింది. హావభావాలతో ‘బుల్లితెర అనుష్క’ అన్న పేరు తెచ్చుకుంది. కానీ, అకస్మాత్తుగా సీరియళ్లకు దూరమైంది. మళ్లీ ‘స్టార్ మా’ ‘చెల్లెలి కాపురం’ ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అమాయకుడైన భర్తకు భార్యగా వందకు వంద మార్కులూ కొట్టేసింది. సిరిసిల్లకు చెందిన శిరీష చిన్నతెర ప్రయాణం ఆమె మాటల్లోనే..
ఉగ్రరూపం దాల్చుతున్న కృష్ణమ్మ
హైదరాబాద్, నమస్తేతెలంగాణ/నెట్వర్క్: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతున్నది. ఈ ఏడాది ముందుగానే వరద పలకరించినప్పటికీ భారీస్థాయిలో ఇన్‌ఫ్లోలు నమోదుకాలేదు. కానీ, గత కొన్నిరోజులుగా ఎగువన కురిసిన భారీ వర్షాలతో గురువారం సాయంత్రం నుంచి ఆల్మట్టికి వరద పోటెత్తుతున్నది.
5 బిలియన్ డోసులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏటా ఐదు బిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను తయారుచేస్తూ హైదరాబాద్ ఫార్మా.. వ్యాక్సిన్ క్యాపిటల్‌గా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో మూడోవంతు అని పేర్కొన్నారు.
సామాన్యుల సేవకే.. సివిల్స్
‘ముందు పరీక్షల సంగతి చూడు, మార్కులు ముఖ్యం’, ‘క్లాస్‌లో నీ ర్యాంక్ ఎంత?’, ‘ ఆటపాటలు తర్వాత... చదువే ముఖ్యం’ తరహా అభిప్రాయాలు ఉన్నవారికి తను ఒక జవాబు.
స్థానికులకే ఉద్యోగాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది.
జగమంతా రామమయం
జగదభిరాముడు ఆ శ్రీరామ చంద్రమూర్తి జన్మస్థలమైన అయోధ్యాపురిలో రామ మందిరం నిర్మించాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల కోరిక. ఐదు శతాబ్దాల నుంచి ఎన్నో అవరోధాలు దాటుకొని బుధవారం ఎట్టకేలకు కోవెల నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్ర్తోక్తంగా జరిగిన ఈ మహా క్రతువును టీవీలు, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా తిలకించిన యావత్ ప్రజానీకం భక్తిపారవశ్యంతో పులకితులయ్యారు.
విజయీభవ..విత్తన గణపతి!
విఘ్నాలను తొలగించి, ఆపదల నుంచి గట్టెక్కించమని గణపతిని పూజిస్తాం. ఏ విషయంలో అయినా, మానవ సంకల్పం ఉంటేనే దైవబలం తోడవుతుంది.
ఏడంతస్తుల్లో సచివాలయం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రతిష్ఠ, చరిత్ర, వైభవానికి అద్దంపట్టేలా కొత్త సచివాలయం నిర్మాణం కానున్నది.
కరెంటు వాహనాలపై పన్ను లేదు
100% రోడ్ టాక్స్ మినహాయింపు
సివిల్స్‌లో మనోళ్ల హవా
సివిల్ సర్వీసెస్‌లో మరోసారి తెలంగాణ హవా కొనసాగింది. మంగళవారం విడుదలచేసిన ఫలితాల్లో హర్యానకు చెందిన ప్రదీప్‌సింగ్ మొదటి ర్యాంక్ సాధించారు.
యాక్షన్‌కు సిద్ధం
కరోనా వైరస్ ప్రభా వంతో గత ఐదారు నెల లుగా సినిమా చిత్రీకర ణలు నిలిచిపోయాయి.
జిమ్‌కు వెళ్తున్నారా?
జిమ్‌కు వెళ్లి చెమటలు చిందిస్తే తప్ప, వ్యాయామం చేసినట్టు అనిపించదు చాలామందికి.
వ్యాక్సిన్ల రాజధాని
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో మూడింట ఒకవంతు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. మన రాష్ట్రం ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా వెలుగొందుతున్నదని అన్నారు.
గతేడాది కన్నా ఎక్కువే ఇచ్చాం
ప్రభుత్వం తీసుకుంటున్నఅనుకూల నిర్ణయాలతో రాష్ట్రంలోని రైతులు సంతోషంగా ఉన్నారు, ఈ సమయంలో వారు నిరాశ నిస్పృహల్లో, ఇబ్బందుల్లో ఉన్నట్టు అసత్య కథనాన్ని ప్రచురించడం దుర్మార్గం.
బాలరాముడికి భవ్య మందిరం
నాకు, తోటి భారతీయులందరికీ ఇది ఒక చారిత్రక, ఉద్వేగపూరితమైన రోజు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేకూర్చే శక్తిమంతమైన, సుసంపన్న, శాంతియుత రామరాజ్య భావనకు అయోధ్య ఆలయం భవిష్యత్తులో తార్కాణంగా నిలుస్తుంది. భారతీయులందరినీ ఆ శ్రీరామచంద్రప్రభువు ఆశీర్వదించుగాక.. జై శ్రీరామ్..
తోబుట్టువులుగా..
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు.
సర్కారు దవాఖానల్లో సేవలు భేష్
కరోనా బాధితులకు సర్కారు దవాఖానల్లో గొప్ప సేవలు అందుతున్నాయని, అక్కడి డాక్టర్లు బాగా పనిచేస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కితాబిచ్చారు. సర్కారు దవాఖానల్లో నమ్మకంగా చికిత్స తీసుకోవచ్చని చెప్పారు.
పట్టాలపైకి ప్రైవేట్ రైళ్లు!
ప్రపంచంలో నే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటి.. అత్యధిక సం ఖ్యలో ఉద్యోగులు.. నిత్యం 2 కోట్ల మంది ప్రయాణికులు.
రేపటినుంచి జిమ్, యోగా కేంద్రాలు
అన్‌లాక్ 3.0లో భాగంగా బుధవారం నుంచి జిమ్‌లు, యోగా కేంద్రలను తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతులనిచ్చింది.
భయమే బీమార్
ఇప్పుడు కరోను మించిన రోగమొకటి రాజ్యమేలుతున్నది.
భూమిపూజకు అంకురార్పణ
అయోధ్యలో శ్రీరాముడి దివ్యాలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ క్రతువు ప్రారంభమైంది.
సిపాయిల్లా సఫాయీలు
వాళ్లు.. కరోనాపై పోరులో సిపాయిలు. వైరస్ ఏ రూపంలో ఉన్నదో.. దేన్ని ముట్టుకుంటే ఏమవుతుందో తెలియని అయోమయంలోనూ ఎదురెళ్లి మరీ నిర్మూలిస్తున్న యోధులు సఫాయీలు. రోడ్లపై సాధారణ చెత్తతోపాటు.. కరోనా సోకేందుకు ఆస్కారమున్న వ్యర్థాలను తొలిగించి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న వీరులు. ప్రజలిస్తున్న గౌరవం, ప్రభుత్వం కల్పిస్తున్న ధీమాతోనే తాము ధైర్యంగా కొవిడ్ దవాఖానల్లో పని చేస్తున్నామని అంటున్నారు.
చెరువే ఆదెరువు సమస్త వృత్తులకూ ఆధారం
జలమే జీవం.. నాగరికత పరిఢవిల్లడానికి కారణమూ అదే.. ఆ జలమే లేక ఇబ్బంది పడ్డ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు గాడిన పడుతున్నది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొన్నటి దాకా తుమ్మలు మొలిచిన చెరువులు నిండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్నాయి. ఏండ్ల కింద వలసెళ్లిన కుటుంబాలు పల్లెబాట పట్టాయి. వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతున్నది. 2019-2020 సామాజిక ఆర్థిక దృక్పథం గణాంకాలే ఇందుకు నిదర్శనం.
అమిత్‌షాకు కరోనా
దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్నది. పేద, ధనిక అన్న బేధం లేదు.
రుణదాతా.. సుఖీభవః
‘బజార్'కు వెళ్లి సరుకులు కొన్నంత సులభంగా, ‘బ్యాంక్' నుంచి రుణం పొందగలమా? ఇంటి నుంచి కాలు కూడా కదుపకుండా ‘లోన్' చేతికొస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘బ్యాంక్ బజార్.కామ్'. రుణం కోసం ఒక మహిళ పడ్డ బాధలోంచే ఈ సంస్థ ఆవిర్భవించింది. ‘సామాన్యులు బ్యాంకు రుణం పొందాలంటే అదో తలనొప్పే’ అన్న అభిప్రాయం తప్పని నిరూపించింది రతీకుమార్ శెట్టి.
అలనాటి..అయోధ్యాపురి!
రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథా రామభూతం జగత్ సర్వం రామే రాజ్యం ప్రశాసతి..రఘుకుల తిలకుడి పాలనలో అయోధ్యలో ఎటు చూసినా రామనామ స్మరణే, ఎవరినోట విన్నా రామకథలే! - అంటాడు వాల్మీకి మహర్షి యుద్ధకాండ చివరలో. ఆ మాటకొస్తే, రామ జన్మభూమి వ్యవహారమూ ఓ యుద్ధకాండే! సుదీర్ఘ పోరాట ఫలితంగా, శతాబ్దాల నిరీక్షణ అనంతరం, ఆగస్టు 5న.. భూమిపూజ జరుగనున్నది. కొన్ని యుగాల తర్వాత, జగాలన్నీ ప్రతిధ్వనించేలా ఆ గడ్డమీద రామఘోష వినిపించనున్నది. ఈ సందర్భంగా, అలనాటి అయోధ్య వైభవాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం!