CATEGORIES
Categorías
షర్మిళ అడుగుపెడితే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి:రేవంత్
వైఎస్.షర్మిల కొత్త పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె తెలంగాణలో అడుగుపెడితే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయని అన్నారు. ప్రపంచ నలుమూలలా వైఎస్ అభిమానులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ సీఎంగా వైఎస్ జనరంజక పాలన అందించారని గుర్తుచేశారు. రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలని.. అంతేకానీ రాజన్నబిడ్డలు రాజ్యం ఏలాలని కాదని వ్యాఖ్యానించారు.
నేడు హాలియాలో సీఎం సభ
క్షేత్రస్థాయిపై కేసీఆర్ నజర్ భారీగా ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎంపి తదితరులు
కాంగ్రెస్ ఎమ్మెల్టీ అభ్యర్థులు వీరే...
నల్గొండ ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్రంగారెడ్డి, మహబూబ్ నగర్ అభ్యర్థిగా చిన్నారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
ఎర్రకోట నిందితుడు దీప్ సిద్దూ అరెస్టు
గణతంత్ర దినోత్సవం నాడు చారిత్రక ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటూ గత కొన్నిరోజులుగా కన్పించకుండా పోయిన పంజాబీ నటుడు దీప్ సిద్ధూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.
నల్గొండలో ఎత్తిపోతల వరద
9 ప్రాజెక్టులకు శ్రీకారం • 10న సీఎం శంకుస్థాపన • నల్గొండ నాయకులతో సమావేశం
హెచ్1బీ నూతన నిబంధనలు కొంతకాలం వాయిదా
అమెరికాలో పనిచేసేందుకు వీలుగా భారతీయులు సహా ఇతర దేశాల ఉద్యోగ నిపుణులకు ఇచ్చే హెచ్-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో ట్రంప్ తీసుకొచ్చిన నూతన నిబంధనలను బైడెన్ ప్రభుత్వం కొంతకాలం వాయిదా వేసింది.
భారత రక్షణ రంగం బలోపేతం
కరోనా కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్నా ఏరో ఇండియా వంటి పెద్ద కార్యక్రమాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. శుక్రవారం ఏరో ఇండియా కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు.
త్వరలో డిజిటల్ కరెన్సీపై నిర్ణయం
డిజిటల్ కరెన్సీ మోడల్ పై కేంద్ర బ్యాంక్ అంతర్గత కమిటీ కసరత్తు సాగుతోందని, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయంతో ముందుకు వస్తామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో తెలిపారు. డిజిటల్ కరెన్సీపై ఆర్ బీఐ ద్రవ్య విధాన కమిటీ గతంలోనే ప్రకటన చేసిందని గుర్తుచేశారు.
ఢిల్లీ మినహా..నేడు దేశవ్యాప్తంగా రహదారుల ధిగ్బంధం
విపక్షాల మద్ధతు ... శాంతియుతంగానే చేపడుతాం రైతుసంఘాలు
నేడు టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ..
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల్లో నేటి టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమా వేశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. సమావేశంలో ఏయే అంవాలపై చర్చ సాగుతుందన్న అంశం ఆసక్తిగా మారిం ది. కెటిఆర్‌ను సిఎం చేస్తామన్న ప్రచా రం, కవితకు మంచి పదవిని కట్టబెడ తారన్న ప్రచారాల నేపథ్యంలో జరగుతు న్న కార్యవర్గ భేటీ కావడంతో సహజంగా నే ఆసక్తి న ఎలకొంది.
వ్యవసాయ చట్టాల ద్వారా దేశానికి నష్టం
నూతన వ్యవసాయ చట్టాల ద్వారా దేశానికి నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. వీటి నుంచి దేశాన్ని రక్షించేందుకే రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారన్నారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేయడంతో పాటు సరిహద్దుల్లో తమపై వేధింపులు ఆపాలంటూ శనివారం రైతులు దేశవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహి స్తున్నారు.
విమాన విడిభాగాలు హైదరాబాద్‌లో తయారీ
అమెరికా విమాన తయారీ కంపెనీ బోయింగ్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఇండియాలోని తమ పార్టనర్స్ సంస్థ అయిన టాటా బోయింగ్ ఏరోస్పోస్ లిమిటెడ్ ఇకపై... 737 తరహా బోయింగ్ విమానాల కాంప్లెక్స్ వెర్టికల్ ఫిన్ విడి భాగాలను హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో తయారుచేయనుందని తెలిపింది.
దేశవ్యాప్తంగా చక్కాజాం విజయవంతం
శాంతియుతంగా ర్యాలీలు, ప్రదర్శనలు ఎక్కడికక్కడ రోడ్లను దిగ్భంధించిన రైతులు పలుచోట్ల ధర్నాలతో ఆందోళనలకు దిగిన నేతలు
కేసీఆర్ జన్మదినకానుకగా కోటి వృక్షార్చన
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కానుకగా ఒకే రోజు.. ఒకే గంటలో కోటి మొక్క లను నాటేలా 'కోటి వృక్షార్చన' పేరిట హరిత పండుగను నిర్వహించ సంకల్పించింది.
రైతు సమస్యలకోసమే పాదయాత్ర: రేవంత్
రాజ్యాంగం ద్వారా వచ్చిన సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయన్నారు.
బడ్జెట్లోనే 'పరిషత్'లకు నిధులు
• జిల్లా, మండల పరిషత్ లకు నేరుగా కేటాయింపులు • స్థానిక స్వపరిపాలన సంస్థల బలోపేతం మండల, జిల్లా స్థాయి అనుమతులు అవసరం లేకుండానే గ్రామపంచాయతీలు తమ నిధులు వినియోగించుకోవచ్చు:సీఎం కేసీఆర్
నాలుగు విప్లవాలు..హరిత, నీలి, గులాబీ, శ్వేత
రాష్ట్రంలో హరిత, నీలి, గులాబీ, శ్వేత విప్లవాలు ఆవిష్కృతమయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నాలుగు రకాల విప్లవాలతో గ్రామీణ ఆర్థిక జీవనంలో మార్పులు వస్తాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
గుర్రంపోడు భూముల వివాదం నిరూపించండి... రాజీనామా చేస్తాం
గుర్రంబోడుతండాలో నిన్న భారతీయ జనతా పార్టీ తలపెట్టిన గిరిజన భరోసా యాత్ర ఓ వంచన యాత్ర అని హుజురనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ నిన్న నిర్వహించిన ఆ యాత్రలో స్థానికులు ఎవరూ లేరు అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈడబ్ల్యూఎస్ జీవో జారీ
ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. ఈ రిజర్వేషన్లను రాష్ట్రం లోనూ అమలు చేయనున్నట్లు ఈ మధ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రేవంత్ పాదయాత్ర అచ్చంపేట నుంచి హైదరాబాదు..
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాదు ఆయన పాదయాత్రగా బయల్దేరారు.
సచిన్‌కు శరద్ పవార్ చురకలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షలకు అంతర్జాతీయ ప్రముఖులు మద్దతు ప్రకటంచడం భారత్ పెను దుమారాన్ని రేపుతోంది. తమ దేశ అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారతీయ ప్రముఖులు కౌటరిస్తున్నారు.
మమతకు మనసులేదు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. విమ ర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకు న్నాయి. తాజాగా హల్దియాలో నిర్వ హించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని తృణమూల్ అధి నేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఏకులకు,మేకులకు భయపడం
సాగుచట్టాలు రద్దు చేసేవరకు పోరాటం ఆగదు స్పష్టం చేసిన రైతు సంఘాల నాయకులు
తిరుమల దర్శనం... ఏపీఎస్ ఆర్టీసీ... ఫుల్ డిమాండ్!
ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఎంచుకునే స్లాట్ లో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లే అవకాశాన్ని కల్పించిన తరువాత, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
కాంగ్రెసు బలోపేతం చేస్తాం
కాంగ్రెస్ శంఖారావం ఖమ్మం నుంచి మళ్లీ ప్రారంభం కానుందని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ తెలిపారు. 2018 ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ కు తిరుగులేదని పార్టీ కార్యకర్తలు నిరూపించినా.. వారి కష్టంతో గెలిచిన ఎమ్మెల్యేలు మోసం చేశారని విమర్శించారు.
ఉత్తరాఖండ్‌లో జలప్రళయం...
మంచు చరియలు విరగడంతో బౌలి గంగానది ఉగ్రరూపం 150 మంది గల్లంతు.. • విద్యుత్ ప్రాజెక్ట్ ధ్వంసం..
మయన్మార్ సైనిక సర్కారుపై ఉద్యోగుల తిరుగుబాటు
విధులు బహిష్కరించి నిరసన
దిగివస్తున్న పసిడి
దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధర లు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా నా లుగో రోజు పసిడి ధర తగ్గుముఖం పట్టిం ది.
కరోనా కష్టాల్లోనూ సత్తా చాటిన కర్షకులు
కరోనా సంక్షోభ వేళ కూడా భారత్ రికార్డు స్థాయిలో పంటను ఉత్పత్తి చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడిం చారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత
మార్గదర్శకాల జారీ...